• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • VIZIANAGARAM POLICE ARREST TWO PERSONS IN ONLINE HONEY TRAP CASE SK

సెక్స్ పేరుతో ఆన్‌లైన్ మోసాలు.. విజయనగరంలో ఇద్దరు అరెస్ట్

సెక్స్ పేరుతో ఆన్‌లైన్ మోసాలు.. విజయనగరంలో ఇద్దరు అరెస్ట్

ప్రతీకాత్మక చిత్రం

ఆన్‌లైన్ సెక్స్ పేరుతో బిజినెస్ స్టార్ట్ చేసి లొకాలంటో యాప్ ద్వారా కస్టమర్లతో మాట్లాడేవారు. అందమైన అమ్మాయిల ఫొటోలను ఎరవేసి డబ్బులను వసూలు చేసేవాడు.

  • Share this:
    అతడో సైబర్ కేటుగాడు. నిజాయితీగా డబ్బులు సంపాదించడం చేతకాక.. ఈజీ మనీ కోసం అడ్డుదారులు తొక్కాడు. సెక్స్ పేరుతో అందమైన అమ్మాయిల ఫొటోలను ఆన్‌లైన్‌లో ఎరవేస్తాడు. ఈ యువతి కావాలంటే డబ్బులు పంపండి.. ఆ తర్వాత ఎంజాయ్ చేయండని ఆఫర్ ఇస్తాడు. ఇదంతా యాప్ ద్వారానే సాగుతుంది. అలా ఎంతో మంది అతడికి డబ్బులు పంపి మోసపోయారు. ఎట్టకేలకు ఓ బాధితుడు అమెరికా నుంచి ఫిర్యాదు చేయడంతో మనోడి గుట్టురట్టయింది. ఆన్‌లైన్ సెక్స్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని, అతడి ప్రియురాలిని విజయనగరం పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు.

    పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అశ్విన్ అనే వ్యక్తి కొన్నేళ్ల క్రితం విజయనగరం వచ్చి అక్కడే స్థిరపడ్డాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి భార్యా పిల్లలు ఉన్నారు. ఐనప్పటికీ సింధూ అనే యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. అంత మందిని పోషించడం కష్టమవడంతో ఆన్‌లైన్ మోసాలు చేయడం ప్రారంభించాడు అశ్విన్. ఆన్‌లైన్ సెక్స్ పేరుతో బిజినెస్ స్టార్ట్ చేసి లొకాలంటో యాప్ ద్వారా కస్టమర్లతో మాట్లాడేవారు. అందమైన అమ్మాయిల ఫొటోలను ఎరవేసి డబ్బులను వసూలు చేసేవాడు. అవతలి వారి స్థాయిని బట్టి రూ.500 నుంచి రూ.10 వేల వరకు వసూలు చేసేవాడు.

    ఆన్‌లైన్ ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయిన తర్వాత ఫోన్ స్విచాఫ్ చేసేవాడు. ఇలా ఇప్పటి వరకు 3వేల మందిని మోసం చేశాడు. గత మూడేళ్లుగా ఈ చీకటి దందా చేస్తూ.. నెలకు రూ.30వేల నుంచి 50 వేలు సంపాదిస్తున్నాడు. అశ్విన్ చేతిలో మోసపోయిన వ్యక్తులు బయటకు చెప్పలేదు. సెక్స్ పేరుతో డబ్బులు నష్టపోయామని చెబితే పరువు పోతుందని ఎవరూ ఫిర్యాదు చేయలేదు. కానీ ఐదు రోజుల క్రితం అమెరికా నుంచి నరేష్ అనే వ్యక్తి ఆన్‌లైన్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆన్‌లైన్స్ సెక్స్ పేరుతో మోసాలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దాని ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు విజయనగరంలో అశ్విన్‌తో పాటు అతడి ప్రియురాలు సింధూను అరెస్ట్ చేశారు.
    Published by:Shiva Kumar Addula
    First published: