Home /News /crime /

VIZIANAGARAM CRPF ROUTH JAGADEESH DECEASED CHHATTISGARH ENCOUNTER BUT THIS MONTH MAY 22ND HIS MARRIAGE VZM NGS

Andhra Pradesh: మే 22న వివాహం. పెళ్లి ముచ్చట తీరకుండానే వీర మరణం.. బ్లాక్ డే ప్రకటించిన స్నేహితులు

పెళ్లికి కొన్ని రోజుల ముందు వీర మరణం పొందిన సీఆర్పీఎఫ్ జవాను రౌతు జగదీష్

పెళ్లికి కొన్ని రోజుల ముందు వీర మరణం పొందిన సీఆర్పీఎఫ్ జవాను రౌతు జగదీష్

ఆదివారం ఉదయం వరకు ఆ ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. పెళ్లి బాజాలు మోగించేందుకు అంతా రెడీ అవుతున్నారు. సోమవారం కొడుకు ఇంటికి వస్తాడని ఆశగా ఎదురు చూస్తున్నారు? కానీ అంతలోనే ఊహించని పిడుగులాంటి వార్త ఆ ఇంట్లో విషాదం నింపింది.

  రౌతు జగదీష్.. దేశమంటే భక్తి.. దానికి తోడు కండలు తిరిగిన శరీరం, చురుకుగా కదిలే నైజం.. ఆ లక్షణాలు అతడ్ని కోబ్రాదళానికి నాయకుడిగా ఎంపికయ్యేలా చేశాయి. విధుల్లో చేరినప్పటి నుంచి కోబ్రాదళం తరపున ఎన్నో కీలక ఆపరేషన్ ల్లో పాల్గొన్నాడు.. మావోయిస్టుల గుండెల్లో ధడ పుట్టించాడు. కానీ అతడి ధైర్య, సాహసాలు చూసిన విధికి కన్నుకుట్టినట్టు ఉంది. త్వరలో జీవితభాగస్వామితో పాటు ఏడు అడుగులు నడిచేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో విధి కన్నెర్ర చేసాంది. పెళ్లి వయసు వచ్చిన సమయంలో.. ఆ ముచ్చట తీరకుండానే మావోయిస్టుల రాపంలో మృత్యువై కాటేసింది. కుటుంబ సభ్యులకు దుఃఖాన్ని మిగిల్చింది. జవాన్‌ మృతితో విజయనగరం జిల్లా కేంద్రంలోని గాజులరేగ, మక్కువ మండలం కంచేడువలసలో పెను విషాదం అలముకుంది.

  చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపుర్‌లో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో  విజయనగరం జిల్లాకు చెందిన యువకుడు, సీఆర్పీఎఫ్‌ జవాన్‌ 27 ఏళ్ల రౌతు జగదీష్‌ వీరమరణం పొందాడు. జిల్లా పోలీస్‌లు తెలిపిన వివరాల ప్రకారం.. జగదీష్‌ది మక్కువ మండలం కంచేడువలస గ్రామం. ప్రస్తుతం రౌతు జగదీష్ కుటుంబం విజయనగరం జిల్లా కేంద్రంలోని గాజులరేగలో నివసిస్తోంది. డిగ్రీ వరకు చదువుకున్న జగదీష్‌ 2010లో సీఆర్పీఎఫ్‌ జవాన్‌గా ఎంపికయ్యాడు. విధుల్లో చురుగ్గా మెలగడంతో కోబ్రాదళానికి లీడర్‌గా ఎంపికయ్యాడు. బీజాపూర్‌లో సీఆర్‌పీఎఫ్, కోబ్రా, డీఆర్‌జీ భద్రతా దళాలతో కలిసి కూంబింగ్‌ చేస్తున్న సమయంలో మావోయిస్టుల ఎదురు కాల్పుల్లో మృతిచెందాడు. విధుల్లో చేరిన కొద్దికాలంలోనే మంచిపేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. మృతుడి తండ్రి సంహాచలం కూలీకాగా, తల్లి రమణమ్మ గృహిణి. కాగా ఈ మధ్యనే అక్క సరస్వతికి వివాహమైనట్టు తెలుస్తోంది.

  అయితే జగదీష్ కు వచ్చే నెల 22న పెళ్లి నిశ్చమైంది. ఆ పెళ్లికోసం మరో వారం రోజుల్లో సెలవుపై రావాలి అనుకున్నాడు. దీంతో జగదీష్ కుటుంబ సభ్యులంతా పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. ఎంతో ఆనందంగా ఉన్న సమమంలో పిడుగులాంటి వార్త ఆ ఇంటిని శోకసంద్రంలోకి నెట్టేసింది. కొండంత ఎదిగిన కొడుకు.. పేరు ప్రఖ్యాతలు సాధించాడనుకున్న బిడ్డ మృతి చెందాడన్న వార్తతో కుటుంబం దుఃఖ సాగరంలో మునిగిపోయింది.  చేతికి అందుకొచ్చాడు ఇంటి బరువు బాద్యతలు చూసుకుంటాడనుకున్న సమయంలో ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులిద్దరూ కన్నీరుమున్నీరవుతున్నారు. జగదీష్‌ మృతితో గాజులరేగ, కంచేడువలస వాసులు శోకసంద్రంలో మునిగిపోయారు. గాజులరేగలో బ్లాక్‌ డే పాటిస్తామని యువకులు తెలిపారు.

  పెళ్లి పల్లకీ ఎక్కుతాడనుకున్న ఆ జవాను మావోయిస్టుల ఎదురుకాల్పుల్లో వీర మరణం పొందాడు. విషయం తెలిసిన మరుక్షణమే తల్లిదండ్రులు కుప్పకూలారు. ఈ ఘటనతో గాజులరేగలోని జగదీష్‌ ఇంటివద్ద తీవ్ర విషాద చాయలు అలముకున్నాయి. 49వ డివిజన్‌ కార్పొరేటర్‌ కర్రోతు రాధామణి, స్థానికులు జగదీష్‌ ఇంటి వద్దకు చేరుకుని తల్లిదండ్రులను ఓదార్చారు. మరోవైపు జగదీష్ స్నేహితులు సైతం తీవ్ర దు:ఖంలో ఉన్నారు. వీర మరణం పొందిన స్నేహితుడికి శ్రద్ధాంజలి ఘటిస్తూ బ్లాక్ డే నిర్వహించారు. జగదీష్ అమర్ రహే.. అంటూ విజయనగరం పట్టణంలోని గాజుల రేగలో భారీ ర్యాలీ చేపట్టారు జగదీస్ స్నేహితులు, గాజులరేగ వాసులు.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Cirme, Crime news, CRPF, Visakhapatnam, Vizianagaram

  తదుపరి వార్తలు