• HOME
 • »
 • NEWS
 • »
 • CRIME
 • »
 • VIZIANAGARAM MURDER CASE UPDATE POLICE ARRESTED 4 PERSONS VZM NGS

Andhra pradesh: రెండు నెలల క్రితం అదృశ్యం.. తరువాత ఆత్మహత్య అన్నారు. ఇప్పుడు కథ మారింది.. స్నేహితులే ఎందుకు అంత పని చేశారు.

Andhra pradesh: రెండు నెలల క్రితం అదృశ్యం.. తరువాత ఆత్మహత్య అన్నారు. ఇప్పుడు కథ మారింది.. స్నేహితులే ఎందుకు అంత పని చేశారు.

విజయనగరం హత్య కేసు

విజయనగరంలో ఓ యువకుడి మృతి కేసును పోలీసులు చేధించారు. అయితే హత్యకు గల కారణాలు ఏంటి? అసలు ఎలా హత్య చేశారు? హత్య చేసిన తరువాత ఇన్ని రోజులు ఎలా తప్పించుకుని తిరిగారు అన్నవి చాలా ఆసక్తికరంగా మారాయి.

 • Share this:
  రెండు నెలల కిందట ఒక యువకుడు అదృశ్యమయ్యాడు. కొన్ని రోజులకే బావిలో శవమై తేలాడు.. మొదట అంతా ఆత్మహత్య అన్నారు. కానీ కుటుంబ సభ్యులు మాత్రం అది హత్యే అనే ఆరోపించారు. పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ అనుమానాస్పద మృతి అప్పట్లో పెను సంచలనమైంది. అయితే పంచాయతీ ఎన్నికల సమయంలో ఘర్షణల్లో ఎవరైనా చంపేశారా?.. లేక ప్రమాదవశాత్తు చనిపోయాడా? అనే సందేహాలు పోలీసులకు సవాల్ విసిరాయి. అయితే ఆలస్యంగా అయినా ఈ మృతి వెనుక కారణాలు పోలీసులు ఛేదించారు.

  విజయనగరం రూరల్ పోలీసు స్టేషన్ పరిదిలోని పినవేమలి గ్రామంలో ఫిబ్రవరి 17న ఆ గ్రామానికి చెందిన యువకుడు కెంగువ రవికుమార్ అదృశ్యమయ్యాడు. రెండు రోజుల తరువాత గ్రామం సమీపంలోని వ్యవసాయ పొలంలో విగత జీవిగా కనిపించాడు. అప్పట్లో అది పెను సంచలం అయ్యింది. యధావిదిగా పోలీసులు రావడం ఆధారాలు సేకరించడం, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకోవడం చకచకా జరిగిపోయాయి. అయితే తన కుమారుడు రవిది హత్యే అని అతని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతూ పోలీసుకలు ఫిర్యాదు చేశారు. వారి ఆరోపణే ఇప్పుడు నిజమైంది. అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేసిన విజయనగరం రూరల్ పోలీసులు ఈ కేసులోని సంచలన విషయాలు బయటపెట్టారు. రవిది ఆత్మహత్య కాదని.. పథకం ప్రకారం హత్య చేశారని గుర్తించారు. ఈ హత్యకు కారణమైన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ హత్యకు ప్రధాన కారణం వివాహేతర సంబంధమే అని పోలీసులు తేల్చారు.

  పోలీసుల కథనం ప్రకారం పూర్తి వివరాలు పరిశీలిస్తే విజయనగరం మండలం పినవేమలి గ్రామానికి చెందిన కెంగువ రవి అదే గ్రామానికి చెందిన బాలి పైడిరాజుల మధ్య గత కొన్ని రోజులుగా విభేదాలు ఉన్నాయన్నారు. అయితే ఇద్దరూ ఒకే మహిళతో అక్రమ సంబంధం కలిగి ఉండడం, ఆ విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని పోలీసులు గుర్తించారు. దీంతో కక్ష పెంచుకున్న బాలి పైడిరాజు తన స్నేహితులను ఒక దగ్గర చేర్చి పార్టీ చేసుకుందామని పిలిచాడు. అందులో రవికి కూడా తన స్నేహతులతో కలిసి పార్టీలో జాయిన్ అయ్యాడు. అలా రెండు వర్గాలు హ్యాపీగా పార్టీని ఎంజాయ్ చేశాయి. ఆ పార్టీలోనే రవిని చంపాలని ముందుగానే పైడిరాజు పథకం వేసుకున్నాడు. ఫిబ్రవరి 17 రాత్రి ఆ పథకం ప్రకారం కెంగువ రవిని పార్టీకని ఆహ్వానించి గ్రామ పొలిమేరల్లోకి తీసుకు వెళ్లాడు. అక్కడ పార్టీలో మద్యం సేవించి పూర్తిగా రవి మద్యం మత్తులోకి వెళ్లగానే ముందుగా వేసుకున్నపథకం ప్రకారం రవి గొంతు నులిమి పాశవికంగా హత్య చేసాడు.

  రవి చనిపోయాడని నిర్ధారించుకుని శవాన్ని మాయంచేయడం కోసం తన స్నేహితులైన జొన్నవలస గ్రామానికి చెందిన నారాయణరావు అలియాస్ నాని, సారిక గ్రామానికి చెందిన కింతాడ ఉదయ కిరణ్, వీటీ అగ్రహారంకు చెందిన ఇమంది సత్యనారాయణల సహాయం తీసుకున్నాడు. రవిని హత్య చేసిన తరువాత వీరంతా సంఘటనా స్థలానికి చేరుకుని రవికుమార్ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు నానా తంటాలు పడ్డారు. ముందుగా రవి శరీరంపై చొక్కాను తాటి చెట్ల మట్టలకు కట్టారు... అది కాస్తా శవం బరువుకు కింద పడిపోయింది. తరువాత కాళ్లకు తాళ్లు కట్టి.. శరీరానికి బరువు కట్టి బావిలో వేస్తే ఎప్పటికీ శవం తేలదంటూ నారాయణరావు సలహా ఇచ్చాడు. ఈ సలహా అందరికి ఆమోదం కావడంతో ఐక్యంగా వీరంతా కలిసి శవం కాళ్లకు ఇటుకలు కట్టి మరీ బావిలో పడేసారు. కానీ రెండు రోజుల తరువాత బావిలో యువకుడి శవం ఉన్నట్టు గొర్రెల కాపరి సమాచారం ఇవ్వడంతో ఆ డెడ్ బాడీ కెంగువ రవికుమార్ మృతదేహం గా నిర్ధారించారు పోలీసులు. అప్పటి వరకు మిస్సింగ్ కేసుగా ఉన్న ఈ కేసును హత్య కేసుగా నమోదు చేసి ఇందుకు కారణమైన వారిని అదుపులోకి తీసుకుని కేసు మిస్టరీని ఛేదించారు పోలీసులు.

  నేరం చేసి తప్పించుకు తిరుగుతున్న నిందితులు ముందు పోలీసులను సైతం మభ్యపెట్టి తమకు ఈ హత్యకు ఎటువంటి సంబంధం లేదని నమ్మేలా చేశారు. దీంతో వీరిని వదిలిపెట్ఠి వేరే కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు వీరి నడవడికపై నిఘా పెట్టి కేసును చేధించారు. రవి హత్యకు ప్రధాన కారణం వివాహేతర సంబంధమే అనే తేల్చారు. ఈ కేసు విచారణలోనూ, ఛేదించడంలో ప్రతిభను చూపిన జిల్లా పోలీసులను ఎస్పీ రాజకుమారి ప్రత్యేకంగా అభినందించారు.
  Published by:Nagesh Paina
  First published: