విశాఖపట్నంలో వార్డు వాలంటీర్‌పై దారుణం...
విశాఖపట్నంలో ఓ వ్యక్తి వార్డు వాలంటీర్ మీద కత్తితో దాడి చేశాడు. కడుపులో కత్తితో రెండుసార్లు పొడవడంతో బాధితుడి పరిస్థితి సీరియస్‌గా మారింది.
news18-telugu
Updated: December 4, 2019, 10:12 PM IST

ప్రతీకాత్మక చిత్రం
- News18 Telugu
- Last Updated: December 4, 2019, 10:12 PM IST
విశాఖపట్నంలో ఓ వ్యక్తి వార్డు వాలంటీర్ మీద కత్తితో దాడి చేశాడు. కడుపులో కత్తితో రెండుసార్లు పొడవడంతో బాధితుడి పరిస్థితి సీరియస్‌గా మారింది. ఇటీవల ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలకు వివిధ రకాల కార్డులను ఇవ్వాలని నిర్ణయించింది. అందుకోసం గ్రామాల్లో వాలంటీర్లను సర్వే చేయాల్సిందిగా ఆదేశించింది. ఈ క్రమంలో విశాఖ మధురవాడలోని కే 1 కాలనీలో కొన్ని ఇళ్లకు ఓ వ్యక్తిని వాలంటీర్‌గా నియమించారు. ఆ వాలంటీర్.. గత నెల 20 నుంచి 30 వరకు తనకు కేటాయించిన ఇళ్లలో సర్వే చేశాడు. అయితే, తన ఇంటికి మాత్రం సర్వే చేయడానికి రాలేదని, అతడుసర్వే చేయకపోవడం వల్ల తనకు వచ్చే పథకాలు ఆగిపోతాయన్న కోపంతో నిందితుడు కత్తితో వాలంటీర్ మీద దాడి చేశాడు. దీంతో బాధితుడిని చుట్టుపక్కల వారు విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే : దిశా చట్టం,ప్రజా రవాణా శాఖ ఏర్పాటు
Scholarship: టెన్త్ చదువుతున్న అమ్మాయిలకు ఎన్టీఆర్ ట్రస్ట్ స్కాలర్షిప్ టెస్ట్... రేపే లాస
జగన్‌కు మరో షాక్... కేంద్రమంత్రులకు వైసీపీ ఎంపీ విందు
పవన్ కళ్యాణ్‌తో గ్యాప్ ఉంది: జనసేన ఎమ్మెల్యే
వంశీ విషయమై.... స్పీకర్‌ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యేలు
అసెంబ్లీ కౌన్సిల్ ఛైర్మన్‌కు టీడీపీ నేతల ఫిర్యాదు
Loading...