Home /News /crime /

WARANGAL CP EXPLAINS GORREKUNTA 9 MURDERS STORY SK

ఒక హత్యను కప్పిపుచ్చేందుకు 9 హత్యలు..వీడిన గొర్రెకుంట మర్డర్స్ మిస్టరీ

గొర్రెకుంట బావి

గొర్రెకుంట బావి

రఫీక కనిపించకపోయే సరికి.. మక్సూద్ భార్య సంజయ్‌ని ప్రశ్నించింది. మా అక్క కూతురు ఎక్కడుందని అడిగింది. ఆమె ఊరికి వెళ్లిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు సంజయ్. ఏం జరిగిందో చెప్పకపోతే పోలీసులకు చెప్పుతామని బెదిరించడంతో... సంజయ్ వారి హత్యకు ప్లాన్ చేశాడు

ఇంకా చదవండి ...
  తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెకుంట 9 హత్యల కేసును పోలీసులు ఛేదించారు. బీహార్‌కు చెందిన సంజయ్ కుమార్ అనే వ్యక్తే వారందరినీ చంపేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఒక హత్యను కప్పిపుచ్చుకునేందుకు మరో 9 హత్యలను చేశాడని వరంగల్ సీపీ తెలిపారు. నిద్రమాత్రలు ఇచ్చిన తర్వాత గోన సంచుల్లో కట్టి ఒక్కొక్కరిగా బావిలో విసిరేశాడని చెప్పారు. అతడు మొత్తం 10 హత్యలు చేసినట్లు వెల్లడించారు. సోమవారం మధ్యాహ్నం నిందితుడు సంజయ్ కుమార్‌ని అరెస్ట్ చేసినట్లు వివరించారు.

  పోలీసుల కథనం ప్రకారం.. గిన్నీ గోడౌన్ ఓనర్ ఫిర్యాదు మేరకు గీసుకొడ పీఎస్‌లో 21న కేసు నమోదయింది. ఆ రోజు బావిలో నుంచి 4 శవాలు లభ్యమయ్యాయి. మక్సూద్, భార్య నిషా, కూతురు బూస్రా, మనవడు శవాలను మార్చి 21న స్వాధీనం చేసుకున్నాం. ఆ తర్వాతి రోజు బావిలో నీటిని తోడిన తర్వాత మక్సూద్‌ కుమారులు షాబాజ్‌ ఆలం(21), సోహెల్‌ ఆలం(18)తో పాటు బిహార్‌కు చెందిన వలసకార్మికులు శ్యాం(20), శ్రీరాం(21), త్రిపురకు చెందిన షకీల్‌ (30) మృతదేహాలు లభ్యమయ్యాయి. దీనిపై 6 బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించాం. టాస్క్‌ఫోర్స్, సీసీఎస్, క్లూస్ టీమ్‌లు కలిసి కేసును ఛేదించాం. మక్సూద్ ఫ్యామిలీలో ఆరుగురు ఉన్నారు. మక్సూద్, ఆయన భార్య గోనె సంచుల ప్యాక్టరీలో పనిచేస్తారు. గతంలో ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సమయంలో బీహార్‌కు చెందిన సంజయ్ పరిచయం అయ్యాడు. ఆ తర్వాత కొంతకాలానికి మక్సూద్ భార్య అక్క కూతురు రఫీక (37) ముగ్గురు పిల్లలను తీసుకొని వెస్ట్ బెంగాల్ నుంచి వరంగల్‌కు వచ్చింది. మక్సూద్ సహకారంతో గోనె ఫ్యాక్టరీలో పనిచేసింది.

  రఫీక వారందరికీ భోజనం వండిపెట్టేది. అలా రఫీక, సంజయ్‌ మధ్య పరిచయం పెరిగింది. ఆ తర్వాత ముగ్గురు పిల్లలతో కలిసి రఫీక, సంజయ్‌ సహజీవనం చేశారు. ఐతే ఆమె కూతురుతో సంజయ్ కుమార్ యాదవ్ అసభ్యంగా ప్రవర్తించడంతో రఫీక గొడవపెట్టుకుంది. నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి...కూతురితో ఇలా చేస్తావా అని వాగ్వాదానికి దిగింది. సరే నిన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పి.. వెస్ట్‌ బెంగాల్ వెళ్లాక పెద్దలతో మాట్లాదామని రఫీకతో సంజయ్ చెప్పాడు. మార్చి 7న గరీభ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌లో ఆమెను తీసుకెళ్లాడు. ఆ తర్వాత మజ్జిగ ప్యాకెట్లలో నిత్ర మాత్రలు కలిపాడు. రఫీక మెడకు చున్నీని బిగించి.. ట్రైన్ నుంచి బయటకు తోసేసి చంపాడు.

  ఆ తర్వాత రఫీక కనిపించకపోయే సరికి.. మక్సూద్ భార్య సంజయ్‌ని ప్రశ్నించింది. మా అక్క కూతురు ఎక్కడుందని అడిగింది. ఆమె ఊరికి వెళ్లిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు సంజయ్. ఏం జరిగిందో చెప్పకపోతే పోలీసులకు చెప్పుతామని బెదిరించడంతో... సంజయ్ వారి హత్యకు ప్లాన్ చేశాడు. మే 16 నుంచి రోజు మక్సూద్ ఇంటికి వెళ్లాడు. చుట్టుపక్కల పరిసరాలను పరిశీలించి స్కెచ్ వేశాడు. 21 తర్వాత మక్సూద్ పెద్ద కుమారుడి బర్త్ డే రోజు హత్యకు కుట్ర చేశాడు. మే 18న స్లీపింగ్ పిల్స్ కొనుగోలు చేశాడు. సమయం చూసి వారి వంట వండే పాత్రల్లో కలిపేశాడు సంజయ్. దాన్ని సేవించిన తర్వాత అందరూ మత్తులో ఉండిపోయారు. ఆ తర్వాత ఒక్కొక్కరిని గోనె సంచులో కట్టి బావిలో పడేశాడు. రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 వరకు బావిలో వేశాడు. రఫీకా హత్యను కప్పిపుచ్చేందుకు.. ఇలా మరో 9 మందిని చంపేశాడు సంజయ్. సీసీ టీవీ ఫుటేజీ, ఫోన్ కాల్స్ ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Crime news, Telangana, Warangal

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు