WARD MEMBER CANDIDATE FROM JEHANABAD WAS SEEN DOING OBSCENE DANCE WITH THE GIRL IN THE VIRAL VIDEO SSR
Viral: ఇదేందయ్య ఇది.. ఇది నేను చూడలా.. వైరల్‌గా మారిన వీడియో.. వీళ్లిద్దరూ ఎవరంటే..
వీడియోలోని దృశ్యాలు
అతనో టీచర్. ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌లో విద్యార్థులకు క్లాసులు చెబుతుంటాడు. వార్డు మెంబర్‌గా పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేశాడు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ ఆ టీచర్‌కు సంబంధించిన డ్యాన్స్ వీడియో ఒకటి తాజాగా వైరల్ అయింది.
అతనో టీచర్. ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌లో విద్యార్థులకు క్లాసులు చెబుతుంటాడు. వార్డు మెంబర్‌గా పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేశాడు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ ఆ టీచర్‌కు సంబంధించిన డ్యాన్స్ వీడియో ఒకటి తాజాగా వైరల్ అయింది. ఆ వీడియోలో కోచింగ్ సెంటర్‌లో విద్యార్థినితో ఆ టీచర్ వేసిన వెకిలి డ్యాన్స్‌లు అతనిని నవ్వులపాలు చేశాయి. అతనిని అందరూ అసహ్యించుకునేలా చేశాయి.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని జెహనాబాద్‌లో వరుణ్ కుమార్ అనే వ్యక్తి ఇస్లామ్‌పూర్ అనే ప్రాంతం నుంచి వార్డు మెంబర్‌గా పోటీ చేస్తున్నాడు. నవంబర్ 3న ఆరో విడత ఎన్నికల్లో భాగంగా ఈ వార్డుకు ఎన్నిక జరగనుంది. ఇదే సమయంలో ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌లో టీచర్‌గా విద్యా బోధన చేస్తున్న వరుణ్‌కు సంబంధించిన పాత వీడియో ఒకటి తాజాగా వైరల్ అయింది. అదే కోచింగ్ సెంటర్‌లో క్లాసులు వింటున్న ఓ విద్యార్థిని వరుణ్‌తో కలిసి ఓ బాలీవుడ్ సాంగ్‌కు స్టెప్పులేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియోలో వరుణ్ మాత్రమే కాదు ఆ విద్యార్థిని కూడా ఫుల్ జోష్‌తో అతనితో డ్యాన్స్ చేస్తోంది. అయితే.. ఆ వీడియోలో ఉన్నది వరుణే కానీ అది తమ కోచింగ్ సెంటర్‌లో కాదని.. ఆ యువతి కూడా తమ విద్యార్థిని కాదని ఆ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ చెప్పుకొచ్చారు.
హులస్గంజ్ పోలీసులు ఈ వీడియోపై మాట్లాడుతూ.. ఈ వీడియోపై తమకు ఎలాంటి రాతపూర్వక ఫిర్యాదు అందలేదని.. ఫిర్యాదు అందితే విచారణ జరుపుతామని చెప్పారు. ఈ వీడియోపై వరుణ్ మద్దతుదారులు మాట్లాడుతూ తనపై ఓటర్లలో వ్యతిరేకత పెంచేందుకు ప్రత్యర్థులు చేసిన కుట్రగా చెప్పుకొచ్చారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఆ వీడియోలో ఉన్నది మాత్రం వరుణ్ కుమారేనని తెలిసింది. ఇస్లాంపూర్ మార్కెట్ ప్రాంతంలో వరుణ్ ఓ రూంలో ఉండేవాడని.. ఆ రూంలోనే ఈ డ్యాన్స్ చేసినట్లు సమాచారం. అయితే.. ఆ వీడియోలో ఉన్న యువతి ఎవరనే విషయంపై స్పష్టత లేదు. ఏదేమైనా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో జెహనాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఈ డ్యాన్స్ వీడియో హాట్ టాపిక్‌గా మారింది.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.