ఇటీవల కాలంలో సమాజంలో అక్రమ సంబంధాలు మితిమీరిపోతున్నాయి. చక్కగా కాపురం చేసుకోవాల్సిన భార్యా భర్తల్లో(Wife and Husband) ఎవరో ఒకరు మరొకరితో అక్రమ సంబంధం (Illegal relationship) పెట్టుకుని కాపురాలను కూల్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగినా మళ్లీ ఎక్కడో ఓ చోట అక్రమ సంబంధాలు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా వనపర్తి జిల్లా (Wanaparthy) లో ఓ కీచక ఎస్ఐ (Sub Inspector) రాసలీలలు బయటపడ్డాయి. స్థానికంగా ఓ వివాహితను లొంగదీసుకుని ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఎస్ఐని ఆమె భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చితకబాదిన ఘటన సంచలనంగా మారింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
వనపర్తి రూరల్ ఎస్ఐ గా షేక్ షఫీ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. అతడు గత కొంతకాలంగా వనపర్తికి సమీపంలోని కొత్తకోటకు చెందిన ఓ వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ప్రతి నిత్యం ఆమె భర్త భయటకు వెళ్లే సమయం చూసి.. ఇంట్లోకి చొరబడే వాడు. ఇలా ఇంటికి వెళ్లి రాస లీలు సాగించేవాడు. ఈ క్రమంలో ఆ వివాహిత భర్తకు స్థానికులు, స్నేహితుల ద్వారా ఆ విషయం తెలిసింది. మొదట అతడు చాలా బాధపడ్డాడు. కట్టుకున్న భార్య ఇలాంటి వ్యవహారం నిర్వహిస్తుండటంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.
దీంతో ఎలాగైనా అతడికి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. పథకం ప్రకారం అతడు ఓ రోజు ఇంటి నుంచి బయటకు వెళ్తున్న వెళ్లి.. ఇంటి సమీపంలోనే మాటు వేశాడు. ఇలా అతడు బయటకు వెళ్లింది చూసి.. అనుకున్నట్లుగానే ఆమె ఎస్సైకి ఫోన్ చేసి ఇంటికి రప్పిచ్చింది. ఇక ఇద్దరు ఇంట్లో రాసలీలలు నిర్వహిస్తుండగా.. అక్కడే ఉన్న ఆ వివాహిత భర్త ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. వారిద్దరిని ఆ స్థితిలో చూసి.. ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అతడితో పాటు తన స్నేహితులు, బంధువులతో కలిసి వెళ్లి ఎస్సైపై దాడికి పాల్పడ్డారు. స్నేహితులతో కలిసి ఎస్ఐ షఫీని ఆమె భర్త చితకబాదారు.
అతడిని కొట్టొద్దంటూ అడ్డు వచ్చిన అతడి భార్యను సైతం చెంప చెల్లుమనిపించాడు. దయచేసి ఈ విషయాన్ని పెద్దగా చేయవద్దు.. బయట తెలిస్తే పరుపు పోతుంది అని ఆ ఎస్సై ప్రాధేయపడినా వినలేదు. అతడిపై ఇంకా విరుచుకుపడి కొట్టారు. అతిడికి తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
అక్కడ ఎస్ఐని కాపాడి వనపర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యుల సలహా మేరకు అతడిని మెరుగైన చికిత్స కొరకు హైదరాబాద్ కు తరలించారు. ఇక ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ఉన్నత పోలీసు అధికారులు అతడిని సస్పెండ్ చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Crime news, Crime story, CYBER CRIME, Extramarital affairs, Wanaparthi