అనంతపురంలో యువతుల కిడ్నాప్ కలకలం.. వాలంటీర్ల నిర్వాకం..

ప్రతీకాత్మక చిత్రం

లోలూరు గ్రామంలో టైలరింగ్‌ చేసే ఇద్దరు అమ్మాయిలు బయటకు వెళ్లారు. ఆ సమయంలో స్థానికంగా ఉండే ముగ్గురు వాలంటీర్లు, మరో ఇద్దరితో కలిసి కారులో వచ్చి అడ్డగించారు.

  • Share this:
    అనంతపురంజిల్లాలో యువతుల కిడ్నాప్ కలకలం రేపింది. ఓ ఇద్దరు అమ్మాయిలను మత్తమందు కలిపి అపహరించి కారులో తీసుకెళ్లారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. శింగనమల మండలం లోలూరు గ్రామంలో ఈ ఉదంతం వెలుగు చూసింది. గ్రామంలోని ఇద్దరు అమ్మాయిలను.. స్థానికంగా ఉన్న వాలంటీర్లు కిడ్నాప్ చేశారన్న వార్తలు స్థానికులను భయాందోళనకు గురిచేసింది. లోలూరు గ్రామంలో టైలరింగ్‌ చేసే ఇద్దరు అమ్మాయిలు బయటకు వెళ్లారు. ఆ సమయంలో స్థానికంగా ఉండే ముగ్గురు వాలంటీర్లు, మరో ఇద్దరితో కలిసి కారులో వచ్చి అడ్డగించారు. మత్తుమందు కలిపిన గుడ్డను నోటికి అడ్డంపెట్టి కారులో బలవంతంగా తీసుకెళ్లారు.

    అయితే దుండగుల నుంచి తప్పించుకుని వచ్చిన అమ్మాయిలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కిడ్నాప్‌ చేసిన వ్యక్తుల నుంచి ప్రాణపాయం ఉందని.. తమకు రక్షణ కల్పించాలని బాధితులు వాపోయారు.
    First published: