Andhra Pradesh: కొడుకు పనులతో తండ్రికి షాక్.. తన కొడుకును అరెస్ట్ చేయాలంటూ పోలీసులకు ఫోన్

కొడుకును పోలీసులకు పట్టించిన తండ్రి

కొడుకు తప్పు చేస్తే మందలించే తండ్రులు.. చివరికి నాలుగు దెబ్బలు వేసే తండ్రులు చాలామంది ఉంటారు. కానీ ఓ తండ్రి నేరుగా పోలీసులకే ఫోన్ చేసి తన కొడుకును అరెస్ట్ చేయండి అని ఫిర్యాదు చేశాడు. ఎందుకో తెలుసా..?

  • Share this:
    కొడుకు తప్పటడుగులు వేస్తున్నాడని తెలిసినా.. తప్పుడు మార్గంలో వెళ్తున్నాడని గుర్తించినా తండ్రి మందలించే ప్రయత్నం చేశాడు.. Tఒకటికి రెండు సార్లు హెచ్చరించే ప్రయత్నం చేశారు. ఇంకా కాదంటే ఒకటి రెండు దెబ్బలు కొడతారు. కానీ   మరికొందరైతే కొడుకుపై ప్రేమతో తప్పులను ఎవరికీ తెలియకుడదని మనసులోనే దాచుకుంటారు. కానీ తన కొడుకు చేస్తున్న పనులు సరైనవి కావని గుర్తించిన ఓ తండ్రి నేరుగా పోలీసులకు ఫోన్ చేశాడు. తన కొడుకును తీసుకెళ్లి.. అరెస్ట్ చేయడండి.. కఠినంగా శిక్షించండి అంటూ ఫోన్ చేశాడు. తండ్రి చేసిన పనిని మెచ్చుకున్న పోలీసులు.. మొదట షాక్ కు గురయ్యారు.  ఈ ఘటన విజయనగరం పట్టణంలో చోటు చేసుకుంది..

    విజయనగరం పట్టణంలో పూలబాగ్ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి నలుగురు కొడుకులు ఉన్నారు. అయితే అందులో ఓ కొడుకు మాత్రం పూర్తిగా చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు. తన వ్యసనాలు తీర్చుకోవాలి అంటే అంటే డబ్బులు సందపాదించాలి అనుకున్నాడు.. ఇంట్లో డబ్బులు అడిగితే ఇవ్వరని.. పైగా తిడతారని భావించాడు.. దీంతో తన స్నేహితులతో కలిసి దొంగగా అవతారమెత్తాడు.

    మొదట తన వ్యసానాల అవసరం కోసం చిరు దొంగంగా మారిన అతడు.. తరువాత అదే కంటిన్యూ చేస్తూ వచ్చాడు. భారీ దొంగతనాలకు పాల్పుడుతూ వచ్చాడు. వ్యసనాలకు బానిసై చోరీలకు పాల్పడుతున్న కొడుకును మొదట తండ్రి నమ్మాడు.. తాను ఎలాంటి దొంగతనాలకు పాల్పడడం లేదని.. అవన్నీ ఆరోపణలే అంటూ తండ్రిని నమ్మించాడు. దీంతో అలా జైలుకు వెళ్లిన ఒకటి రెండు సార్లు తండ్రి బెయిల్‌పై తీసుకొచ్చాడు.అయినా కుమారుడిలో మార్పు లేదు.. అతడు చేస్తున్నది తప్పు అని తల్లిదండ్రులు మందలించే ప్రయత్నం చేస్తే.. తల్లిదండ్రులపై దాడులకు పాల్పడుతున్నాడు. వరుసగా దొంగతనాలకు పాల్పడుతుండడంతో అతనిపై రౌడీషీట్‌ తెరిచారు పోలీసులు.

    ఇటీవల జైలు నుంచి బయటకొచ్చిన అతను పూల్‌బాగ్‌ కాలనీకి చెందిన మరో ఇద్దరు యువకులతో కలసి చోరీలకు పాల్పడ్డాడు. ఓ చెప్పుల దుకాణం ముందున్న పార్శిళ్లను దొంగిలించి ఇంట్లో దాచాడు. ఆ పార్శిల్ ఎక్కడ నుంచి వచ్చిందని ఇంట్లో వారిని ఆరాదీసిన తండ్రి.. తరువాత వాటిని కొడుకు దొంగలించినవిగా గుర్తించాడు. వెంటనే ఆలస్యం చేయకుండా పోలీసులకు సమాచారమిచ్చాడు. ఇంతలో పార్శిల్స్‌ పోయాయని రెండో పట్టణ పోలీసులకు దుకాణ యజమాని నుంచి ఫిర్యాదు అందింది. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న ముగ్గురు యువకులు పరారు కాగా పోలీసులు వారిని పట్టుకుని రిమాండుకు తరలించారు.
    Published by:Nagesh Paina
    First published: