హోమ్ /వార్తలు /క్రైమ్ /

భయంగా ఉంది గన్ లైసెన్స్ ఇవ్వండి... పోలీసులకు వరంగల్ మహిళ లేఖ

భయంగా ఉంది గన్ లైసెన్స్ ఇవ్వండి... పోలీసులకు వరంగల్ మహిళ లేఖ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇటీవల హన్మకొండలో జరిగిన దారుణ ఘటన మా ఇంటికి సమీపంలోనే ఉంది. నేను అదే మార్గంలో ప్రయాణిస్తాను అంటూ లేఖలో రాసింది.

రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో తనకు గన్ లైసెన్స్ కావాలని వరంగల్‌ నగరానికి చెందిన ఓ మహిళ ఈ మెయిల్ ద్వారా కమిషనరేట్ పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు. బయటికి వెళ్లాలంటే భయం వేస్తోందని, ఆత్మరక్షణ కోసం తమకు ఆయధం అవసరం ఉందని దరఖాస్తులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ దరఖాస్తును పరిశీలించి మహిళల రక్షణ కోసం చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మహిళలపై హింసకు సంబంధించి ఇటీవల నా చుట్టూ జరుగుతున్న పరిణామాలను నన్ను భయాందోళనకు గురిచేస్తున్నాయి లేఖలో ఆమె పేర్కొంది. ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేసుకుంటున్న నాకు బయటకు వెళ్లాలంటేనే భయమేస్తోందంది. విధుల కోసం రోజూ ఉదయం వెళ్లి.. రాత్రి వస్తుంటాను. ఇటీవల హన్మకొండలో జరిగిన దారుణ ఘటన మా ఇంటికి సమీపంలోనే ఉంది. నేను అదే మార్గంలో ప్రయాణిస్తాను అంటూ లేఖలో రాసింది.

ఆ వార్త చదివినప్పటి నుంచి ఇంటికి సురక్షితంగా వస్తానన్న నమ్మకం ఉండటంలేదని పోలీసులకు రాసిన లేఖలో మహిళ తెలిపింది.. అత్యవసర సమయాల్లో 100కు ఫోన్‌ చేసినా పోలీసులు సకాలంలో వస్తారన్న భరోసా లేదంది. పోలీసులపై నమ్మకం లేక అలా చెప్పడం లేదు.. అభివృద్ధి చెందిన దేశాల్లోనే సాధ్యం కానిది వరంగల్‌లో సాధ్యమవుతుందని అనుకోవడం అత్యాశే అవుతుందని తెలిపింది. ఆపదలో ఉన్న తనను తాను కాపాడుకోలేనప్పుడు రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కుకు అర్థమేం ఉంటుంది? అందుకోసమే రివాల్వర్‌ లైసెన్స్‌ కావాలని కోరతున్నా. మీరు నిరాకరిస్తే ఉద్యోగం వదిలేసి ఇంట్లోనే ఉండాల్సి వస్తుందేమో'' అని లేఖలో సదరు మహిళ పేర్కొంది. ఇప్పుడీ ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

First published:

Tags: Gun fire, Telangana, Telangana News, Warangal

ఉత్తమ కథలు