Andhra Pradesh: మరణించిన వారిని కూడా వదలరా.. ఏపీ సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల కక్కుర్తి

సచివాలయ సిబ్బంది వాలంటీర్ల చేతి వాటం

ఏపీలో కొన్ని చోట్ల గ్రామా, వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల దారుణాలపై ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అయితే అధికారులు పెద్దగా పట్టించుకోక పోవడంతో వారి అరాచకాలకు అడ్డుకట్ట పడడం లేదు. తాజాగా కొందరు వాలంటీర్లు, సచివాయల సిబ్బంది.. మరణించిన వారిన కూడా వదలని ఘటన వెలుగులోకి వచ్చింది.

  • Share this:
    గ్రామ సచివాలయ వ్యవస్థ గురించి ఏపీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోంది. ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఇక సచివాలయం ఉంది అనే భోరసా కల్పించామని సీఎం జగన్ పదే పదే చెబుతూ ఉంటారు. వాలంటీర్లను అయితే ఆయన తన సేవా కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసిన సైన్యం అని చెబుతారు. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం కొన్ని చోట్ల భిన్నంగా ఉన్నాయి. ఆఖరికి మరణించిన వారిని కూడా వదలడం లేదు కొందరు సచివాలయ ఉద్యోగులు.. విజయనగరం జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరణించిన వారి పేరు మీద పించన్లు డ్రా చేస్తూ అక్రమాలకు పాల్పడుతూ.. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు చేతివాటం ప్రదర్శించారు. పేదలకు పించన్లు ఇమ్మని ప్రభుత్వం ఇచ్చిన అధికారాలను దుర్వినియోగం చేస్తూ.. ఏకంగా 1.47 లక్షల రూపాయల పింఛన్ల సొమ్మును బొక్కేసారు. విషయంలో ఆలస్యంగా వెలుగులోకి రావడంతో.. డిజిటల్ అసిస్టెంట్ సహా నలుగురు వాలంటీర్లను విధుల నుంచి తొలగించారు. భరోసా పథకం కింద వృద్ధులు, వితంతువులకు ఇస్తున్న పెన్షన్ పంపిణీలో అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించి.. గరివిడి మండలం, బొండపల్లిలో సచివాలయ డిజిటల్ అసిస్టెంట్, నలుగురు గ్రామ వాలంటీర్లను విధుల నుంచి తొలగించి జిల్లా కలెక్టర్ కొరడా ఝులిపించారు.

    సచివాలయ పరిధిలో మ‌ర‌ణించిన ఫించ‌ను దారుల పేర్ల‌తో మంజూరైన ఫించ‌న్ల సొమ్మును డిజిట‌ల్ అసిస్టెంట్ రేగాన శ్రీ‌రామ్‌, గ్రామ వ‌లంటీర్లు దాస‌రి రాంబాబు, గొట్టాపు శంక‌ర‌రావు, ఎల్‌.శ్రీ‌నివాస‌రావు, ఎస్‌.హేమ‌ల‌త క‌ల‌సి డ్రా చేసి దుర్వినియోగానికి పాల్ప‌డ్డారు. ఈ ఐదుగురూ క‌ల‌సి దాదాపు 1.47 ల‌క్ష‌ల రూపాయల ఫించ‌న్ల సొమ్మును దుర్వినియోగం చేసి డ్రా చేసిన‌ట్లు విచార‌ణ‌లో తేలింది. దీనిపై సచివాలయ పరిధిలో ఆరోపణలు రావడంతో జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. డివిజనల్ డెవెలప్ మెంట్ అధికారి రామచంద్రరావు జరిపిన ప్రాధమిక విచారణలో ఈ నిర్ధారణ కావడంతో కలెక్టర్ వారిపై చర్యలు చేపట్టారు. విధుల నుండి తొలగించడమే కాక, తొల‌గించిన ఐదుగురిపై ప్ర‌భుత్వ ఫించ‌ను మొత్తాల పంపిణీలో అక్ర‌మాల‌కు పాల్ప‌డి నిధులు స్వాహా చేసినందుకు గాను క్రిమిన‌ల్ చ‌ర్య‌లు కూడా తీసుకుంటామ‌న్నారు.

    బొండ‌ప‌ల్లి గ్రామానికి చెందిన న‌ల్ల‌బోలు రామారావు, బూదరాజు ర‌మ‌ణ‌మ్మ‌, కొన్నా ల‌క్ష్ము, తామాడ త‌వుడ‌మ్మ‌, బొత్స తాత‌, క‌లిశెట్టి సూర‌మ్మ‌, పొట్నూరు భాగ‌య్య‌, పెరుమాలి తాత‌య్య‌, గొట్టాపు సోములు త‌దిత‌ర తొమ్మిది మంది ఫించ‌న‌ర్ల‌కు చెందిన సొమ్ము వారి మ‌ర‌ణానంత‌రం కూడా వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేష‌న్ అసిస్టెంట్ లాగిన్ ద్వారా, వ‌లంటీర్ లాగిన్ ద్వారా చెల్లించిన‌ట్లు చూపించి స్వాహాకు పాల్ప‌డిన‌ట్లు నిర్ధారించారు. న‌ల్ల‌బోలు రామారావు అనే వృద్ధుడు 2020 ఆగ‌ష్టులో మ‌ర‌ణించగా ఆయ‌న‌కు చెందిన తొమ్మిది నెల‌ల ఫించ‌ను మొత్తం రూ.45,000 డ్రా చేశార‌ని, ఇందులో వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్ నుంచి రూ.10 వేలు, వ‌లంటీర్ లాగిన్ నుంచి రూ.35 వేలు డ్రా చేశార‌ని నిర్ధార‌ణ అయిన‌ట్లు తెలిపారు. బూద‌రాజు ర‌మ‌ణ‌మ్మ అనే ఫించ‌నుదారు సెప్టెంబ‌రు 2020లో మ‌ర‌ణించ‌గా ఆమెకు మంజూరు చేసిన‌ 9 నెల‌ల ఫించ‌ను మొత్తం రూ.20,250ను రూ.6750 వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్ ద్వారా, రూ.13,500 వ‌లంటీర్ లాగిన్ ద్వారా డ్రా చేశార‌ని పేర్కొన్నారు. కొన్నా ల‌క్ష్ము అనే ఫించ‌నుదారు ఏప్రిల్ 2021లో మ‌ర‌ణించ‌గా ఆయ‌న‌కు మంజూరైన‌ 3 నెల‌ల ఫించ‌ను మొత్తం రూ.6750ను వ‌లంటీర్ లాగిన్ ద్వారా డ్రా చేసిన‌ట్లు తేలింద‌న్నారు. తామాడ త‌వుడ‌మ్మ‌ అనే ఫించ‌నుదారు జూలై 2020లో మ‌ర‌ణించ‌గా ఆమెకు మంజూరైన‌ ప‌ది నెల‌ల ఫించ‌ను మొత్తం రూ.22,250లలో 4500 రూపాయలను వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్‌తో, 17,750 రూపాయలను వాలంటీర్ లాగిన్‌తో డ్రా చేసిన‌ట్లు ద‌ర్యాప్తులో నిర్ధార‌ణ అయ్యింది. బొత్స తాత అనే ఫించ‌నుదారు జూలై 2020లో మ‌ర‌ణించ‌గా అత‌నికి మంజూరైన‌ ప‌ది నెల‌ల ఫించ‌ను మొత్తం రూ.22,250ల‌లో 4500 రూపాయలను వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్‌తో, వ‌లంటీర్ లాగిన్‌తో 17,750 రూపాయలను డ్రా చేసిన‌ట్లు ద‌ర్యాప్తులో నిర్ధార‌ణ అయ్యింద‌న్నారు. క‌లిశెట్టి సూర‌మ్మ అనే ఫించ‌నుదారు మార్చి 2021లో మ‌ర‌ణించ‌గా ఆమెకు మంజూరైన‌ మూడు నెల‌ల ఫించ‌ను మొత్తం రూ.6750 వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్‌తో డ్రా చేసిన‌ట్లు ద‌ర్యాప్తులో నిర్ధార‌ణ అయ్యింద‌న్నారు. పొట్నూరు భాగ‌య్య అనే ఫించ‌నుదారు మార్చి 2021లో మ‌ర‌ణించ‌గా అత‌నికి మంజూరైన‌ మూడు నెల‌ల ఫించ‌ను మొత్తం రూ.6750 వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్‌తో డ్రా చేసిన‌ట్లు ద‌ర్యాప్తులో నిర్ధార‌ణ అయ్యింది. పెరుమాలి తాత‌య్య అనే ఫించ‌నుదారు జ‌న‌వ‌రి 2021లో మృతి చెంద‌గా అత‌నికి మంజూరైన‌ ఐదు నెల‌ల ఫించ‌ను సొమ్ము రూ.11,250లు వ‌లంటీర్ లాగిన్‌తో డ్రా చేసిన‌ట్లు గుర్తించ‌డం జ‌రిగింద‌న్నారు. గొట్టాపు సోములు అనే ఫించ‌ను దారుడు ఏప్రిల్ 2021లో మృతి చెంద‌గా అత‌నికి మంజూరు చేసిన రెండు నెల‌ల ఫించ‌ను మొత్తం రూ.6000 వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్ తో డ్రా చేసిన‌ట్లు నిర్ధార‌ణ అయింది.
    Published by:Nagesh Paina
    First published: