నారాయణ జూనియర్ కాలేజీలో ప్రమాదం

నెల్లూరులోని నారాయణ కాలేజీలో గోడకూలి ఐదుగురు విద్యార్థులు గాయపడ్డారు.

news18-telugu
Updated: July 20, 2019, 3:30 PM IST
నారాయణ జూనియర్ కాలేజీలో ప్రమాదం
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: July 20, 2019, 3:30 PM IST
నెల్లూరులోని నారాయణ జూనియర్ కాలేజీలో గోడకూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు గాయపడ్డారు. నెల్లూరు టౌన్ లోని అరవింద్ నగర్ నారాయణ జూనియర్ కళాశాలలో గోడ కూలి 5 గురు విద్యార్థులు గాయపడ్డారు. కళాశాలలో ఖాళీ సమయంలో క్లాస్ నుంచి విద్యార్థులు బయటకు వచ్చారు. ఆ సమయంలో కాంపౌండ్ వాల్ ఒక్కసారిగా విరిగి విద్యార్ధులపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వానలకు తడిసిన గోడ కూలి ఉంటుందని భావిస్తున్నారు.

First published: July 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...