విశాఖలో వార్డు వాలంటీర్‌పై కత్తితో దాడి... పరిస్థితి విషమం

అయితే ఈ సర్వేకోసం తన ఇంటికి రాలేదని ఆగ్రహంతో ఊగిపోయిన ఓ వ్యక్తి వలంటీర్ పై ఈ దాడికి పాల్పడ్డాడు.

news18-telugu
Updated: December 4, 2019, 3:13 PM IST
విశాఖలో వార్డు వాలంటీర్‌పై కత్తితో దాడి... పరిస్థితి విషమం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:

విశాఖలో వార్డు వాలంటీర్‌పై దాడి జరిగింది. తన ఇంటకిి సర్వేకు రాలేదన్న కోపంతో ఓ వ్యక్తి దాడికి దిగాడు. కత్తితో పొట్టలో రెండుసార్లు పొడవడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడ్ని చికిత్స నిమిత్తం కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు.  మధురవాడ పరిధిలోని కె-1 కాలనీ వార్డు వలంటీర్‌గా లాల్ బహుదూరాయ్ నియమితుడయ్యాడు. ఇటీవల ప్రభుత్వం తెల్ల కార్డును పలు రకాల కార్డులుగా విభజించి వేర్వేరు కార్డులు జారీకి ఆదేశాలు ఇచ్చింది. దీంతో వార్డు వలంటీర్లు గత నెల 20వ తేదీ నుంచి 30 వ తేదీ వరకు సర్వే నిర్వహించారు. ఈ మేరకు బియ్యం, ఫీజురియంబర్స్ మెంట్, పింఛన్లు, ఆరోగ్యశ్రీ తదితరాలకు సంబంధించి వేర్వేరు జాబితా తయారు చేస్తారు. అయితే ఈ సర్వేకోసం తన ఇంటికి రాలేదని ఆగ్రహంతో ఊగిపోయిన ఓ వ్యక్తి వలంటీర్ పై ఈ దాడికి పాల్పడ్డాడు. కత్తితో కడుపులో పోడిచాడు. దీంతో తీవ్రంగా గాయపడిన వాలంటీర్‌ను స్థానికులు కేజీహెచ్ కి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

First published: December 4, 2019, 3:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading