అతడు విమానాల్లో తిరుగుతుంటాడు. ఏ నగరానికి వెళ్లినా ఓ పది నుంచి పదిహేను రోజులు వరకు ఉంటాడు. అలా అని చిన్న చిన్న నగరాల్లో తిరుగుతాడు అనుకుంటున్నారా.. కాదండి.. దేశ విదేశాల్లోకి విమానాల్లో (Flight) ప్రయాణం (Travel) సాగిస్తాడు. ఇలా ప్రతీ నగరంలో ఒక భార్యను ఉంచి బిజినెస్ (Business) చూసుకోవడానికి వెళ్తున్నానంటూ.. ఒక దేశం(Country) నుంచి మరో దేశానికి .. అక్కడ మరొక భార్యతో కొన్నాళ్లు ఉంటూ.. మళ్లీ బిజినెస్(Business) చూసుకోవడానికి వెళ్తున్నట్లు చెబుతాడు. ఇలా అతడు పది మంది భార్యలు కలిగి ఉన్నాడు. ఒకరికి తెలియకుండా ఒకరిని పెళ్లి(Marriage) చేసుకొని ఇలా లగ్జరీ జీవితాన్ని గడుపుతున్నాడు. ఇంతకు అతడు బిజినెస్ మ్యాన్(Buniness man) అనుకుంటున్నారా.. కాదండి బాబు.. అతడు ఒక దొంగ. అవును మీరు విన్నది నిజమే.. అతడు దొంగతనాలు చేయడానికే ఇలా బిజినెస్ అంటూ.. విదేశాల్లో తిరుగుతుంటాడు.
ఇలా దొంగతనం చేసిన తర్వాత.. వెళ్లి ఆ డబ్బులను జల్సాలకు ఖర్చు చేస్తూ.. ఖరీదైన కార్లలో తిరుగుతుంటాడు. కానీ ఆ విషయం చాలా కాలం వరకు ఎవరికీ తెలియదు. మరి ఎలా బయటకు వచ్చింది.. అతడి గూడు పుఠానీ చిట్టా మొత్తం పోలీసులు ఎలా విప్పారో తెలుసుకుందాం.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అతడి పేరు ఇర్ఫాన్. అతడు దొంగతనం చేసి వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తూ ఉంటాడు. ఇలా దొంగతనం చేసిన తర్వాత వచ్చిన డబ్బులతో ఖరీదైన కార్లను కొన్నాడు.
ఆ కార్లతో తిరుగుతూ దాదాపు 10 మందిని వివాహం చేసుకున్నాడు. ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకొని ఒక్కొక్కరిని ఒక్కో ప్రదేశంలో ఉంచి కాపురం చేయడం మొదలు పెట్టాడు. వాళ్లకు తాను పెద్ద బిజినెస్ చేస్తున్నట్లు.. ఆస్ట్రేలియాలో ఉంటే.. ఇండియాలో బిజినెస్ అంటూ.. ఇండియాలో ఉన్నప్పడు అమెరికాలో అంటూ ఇలా తన ప్రయాణాన్ని సాగించేవాడు.
అతడు ఎక్కడికి వెళ్లినా ఫైవ్ స్టార్ హోటల్ లోనే బస చేసి.. విలాసవంతమైన జీవితం గడిపేవాడు. అయితే ఇండియాలో ప్రతీ రాష్ట్రంలో అతడికి డజన్ల కొద్ది కేసులు నమోదయ్యాయి. ఇలా అతడు జీవితం బిందాస్ గా సాగిపోతున్న తరుణంలో ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. అతడు ఆ పది మంది భార్యల్లో ఒకరి పేరు మీద ఖరీదైన జాగ్వార్ కారు తీసుకున్నాడు. ఆ కారులోనే వెళ్లి తాజాగా ఉత్తరప్రదేశ్ లోని కవినగర్‌కు చెందిన స్టీలు వ్యాపారవేత్త కపిల్ గార్గ్ నుంచి కోటి రూపాయలు కొట్టేశాడు. దీంతో కపిల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కారు నంబర్ ఆధారంగా కూపీ లాగారు.
దీంతో ఆ కారు నంబర్ ఆధారంగా అతడి గుట్టు రట్టైంది. ఆ కారు ఇర్ఫాన్ భార్య గుల్షన్ పేరు మీద ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. ఘజియాబాద్ పోలీసులు అతడి ఆచూకీ కనుగొన్నారు. అతడి డ్రైవర్ మహ్మద్ షోయబ్, భార్య గుల్షన్ ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఇర్ఫాన్ గురించి అన్వేషణ సాగిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Crime story, Viral