• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • VIZIANAGARAM CRIME NEWS HUSBAND KILLED HIS WIFE VZM NGS

Andhra Pradesh: భార్యను షికారుకు రమ్మాన్నాడు.. ఎత్తైన కొండపైకి తీసుకెళ్లాడు.. తరువాత ఏం జరిగింది?

Andhra Pradesh: భార్యను షికారుకు రమ్మాన్నాడు.. ఎత్తైన కొండపైకి తీసుకెళ్లాడు.. తరువాత ఏం జరిగింది?

భార్యను అతి కీరాతకంగా హత్య చేసిన భర్త

విజయనగరంలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యను షికారుకి అని తీసుకెళ్లి అత్యంత దారుణం చేశాడు ఓ భర్త. ఎవరికీ అనుమానం రాకుండా ఎప్పటిలాగే బయటకు వెళ్లి వచ్చినట్టు ఇంటికీ వచ్చి రెస్ట్ తీసుకున్నాడు. కానీ అసలు విషయం తెలుసుకున్న తరువాత గ్రామ ప్రజలంతా షాక్ కు గురయ్యారు.

  • Share this:
    భర్త చెప్పిన మాటలు నమ్మంది 35 ఏళ్ల కంబపు పుష్ప. ఇద్దరి మధ్య ఎన్ని విబేధాలు ఉన్నా.. తరచూ గొడవలు జరుగుతున్నా.. భర్తపై ప్రేమ ఉండడంతో అతడి మాయ మాటలను నిజమే అనుకుంది.. షికారుకెళ్దాం అంటూ నిజమే అనుకుంది. దీంతో భార్య భర్తలు ఇద్దరు చేతిలో చేయి వేసుకుని.. కబుర్లు చెప్పుకుంటూ.. కుమిలి గ్రామానికి ఆనుకొని ఉన్న ఎత్తైన కొండపైకి వెళ్లింది. కొండ ఎంత ఎత్తున్న భర్తతోనే కదా అంటూ ధైర్యంగా వెళ్లింది. కానీ అంతా పైకి వెళ్లిన తరువాత తెలిసింది. అతడు భర్త కాదు నరరూప రాక్షసుడని..

    విజయనగరం జిల్లా పూసపాటి రేగ మండలం కుమిలి గ్రామంలో ఈ దారుణం జరిగింది.

    ఈ నెల 2వ తేదీన ఘటన జరగగా చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 35 ఏళ్ల పుష్పను.. కట్టుకున్న భర్తే అతి కిరాతకంగా హత్య చేశాడు. కుమిలి గ్రామానికి ఆనుకుని ఉన్న ఎత్తైన కొండపైకి తీసుకెళ్లి.. ఆ ప్రదేశమంతా నిర్మాణుష్యంగా ఉండడంతో భార్య గొంతు నులిమి.. కిందకు నెట్టి అతి దారుణంగా హత్య చేశాడు శ్రీను..

    భార్యను హత్య చేసిన తరువాత ఏమీ తెలియనట్టు ఇంటికి వెళ్లిపోయాడు. అయితే రాత్రి పొద్దుపోయినా కూతురు ఇంటికి రాలేదని తెలియడంతో.. పూసపాటిరేగ పోలీస్ స్టేషన్ లో పుష్ప తల్లిదండ్రులు, బంధువులు ఫిర్యాదు చేశారు. వారు ఆమె భర్తపైనే అనుమానం ఉందంటూ ఫిర్యాదుతో పేర్కొన్నాడు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. భర్తపై అనుమానంతో రెండవ తేదీ నుంచి అతడి సెల్ ఫోన్ సిగ్నల్స్ ను ట్రాక్ చేశారు. ఆ సిగ్నల్స్ ద్వారా 2వ తేదీన భర్త కొండపైకి వెళ్లినట్లు గుర్తించారు. వెంటనే శ్రీనును అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేశారు. దీంతో అతడు తానే తన భార్యను హత్య చేసినట్టు ఒప్పుకున్నట్టు సమాచారం. సెల్ ఫోన్ సిగ్నల్స్, సీసీ ఫుటేజ్ ఆధారంగా భర్తే హంతకుడని గుర్తించారు. ఆ రోజే మందు తాగేసి ఒక దగ్గర పడిపోతే దెబ్బలు తగిలాయని తెలుసుకున్నారు. దీంతో హాస్పిటల్ లో జాయిన్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి వెళ్లి శ్రీనును అదుపులోకి తీసుకున్నారు.

    ఈ విచారణ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఎప్పటి నుంచో వీళ్లిద్దరి మధ్య గొడవలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. గతంలో చాలాసార్లు భార్యను చంపాడానికి ట్రై చేశాడని తెలుసుకున్నారు. అంతేకాదు ఇద్దరి మధ్య మనస్పర్థలు పెరగడంతో రెండు మూడుసార్లు ఇద్దరూ కలిసి ఆత్మహత్యాయత్నం కూడా చేసినట్టు సమాచారం. కానీ ఈసారి ఏకం భార్యను ఎత్తైన కొండపైకి తీసుకెళ్లి మరీ దారుణంగా హత్య చేశాడు. అయితే నిర్మాణుష్యంగా ఉన్న ఎత్తైన కొండపైకి వెళ్తున్నప్పుడు ఆమె భర్తను ఫ్రశ్నించిందా? లేక ఆత్మహత్య చేసుకుందాం అని చెప్పి ఆమెను తీసుకెళ్లాడా? ఈ హత్యకు ముందు ఇద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా అన్న కోణాల్లో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Nagesh Paina
    First published:

    అగ్ర కథనాలు