తెలంగాణలో బాలిక కిడ్నాప్... రెడ్ లైట్ ఏరియాలో అమ్మేస్తామంటూ వార్నింగ్

బాలిక రెండోసారి కిడ్నాప్ కు గురికావడం కలకలం రేపుతోంది. గతంలో ఓ సారి కొందరు యువకులు బాలికను కిడ్నాప్ చేయగా, పోలీసులు ఆమెను గుర్తించి విడిపించారు.

news18-telugu
Updated: December 29, 2019, 8:02 AM IST
తెలంగాణలో బాలిక కిడ్నాప్... రెడ్ లైట్ ఏరియాలో అమ్మేస్తామంటూ వార్నింగ్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వరంగల్‌లో బాలిక కిడ్నాప్ మరోసారి కలకలం రేపింది. గతంలో కూడా ఇదే బాలికను కిడ్నాప్‌ చేశారు. అయితే తన కూతుర్ని కిడ్నాప్ చేసిన దుండగులు .. రెడ్ లైట్ ఏరియాలో అమ్మేస్తానంటూ బెదిరిస్తున్నారంటూ ఓ తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. అయితే పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. గతంలో కిడ్నాప్ చేసిన వారే ఈ దఫా కూడా ఈ పని చేసి ఉండవచ్చని తండ్రి అనుమానాం వ్యక్తం చేశారు. కిడ్నాపర్లతో, తన కుమార్తెతో మాట్లాడిన ఆడియోను పోలీసులకు అందించారు. కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు, బాలిక ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

వరంగల్ జిల్లా, కాజీపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాలిక రెండోసారి కిడ్నాప్ కు గురికావడం కలకలం రేపుతోంది. గతంలో ఓ మారు కొందరు యువకులు బాలికను కిడ్నాప్ చేయగా, పోలీసులు ఆమెను గుర్తించి విడిపించారు. నిందితులను అరెస్ట్ చేయగా, వారికి బెయిల్ మంజూరైంది. ఈ కేసు కోర్టులో నడుస్తుండగానే ఆమె మరోసారి కిడ్నాప్ కు గురికావడంతో పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
Published by: Sulthana Begum Shaik
First published: December 29, 2019, 8:02 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading