కర్నూలు జిల్లాలో వీఆర్వో చెవి కొరికేసిన మరో వీఆర్వో

కర్నూలు జిల్లాలో ఇద్దరు వీఆర్వోల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఓ వీఆర్వో చెవిని మరో వీఆర్వో కొరికేశాడు. కర్నూలు ఎమ్మార్వో కార్యాలయంలోనే ఈ ఘటన జరగడం విశేషం.

news18-telugu
Updated: November 17, 2019, 4:46 PM IST
కర్నూలు జిల్లాలో వీఆర్వో చెవి కొరికేసిన మరో వీఆర్వో
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కర్నూలు జిల్లాలో ఇద్దరు వీఆర్వోల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఓ వీఆర్వో చెవిని మరో వీఆర్వో కొరికేశాడు. కర్నూలు ఎమ్మార్వో కార్యాలయంలోనే ఈ ఘటన జరగడం విశేషం. సుంకేశుల వీఆర్వో వేణుగోపాల్ రెడ్డి, జోహరాపురం వీఆర్వో కృష్ణదేవరాయ పరస్పరం దాడులు చేసుకున్నారు. పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఈ క్రమంలో వేణుగోపాల్‌రెడ్డిని కృష్ణదేవరాయ చెవి కొరికేశాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సుంకేశుల వీఆర్వో వేణుగోపాల్ రెడ్డి.. కంప్యూటర్ ఆపరేటర్‌గా కూడా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే, ఓ రైతు భూమికి సంబంధించిన వివరాలు అప్‌డేట్ చేయాలని కృష్ణదేవరాయ కోరాడు. అయితే, చాలా రోజుల నుంచి వివరాలు అప్‌డేట్ చేయకుండా వేధిస్తున్నాడని ఆరోపిస్తున్నాడు. ఈ విషయంలో ఎమ్మార్వో ఎదుటే వీఆర్వోలు ఇద్దరూ గొడవపడ్డారు. అయితే, తాను ఎప్పుడో వివరాలు అప్‌డేట్ చేశానని వేణుగోపాల్ రెడ్డి చెప్పాడు. ఇద్దరూ అప్పటికప్పుడు సిస్టమ్‌లో చెక్ చేయగా, అందులో రైతు పేరు తప్పు ఉంది. దీంతో కావాలనే అలా చేశాడని కృష్ణదేవరాయ అనుమానం వ్యక్తం చేశాడు. అయితే, ఇద్దరికీ సర్దిచెప్పే ప్రయత్నం చేసినా.. వారు వినలేదు. బీభత్సంగా కొట్టుకున్నారు. ఈ క్రమంలో వేణుగోపాల్‌రెడ్డి చెవిని కృష్ణదేవరాయ కొరికేశాడు.

First published: November 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com