వరంగల్ రేపిస్టుకు ఉరి శిక్ష మార్పు... సుప్రీంకు వెళ్లనున్న పోలీసులు

వరంగల్‌లో 9 నెలల చిన్నారి మీద అత్యాచారం చేసి హత్య చేసిన రేపిస్టుకు శిక్ష తగ్గించడాన్ని సవాల్ చేస్తూ పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు.

news18-telugu
Updated: December 9, 2019, 9:30 PM IST
వరంగల్ రేపిస్టుకు ఉరి శిక్ష మార్పు... సుప్రీంకు వెళ్లనున్న పోలీసులు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వరంగల్‌లో సంచలనం సృష్టించిన 9 నెలల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో దోషి అయిన ప్రవీణ్‌కు ఉరి శిక్షను రద్దు చేసిన హైకోర్టు జీవితఖైదుగా మార్చడంపై వరంగల్ పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. నిందితుడికి శిక్ష తగ్గించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నారు. ఈ ఏడాది జూన్‌లో వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ టైలర్ స్ట్రీట్‌లో 9 నెలల చిన్నారిపై ప్రవీణ్ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. జగన్-రచనల కుమార్తె అయిన చిన్నారి తల్లిదండ్రులతో కలిసి దాబాపై నిద్రిస్తుండగా..ప్రవీణ్ అక్కడికెళ్లాడు. ఆడిపిస్తానని తీసుకెళ్లి తిరిగి తీసుకురాలేదు. దీంతో ఆందోళన చెందిన చిన్నారి తల్లిదండ్రులు అతని ఇంటి వైపు వెళ్లారు.
చిన్నారి అక్కడ విగతజీవిగా పడి ఉండటంతో ఇద్దరు షాక్ తిన్నారు. ప్రవీణ్ అత్యాచారం జరిపి హత్య చేసినట్టుగా గుర్తించారు. ఈకేసులో కింది కోర్టు అతడిని దోషిగా తేల్చి ఉరి శిక్ష విధించింది. అయితే, హైకోర్టు ఆ ఉరి శిక్షను జీవితఖైదుగా మార్చింది.

First published: December 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>