వరంగల్‌లో 9 మంది మరణాలకు కారణం ఇదే.. ప్రాథమిక రిపోర్టు...

వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలో ఉన్న ఒక గోనె సంచుల గోదాం వద్ద పాడుబడ్డ బావిలో లభించిన 9 మంది మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది.

news18-telugu
Updated: May 23, 2020, 5:07 PM IST
వరంగల్‌లో 9 మంది మరణాలకు కారణం ఇదే.. ప్రాథమిక రిపోర్టు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలో ఉన్న ఒక గోనె సంచుల గోదాం వద్ద పాడుబడ్డ బావిలో లభించిన 9 మంది మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. వరంగల్ ఎంజీఎం వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేశారు. ప్రాథమిక అంచనా ప్రకారం వారు నీటిలో మునగడం వల్ల చనిపోయినట్టు నిర్ధారించారు. 9 మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించగా, అందులో ఏడుగురి ఊపిరితిత్తుల్లో నీళ్లు కనిపించాయి. రెండు డెడ్ బాడీల్లోని ఊపిరితిత్తుల్లో నీరు కనిపించలేదు. వారి శరీరం మీద గీరుకుపోయిన మచ్చలు ఉన్నాయి. చనిపోయిన తర్వాత తీసుకొచ్చి వేశారా? బతికి ఉండగానే లాక్కొచ్చి అందులో వేశారా? అనే అంశాన్ని పరిశీలిస్తే బతికి ఉన్నప్పుడే తీసుకొచ్చి బావిలో వేసినట్టు కనిపిస్తోందని వైద్యులు చెప్పారు. అలాగే కొన్ని మృతదేహాలు నిద్రపోతున్నప్పుడు తీసుకొచ్చి బావిలో వేసినట్టుగా కూడా ఉన్నాయన్నారు. పెనుగులాట జరిగినట్టు, కొట్టుకున్నట్టు ఎలాంటి ఆనవాళ్లు లేవు. తీవ్ర గాయాలు కూడా లేవని చెప్పారు. రక్తస్రావం లాంటివి కూడా ఏవీ లేవన్నారు.

దీనిపై మరింత క్లారిటీ కోసం విస్రా టెస్ట్ చేయనున్నారు. విష ప్రయోగం జరిగిందా? అనేది తెలుసుకోవడానికి ఆయా మృతదేహాల పొట్ట, ఊపిరితిత్తులు, కిడ్నీలను భద్రపరిచారు. FSL నివేదిక రావడానికి 10 రోజుల నుంచి రెండు వారాలు పట్టే అవకాశం ఉంది. రేప్ జరిగిందా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నట్టు వైద్యులు చెప్పారు.

First published: May 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading