Crime News: ప్రేమించిన అబ్బాయిని పెళ్లాడాలనుకుంది.. తల్లి మందలించింది.. ఏం చేసిందో తెలుసా?

తల్లిని చంపిని కూతురు

తల్లి సృహ తప్పి పడిపోయింది. వెంటనే కూతురు హుటాహుటిన ఆస్పత్రికి తరలించింది. కానీ ఆస్పత్రికి తరలిస్తుండగానే అమ్మ చనిపోయింది అంటూ ఆ కూతురు కన్నీరు మున్నీరు పెట్టుకుంది. ఆమె రోధించడం చూసినవారంతా అమ్మ అంటే కూతురుకి ఎంత ప్రేమ అనుకున్నారు. కానీ పోస్టుమార్టంలో ఆమెది సహజమరణం కాదని.. హత్య అని తేలడంతో.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఆమె ఏం చేసిందో తెలుసా?

 • Share this:
  మనుషులు మరీ నరరూప రాక్షసులుగా మారుతున్నారు. రక్త సంబంధాలను సైతం చిదిమేస్తున్నారు. ముఖ్యంగా ఎవరి పట్ల ఎలా వ్యవహరించినా కన్న తల్లి అంటే దేవతగా భావిస్తారు.. నవమాసాలు మోసి కని పెంచిన అమ్మ లేని జీవితం లేదనుకుంటారు. కానీ ఇటీవల కొందరు పిల్లలు కన్న తల్లిపై కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడి కోసం కన్నతల్లినే గొంతు నులిమి చంపేసింది ఓ కూతురు. అయితే అతి తెలివిగా హత్యను.. సహజ మరణంగా చిత్రీకరించింది. ఏం తెలియనట్టు కన్న తల్లి చనిపోయింది అంటూ కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. బతికించడానికి పోరాడానట్టు డ్రామాలు ఆడింది.  తనకే పాపం తెలియదు అంటూ అందర్నీ నమ్మించింది. ఆ కుటుంబ సభ్యులు, బంధువులు, చుట్టుపక్కల వాళ్లు అంతా ఆమెది సహజ మరణమే అనుకున్నారు. కానీ పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో కూతురు, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.

  విజయనగరం జిల్లా భోగాపురం మండలం సవరవల్లిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. సవరవల్లి గ్రామంలో లక్ష్మి అనే మహిళకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొన్నేళ్ల కిందటే చిన్న కుమర్తె ప్రేమ వివాహం చేసుకుని వెళ్లిపోయింది. పెద్దకుమార్తె రూప శ్రీ ప్రస్తుతం బీ ఫార్మసీ చదువుతోంది. అదే కాలేజీలో చదువుతున్న వరుణ్ సాయితో స్నేహం చేసింది. వీరిద్దరి మధ్య పరిచయం చనువుగా మారింది. తరువాత ఆ పరిచయం కాస్తా.. ప్రేమగా రూపాంతరం చెందింది. అయితే వీరిద్దరూ ప్రేమించుకుంటున్న విషయం తల్లి లక్ష్మీకి తెలిసింది. చిన్న కూతురి విషయంలో ఎదురైన అనుభవాలతో ఇద్దరినీ మందలించింది. 

  ఇప్పటికే చిన్న కుమార్తె ప్రేమ వివాహం చేసుకుని వెళ్లి కష్టాలు పడుతోంది. పెద్ద కూతురుగా ఆ విషయం తెలిసి ఇలా చేయడం కరెక్టు కాదని కూతురిని హెచ్చరించింది. వరుణ్ తో ప్రేమ వివాహానికి ఒప్పుకోనని స్పష్టం చేసింది. దీంతో తన ప్రేమకు అడ్డుగా ఉన్న తల్లిని ఎలాగైనా తొలగించాలి అనుకుంది. ప్రియుడు వరుణ్ తో కలసి రూప శ్రీ పక్కా ప్లాన్ వేసింది. తల్లి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో.. ప్రియుడు వరుణ్ సాయిని ఇంటికి పిలిపించుకుంది. ఇద్దరూ కలిసి.. అత్యంత దారుణంగా ఆమె గొంతు నులిమి చంపేశారు. ఏమీ తెలియనట్లుగా నటించారు.    సృహ తప్పి పడిపోయిందని చెబుతూ.. కొన ఊపిరితో ఉన్న లక్ష్మీని ఆసుపత్రికి తరలించారు. అయితే మధ్యలోనే చనిపోయింది అంటూ అందర్నీ నమ్మించారు. కానీ పోస్టు మార్టంలో ఆమెది సహజ మరణం కాదని.. ఎవరో హత్య చేశారని వైద్యులు వెల్లడించారు.  అనుమాస్పద మరణంగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన మే 06న చోటు చేసుకుంది. అప్పటి నుంచి పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేశారు. సీసీ ఫుటేజ్ లను పరిశీలించారు. దీంతో కీలక ఆధారాలు దొరికాయి. ప్రియుడు వరుణ్ ..లక్ష్మీ ఇంటికి రావడం.. మళ్లీ వెళ్లడం సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.      మరోవైపు రూప శ్రీ, వరుణ్ ఫోన్ కాల్స్ పైనా పోలీసులు ఆరా తీశారు. ప్రేమకు అడ్డుగా ఉందనే కారణంతో.. ఆ కాల్స్ ద్వారా లక్ష్మీని చంపేశారని నిర్ధారించారు. తరువాత ఇద్దర్నీ అరెస్ట్ చేశారు. కుదిరిది ఒప్పించి పెళ్లి  చేసుకోవాలి.. లేదంటే  ఎదిరించి పెళ్లి చేసుకోవాలి.. కానీ ప్రేమికుడి కోసం ఇలా నవ మోసాలు మోసి.. కని పెంచిన కన్న తల్లిని చంపడం దారుణమంటూ స్థానికులు మండిపడుతున్నారు.
  Published by:Nagesh Paina
  First published: