సహజీవనం చేస్తున్న వ్యక్తితో షాపుకెళ్లిన తల్లి.. వచ్చేసరికి కూతురి అనుమానాస్పద మృతి.. అసలేం జరిగింది..?

హత్యా, ఆత్మహత్యా..?

Murder or Suicide: 22 ఏళ్ల యువతి అనుమాస్పద స్థితిలో ఇంట్లో పడి ఉంది. ఆస్పత్రికి తరలిస్తే అప్పటికే మరణించిందని వైద్యులు చెప్పారు. పోలీసులు ఆత్మహత్య అని అనుమానిస్తుంటే.. ఆమె తల్లి మాత్రం ఇది హత్యే అంటోంది..? ఇంతకీ ఏం జరిగింది..?

 • Share this:
  Suicide or Murder?: విజయనగరం జిల్లా (Vizianagara District)లోని ఎస్‌.కోట శ్రీనివాసకాలనీకి చెందిన నెలాపు లక్ష్మి .. శ్రీకాకుళం (Srikakulam) నగరానికి చెందిన ధర్మారావు.. ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. వీరికి రోజా, వాసవి అనే ఇద్దరు కుమార్తెలున్నారు. రోజాకు వివాహమైంది. మిగతా ముగ్గురు కలిసి ఆర్టీసీ కాంప్లెక్స్‌ (RTC Complex) సమీపంలో విశాఖ-అరకు రోడ్డు (Visakha Aruku Road) కు ఆనుకుని పండ్ల జ్యూస్ షాపు నడుపుతున్నారు. నిన్నరాత్రి షాపు మూసేసిన తరువాత అంటే రాత్రి 9.15 గంటల సమయంలో.. సహజీవనం ఉంటున్న వ్యక్తితో కలిసి లక్ష్మీ ఇంటికి వెళ్లింది. తలుపు తెరిచి చూసి షాక్ లో ఉండిపోయింది. అపస్మారక స్థితిలో ఉన్న చిన్న కుమార్తె 22 ఏళ్ల వాసవిని చూసింది. షాక్ నుంచి తేరుకుని స్థానికుల సహకారంతో కూతురిని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లింది. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. హుటాహుటిన తరలించినప్పటికీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

  ఈ సంఘటనపై మృతురాలి అక్క రోజా పలు అనుమానాలు వ్యక్తం చేసింది. ఎస్‌.కోట పట్టణానికి చెందిన నాని అనే వ్యక్తి ఫోన్‌ చేసి తనను పెళ్లి చేసుకోకపోతే ఉరివేసుకుని ఆత్మహత్య (Suicide) చేసుకుంటానని చెల్లి వాసవి బెదిరిస్తోందని, వెంటనే ఇంటికి వెళ్లి ఆమె దగ్గర ఉండాలని చెప్పాడని.. దీంతో వెంటనే ఇంటికి వెళ్లే సరికే ఆమె చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది.

  మృతురాలి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మీ ప్రసన్నకుమార్‌ చెప్పారు. కాగా మృతురాలు వాసవి రాసినట్లు చెబుతున్న రెండు పేజీల లెటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు, చేతిరాతను నిర్ధారించే పనిలో ఉన్నట్లు సమాచారం.

  ఇదీ చదవండి: చంద్రబాబును కలిసిన గోరంట్ల.. రాజీనామాపై ఏమన్నారంటే?

  తన కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని తల్లి లక్ష్మీ అంటోంది. తాను దుకాణం వద్ద ఉండగా మంగళవారం రాత్రి ఇంటికి వచ్చి వంట చేసింది. ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉంటే ఎందుకు వంట చేస్తుందని ఆమె ప్రశ్నిస్తున్నారు. వైరు, తాడు, పెద్ద చున్నీ లేకుండా ఫ్యాన్‌కు ఎలా ఉరివేసుకోగలదు? వాసవిని ఎవరో చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తల్లి లక్ష్మి ఆరోపించింది.

  ఇదీ చదవండి: అవసరం కోసం ఆటో ఎక్కుతున్నారా.. బీ అలర్ట్.. ఈ విషయాలు గుర్తుంచుకోండి

  రాత్రి ఇంటి బయట ఒక వ్యక్తి చీకట్లో నిల్చుని ఉండగా వీధిలో ఓ మహిళ ఒకరు చూశారని, మరో వ్యక్తి మేడపైకి వెళ్లి హత్య చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తోంది. వాసవి మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి న్యాయం చేయాలని కన్నీటి పర్యంతమవుతోంది. దీంతో ఈ మృతి మిస్టరీగా మారింది. ఇది హత్యా? ఆత్మహత్యా? అన్న ఆనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యువతి తల్లి మాత్రం తన కుమార్తెను ఓ యువకుడు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నట్లు ఆరోపిస్తోంది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
  Published by:Nagesh Paina
  First published: