• HOME
 • »
 • NEWS
 • »
 • CRIME
 • »
 • VIZAINAGARAM DEGREE STUDENT CASE SUSPECT UPDATE POLICE SHOCKED NGS

Andhra Pradesh: కాళ్లు చేతులు కట్టింది ఎవరు? విజయనగరం యువతి కేసులో ఊహించని ట్విస్ట్

Andhra Pradesh: కాళ్లు చేతులు కట్టింది ఎవరు? విజయనగరం యువతి కేసులో ఊహించని ట్విస్ట్

విజయనగరం జిల్లా గుర్లలోని రోడ్డు పక్కన తుప్పల్లో కాళ్లు, చేతులు కట్టేసి అపస్మారక స్థితిలో పడి ఉన్న యువతి కేసును పోలీసులు చేధించారు. 48 గంటల్లోనే ఏం జరిగింది అన్న విషయాన్ని పూర్తిగా తెలుసుకున్నారు. అయితే అసలు వాస్తవాలు తెలియడంతో పోలీసులే షాక్ కు గురయ్యారు.

విజయనగరం జిల్లా గుర్లలోని రోడ్డు పక్కన తుప్పల్లో కాళ్లు, చేతులు కట్టేసి అపస్మారక స్థితిలో పడి ఉన్న యువతి కేసును పోలీసులు చేధించారు. 48 గంటల్లోనే ఏం జరిగింది అన్న విషయాన్ని పూర్తిగా తెలుసుకున్నారు. అయితే అసలు వాస్తవాలు తెలియడంతో పోలీసులే షాక్ కు గురయ్యారు.

 • Share this:
  ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది విజయనగరంలో యువతిని తాళ్లతో కట్టి తోటలో పడేసిన ఘటన. ఈ ఘటన ఆదివారం జరిగినా మూడు రోజుల పాటు ఎలాంటి వివరాలు తెలియకపోవడంతో.. ఈ కేసుపై అనుమానాలు పెరిగాయి. అయితే ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు ముమ్మర దర్యాప్తు చేసి.. అసలు విషయం తెలుకుని షాక్ అయ్యారు. అయితే 48 గంటల్లోనే కేసును చేధించిన పోలీసులను జిల్లా ఎస్పీ రాజకుమారి సన్మానించారు.

  విజయనగరం జిల్లా గుర్లలో రోడ్డు ప్రక్కనే ఉన్న తుప్పల్లో ఒక అమ్మాయి అరుపులు విని స్థానికులు భయంతో అక్కడకు వెళ్లారు. అయితే అప్పటికే ఆమెను ఎవరో తాళ్లతో చేతులు, కాళ్లు కట్టేసి పడేసి ఉంది. ఆ యువతి అపస్మారక స్థితిలో ఉండడంతో భయపడ్డ స్థానికులు మార్చి ఒకటవ తేదీన గుర్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలియగానే హుటాహుటిన ఎస్ఐ నీలావతి, ఇతర పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాళ్ళు, చేతులు బంధించి ఉన్న సుమారు 24 ఏళ్ల అమ్మాయిని గుర్తించారు. అప్పటికే యువతి పస్మారక స్థితిలో ఉండడంతో వెంటనే స్థానికుల సహకారంతో గుర్ల పోలీసులు సపర్యలు చేసి. చికిత్స కోసం గుర్ల ప్రాధమిక ఆరోగ్య కేంద్రం, అక్కడి నుండి విజయనగరం ఘోషాసుపత్రికి తరలించారు.

  అయితే విషయం బయటకు రావడంతో విజనగరం వ్యాప్తంగా కలకలం రేపింది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఏరియాలో ఇలాంటి ఘటన జరగడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అది కూడా పోలీస్ స్టేషన్ కు సమీపంలో జరగడంతో భద్రతపై అనుమానాలు పెరిగాయి. అయితే అనుమానస్పద కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

  మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ కేసును చాలా తీవ్రంగా పరిగణించారు జిల్లా ఎస్పీ రాజకుమారి.  వెంటనే కేసు దర్యాప్తును దిశ మహిళా పోలీసు స్టేషనుకు అప్పగించి, డిఎస్పీ శ్రీ టి.త్రినాధ్ ను దర్యాప్తుకు ఆదేశించారు. మహిళా పిఎస్ డిఎస్పీ త్రినాథ్ తో పాటు విజయనగరం డిఎస్పీ అనిల్ కుమార్, విజయనగరం రూరల్ సిఐ మంగవేణి, గుర్ల ఎస్ఐ నీలావతి, పి.నారాయణరావులు వివిధ బృందాలుగా ఏర్పడి జిల్లా ఎస్పీ స్వీయ పర్యవేక్షణలో అనేక కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.

  అపస్మారక స్థితిలో ఉన్న యువతి పొంతనలేని సమాధానాలు చెప్పడంతో.. ఆమె స్నేహితుల దగ్గర నుంచి విచారణ చేపట్టారు. ఈ దర్యాప్తులో నమ్మలేని వాస్తవాలను గుర్తించారు. తన స్నేహితుడిని కలిసేందుకు.. యువతి ఫిబ్రవరి 27న హాస్టల్ నుండి బాబాయ్ దగ్గరకు వెళతానని పర్మిషను తీసుకున్నట్టు తెలుసుకున్నారు. ఆమె బాబాయ్ ఇంటికని చెప్పి ఇంకా వెళ్లకపోవడంతో ఆమె అన్నయ్య ఏమైంది అని హాస్టల్ లో ఆరా తీసినట్టు యువతి తెలుసుకుంది.

  ఇంటికి అని చెప్పి రాకపోతే అమ్మనాన్న, అన్నయ్య తిడతారని భయపడింది. దీంతో తన స్నేహితుడిని కలిసిన తర్వాత తిరుగు ప్రయాణంలో ప్రైవేటు ట్రావెల్స్ కు చెందిన పాలకొల్లు- పాలకొండ బస్సు ఎక్కింది. గుర్ల దాటిన తరువాత బస్సు దిగిన ఆమె.. రోడ్డు ప్రక్కన ఉన్న కాళీ ప్రదేశాన్ని గమనించింది. వెంటనే ఆమె తుప్పల్లోకి వెళ్ళి తన కుటుంబ సభ్యులను, స్నేహితులను నమ్మించేందుకు తనకు తానే కాళ్ళు, చేతులను చున్నీతో కట్టుకుంది. అక్కడితో ఆగక అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లుగా నటించింది.

  విచారణలో ఈ విషయాలన్ని ఆమె అంగీకరించినట్టు పోలీలసులు నిర్ధారించారు. అయితే రెండు రోజులు పాటు ఎన్నిసార్లు అడిగినా ఆమె ఆ విషయం చెప్పలేదని.. ఒకసారి కుటుంబ సభ్యులు బంధించారని. మరోసారి స్నేహితులు బంధించారని.. మరోసారి ఎవరో దుండగులు అని ఇలా పొంతన లేని సామాధానాలు చెబుతూ వచ్చింది.  అనుమానం వచ్చిన పోలీసులు సిసీ ఫుటేజి ఆధారంగా ఆమె చెప్పేవి అన్నీ అబద్దాలనే అని నిర్ధారణకు వచ్చారు. ఆ ఆధారలన్నీ చూపించి అడిగే సరికి యువతికి నిజం చెప్పక తప్పలేదు.

  అయితే ఇటీవల ఇలాంటి ఘటనలు పెరిగిపోవడం కలకలం రేపుతోంది. ఏది నిజమో? ఏదీ అబద్ధమో తెలియడం లేదు. ఏదీ ఏమైనా కేసును 48 గంటల్లో చేధించిన పోలీసులను ఎస్పీ రాజకుమారి ఘనంగా సన్మానించారు.
  Published by:Nagesh Paina
  First published:

  అగ్ర కథనాలు