హోమ్ /వార్తలు /క్రైమ్ /

Siblings : అయ్యో.. అన్నాచెల్లెలూ మిగల్లేదు.. వాళ్ల కుటుంబానికి జరిగింది తెలిస్తే తట్టుకోలేరు!

Siblings : అయ్యో.. అన్నాచెల్లెలూ మిగల్లేదు.. వాళ్ల కుటుంబానికి జరిగింది తెలిస్తే తట్టుకోలేరు!

మృతులు రాకేశ్, ప్రసన్న

మృతులు రాకేశ్, ప్రసన్న

అమ్మానాన్నల్ని కోల్పోయి, బంధువుల అండతో పెద్దయిన అన్నాచెల్లెళ్లు మరికొద్ది రోజుల్లో వేర్వేరు పెళ్లిళ్లు చేసుకోవాల్సి ఉండగా ఘోరం జరిగింది. అదేదో పరీక్ష పెట్టినట్లు ఏళ్ల వ్యవధిలో మృత్యుదేవత ఆ కుటుంబాన్ని ఒకేలా పొట్టనపెట్టుకుంది..

అంతలోనే సంతోషాలు, కొద్ది కాలానికే విషాదాలు, మళ్లీ సంబురాలు.. ఆ వెంటనే ఏడుపులు.. వేటికవే మిస్టరీలుగా మనందరి జీవితాలు అనూహ్యమలుపులతో సాగిపోతుంటాయి. చాలా జీవితాలు అర్ధం లేకుండా, ఇంకొన్ని అర్ధాంతరంగా ముగుస్తుంటాయి. అయితే, ఈ కుటుంబానిది మాత్రం మరీ విషాదగాథ. అమ్మానాన్నల్ని కోల్పోయి, బంధువుల అండతో పెద్దయిన అన్నాచెల్లెళ్లు మరికొద్ది రోజుల్లో వేర్వేరు పెళ్లిళ్లు చేసుకోవాల్సి ఉండగా ఘోరం జరిగింది. అదేదో పరీక్ష పెట్టినట్లు ఏళ్ల వ్యవధిలో మృత్యుదేవత ఆ కుటుంబాన్ని ఒకేలా పొట్టనపెట్టుకుంది..

తల్లిదండ్రులను కోల్పోయిన ఆ అన్నాచెల్లెళ్లకు బంధువులు అండగా నిలిచారు. గత నెలలో ఇద్దరికీ పెళ్లి సంబంధాలు చూసి నిశ్చితార్థాలూ చేశారు. మరికొన్ని రోజుల్లో ఇద్దరికీ ఒకేసారి పెండ్లి చేద్దామని నిర్ణయించారు. ఇంతలోనే రోడ్డు ప్రమాదం ఆ అన్నాచెల్లెల్ని బలితీసుకున్నది. పోలీసులు, స్థానికులు చెప్పిన వివరాలివి..

peddapalli : పండంటి మగబిడ్డకు జన్మనిచ్చి.. ఆస్పత్రి బాత్రూమ్‌లో ఎందుకమ్మా అలా చేశావ్!వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలం దబ్బీర్‌పేటకు చెందిన మొగుళ్ల రమేశ్‌-విజయ దంపతులకు ఇద్దరు సంతానం. కుమారుడు రాకేశ్‌(25) ఇంటర్‌ పూర్తిచేసి స్థానికంగా హార్వెస్టర్‌ నడుపుతున్నాడు. కూతురు ప్రసన్న (22) ఇటీవలే డిగ్రీ పూర్తిచేసింది. వరంగల్‌లో ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు ఆదివారం సాయంత్రం అన్నాచెల్లెళ్లు ద్విచక్ర వాహనంపై దబ్బీర్‌పేట నుంచి బయల్దేరారు..

omicron : నేటి నుంచి నైట్ కర్ఫ్యూ.. బయటికొస్తే బుక్ అయిపోతారు.. ఇవే రూల్స్..అన్నాచెల్లెళ్లు ప్రయాణిస్తోన్న బైక్.. నర్సంపేట మండలం మహేశ్వరం గ్రామ శివారులో నర్సంపేట-వరంగల్‌ ప్రధాన రహదారిపై ప్రమాదానికి గురైంది. వేగంగా దూసుకొచ్చిన ఓ టిప్పర్‌ లారీ వారి వాహనాన్ని ఢీకొట్టింది. రాకేశ్‌, ప్రసన్న స్పాట్‌లోనే చనిపోయారు. సరిగ్గా ఐదేళ్ల కిందట..

Actress suicide : డ్రగ్స్ కేసు భయంతో.. యువ నటి ఆత్మహత్య.. కానీ వాళ్లు ఫేక్ NCBఅన్నాచెల్లెళ్లు రాకేశ్-ప్రసన్నలు చనిపోవడానికి ఐదేళ్ల ముందు.. వాళ్ల తండ్రి రమేశ్ కూడా రోడ్డు ప్రమాదంలోనే ప్రాణాలు కోల్పోయాడు. తండ్రి పోయిన తర్వాత పిల్లల్ని బాధ్యతగా పెంచిన తల్లి విజయ కూడా రెండేళ్ల కిందటే మరో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అమ్మానాన్నల్ని కోల్పోయిన తర్వాత రాకేశ్-ప్రసన్నలు నానమ్మ మొగుళ్ల సాంబలక్ష్మి ఇంట్లో ఉంటున్నారు. ఐదేళ్ల వ్యవధిలో కొడుకు, కోడలు, మనుమడు, మనవరాలు దాదాపు ఒకేలా రోడ్డు ప్రమాదాల్లో చనిపోవడంతో నానమ్మ సాంబలక్ష్మి కన్నీరుమున్నీరయ్యేలా విలపిస్తోంది. ఆ కుటుంబంలో జరిగిన విషాదాలను తలుచుకుంటూ ఊరంతా కన్నీరుపెడుతోంది. రోడ్డు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

First published:

Tags: NARSAMPET, Road accident, WARANGAL DISTRICT

ఉత్తమ కథలు