WAMANRAO COUPLE MURDER CASE FILE BY MANTHANI MUNCIPAL CHAIPERSON VB KNR
Waman Rao Murder Case : వామన్ రావు హత్య కేసులో మరో మలుపు.. నిందితుడికి సహకరించినందుకు ఆమెపై కేసు నమోదు.. అసలేం జరిగింది..
వామన్ రావు, నాగమణి (File)
Waman rao murder case: మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజపై మంథని పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది . జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నిందితుడు ఫోన్ లో మాట్లాడేందుకు ఆమె తన మొబైల్ ఇచ్చారని అందిన ఫిర్యాదు మేరకు కేసు నమో దు కాగా .. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది .
హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామనావు , పీవీ నాగమణిల హత్య కేసు నిందితుల్లో ఒకరైన బిట్టు శ్రీనును గత నెల 19 వ తేదీన మంథని కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు తీసుకొచ్చారు . అక్కడ బిట్టు శ్రీనుతో మాట్లాడిన మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ .. తన ఫోన్ ద్వారా శ్రీనును వేరే వ్యక్తితో మాట్లాడించినట్లు బందోబస్తుకు వచ్చిన రామగుండం ఆర్ఎస్సె అజ్మీరా ప్రవీణ్ మంథని పోలీసులకు ఫిర్యాదు చేశారు . నిందితులకు రక్షణగా వచ్చిన కానిస్టేబుళ్లు , కోర్టు పీసీ ఫోన్లో మాట్లాడకూడదని వారించారని ఫిర్యాదులో పేర్కొన్నారు . మెజిస్ట్రేట్ కు వెళ్లే దారిలో మరోసారి వచ్చిన పుట్ట శైలజ ఓ మహిళతో వీడియోకాల్ మాట్లాడించే ప్రయత్నం చేశారని ఫిర్యాదులో వివరించారు .పోలీస్ విధులకు ఆటంకం కలిగించిన పుట్ట శైలజపై చర్య తీసుకోవాలని కోరారు .
కోర్టు ఆవరణలో ఈ సంఘటన జరగడంతో మెజిస్ట్రేట్ అనుమతితో మంథని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు . విచారణ అనంతరం మార్చి 26 న పోలీసులు కేసు నమోదు చేశారు . అయితే కేసు నమోదు విషయాన్ని మంథని పోలీసులు ధ్రువీకరించాల్సి ఉంది . పుట్ట శైలజ నిందితుడికి ఫోన్ ఇచ్చి మాట్లాడించారని వామరావు తండ్రి గట్టు కిషన్‌రావు సైతం పోలీస్ ఉన్నతాధికారులకు పిర్యాదు చేసినట్లు సమాచారం . అయితే అప్పటికే కేసు నమోదు విషయాన్ని గోప్యంగా ఉంచడం అనుమానాలకు దారితీస్తుంది.
బిట్టు శ్రీను, పుట్ట శైలజ
ఇదిలా ఉండగా ఈ కేసు దర్యాప్తుపై విచారణ తీరును అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు వివరించారు. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురు నిందితుల వాంగ్మూలాలు రికార్డు చేసినట్టుగా ఏజీ తెలిపారు. 32 మంది ప్రత్యక్షసాక్షుల్లో 26 మంది వాంగూల్మం నమోదు చేసుకొన్నట్టుగా చెప్పారు. నిందితులు ఉపయోగించిన సెల్పోన్లు, సిమ్ కార్డులను ఎఫ్ఎస్ఎల్ కు పంపారు. ఈ నివేదిక రావడానికి 4 వారాల సమయం పట్టే అవకాశం ఉందని ఏజీ హైకోర్టుకు తెలిపారు. మే 17 నాటికి సమగ్ర చార్జీషీటు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.తదుపరి విచారణను ఈ నెల 23వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. పోలీస్ నివేదికను తమకు ఇచ్చేలా ఆదేశించాలని న్యాయవాది వాదించగా పూర్తి వివరాలు తెలుసుకోవాలన్నదే తమ లక్ష్యమని హైకోర్టు ధర్మాసనం తెలిపింది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.