Home /News /crime /

WARD VOLUNTEER COMMITS SUICIDE IN ONGOLE DISTRICT PRN

Andhra Pradesh: చనిపోతున్నానంటూ రోజూ వాట్సాప్ స్టేటస్.. చివరికి ఏంజరిగిందంటే..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఒంగోలులో (Ongole) వార్డు వాలంటీర్ (Ward Volunteer) భువనేశ్వరి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. ఆమెది హత్య (Murder) కాదు ఆత్మహత్య (Suicide) అని నిర్ధారించారు.

  సోషల్ మీడియా స్నేహాలు పైపై మాటలకేనని మరోసారి ప్రూవ్ అయింది. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు 15 రోజుల ముందే ఓ యువతి వాట్సాప్ గ్రూప్ లో  పోస్ట్ చేస్తే ఆమె ఫ్రెండ్స్ కనీసం పట్టించుకోలేదు. సరికదా ఏం జరిగిందంటూ చిన్న మెసేజ్ కూడా పెట్టలేదు.  ఈ విషయాన్ని తల్లిదండ్రులకు కూడా చెప్పలే చివరకి ఆ యువతి అన్నంత పనీ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో వార్డ్ వాలంటీర్ పనిచేస్తున్న ఉమ్మనేని భువనేశ్వరి ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పెట్రోల్ పోసుకొని పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఆమెను పోలీసులు గుర్తించారు. ఆమెది హత్య అని కుటుంబ సభ్యులు ఆరోపించడంతో పోలీసులు దర్యాప్తు చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం భువనేశ్వరి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. ఐతే ఆమె ఆత్మహత్య చేసుకున్న తీరు మాత్రం పోలీసులనే షాక్ కు గురిచేసింది.

  ఒంగోలు గోపాల్‌నగర్‌కు చెందిన భువనేశ్వరి పుట్టుకతోనే దివ్యాంగురాలు. ఆమె సోదరి నర్మదసాయి కూడా దివ్యాంగారులే. తండ్రి చిన్నతనంలోనే చనిపోవడంతో ఆమె తల్లి జానకి కలెక్టరేట్ సమీపపంలోని ఓ బుక్ షాప్ లో పనిచేస్తూ పిల్లల్ని పోషిస్తోంది. బీకామ్‌ కంప్యూటర్స్‌ చదువుకున్న భువనేశ్వరి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో ఎంబీఏ చదువుతోంది. ప్రస్తుతం ఏడో డివిజన్ వార్డు సచివాలయం పరిధిలో వాలంటీర్ గా పనిచేస్తోంది. నాలుగు రోజుల క్రితం భువనేశ్వరి.. కమ్మపాలెం-దశరాజుపల్లి రోడ్డులో అనుమానాస్పద స్థితిలో మంటల్లో కాలిపోయి మృతి చెందింది. దీంతో ఆమెను ఎవరో హత్య చేసి ఉంటారని అందరూ భావించారు. కానీ దర్యాప్తులో ఆమెది సూసైడ్ గా తేలింది. వార్డు వాలంటీర్ కావడంతో ఆమె ట్రైసైకిల్ పై తిరుగుతూ విధులు నిర్వహించేంది. ఎక్కడికైనా వెళ్లాలంటే తన స్నేహితుడు రాము ఆటోలో వెళ్లేది. చనిపోయిన రోజు ఆమె రాముకు ఫోన్ చేసి తనకు 3 లీటర్ల పెట్రోల్ కావాలని కోరింది. కొద్దిసేపటికి అతడు తెచ్చిచ్చాడు. పెట్రోల్ తీసుకొని దశరాజుపల్లి రోడ్డుకు వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. భువనేశ్వరి మంటల్లో కాలిపోతుండగా దశరాజుపల్లిగ్రామానికి చెందిన కొండయ్య అనే ఓ సెక్యూరిటీ గార్డు చూసి పోnీసులకు సమాచారమిచ్చాడు. మానసిక కుంగుబాటుతోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తేల్చారు.

  సూసైడ్ పై వాట్సాప్ స్టేటస్..
  భువనేశ్వరి సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ తో చాటింగ్ చేస్తుండేది. ఈ క్రమంలో ఈనెల 18న సాయంత్రం గుంటూరు, విశాఖ, శ్రీకాకుళంకు చెందిన యువకులతో చాటింగ్ చేసింది. తాను చనిపోతున్నానంటూ గ్రూప్ లో మెసేజ్ పెట్టింది. అంతకుముందు బెంగళూర్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసే యువకుడికి ఆత్మహత్య చేసుకుంటున్నానని వాయిస్ మెసేజ్ చేసింది. ఇక చనిపోవడానికి 15 రోజుల క్రితమే నా జీవితంలో ఇవే చివరి 15 రోజులఅంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టింది. ఆ తర్వాత 14 రోజులు, 13 రోజులు, 12 రోజులు అంటూ స్టేటస్ అప్ డేట్ చేస్తూ వచ్చింది. వీటిని ఆమె ఫ్రెండ్స్ చూసినాకానీ పట్టించుకోలేదు. ఆమె కుటుంబ సభ్యులకు కూడా ఈ విషయాన్ని చెప్పలేదు. భువనేశ్వరి వాట్సాప్ స్టేటస్ చూసిన వారిలో ఒక్కరు స్పందించి కౌన్సెలింగ్ ఇచ్చినా ఆమె బ్రతి ఉండేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Facebook, Suicide, Whatsapp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు