అత్యాశ ఎంత పనిచేసే.. ఒక్క మెయిల్‌ అతన్ని జీరో చేసింది...

యూకెలోని ఓ HSBC బ్యాంకులో ప్రైజ్ మనీ మొత్తాన్ని డిపాజిట్ చేశారని.. అందులో ఖాతా తెరిస్తే ఆ డబ్బు మీ సొంతమవుతుందని చెప్పాడు. ఖాతా తెరిచేందుకు మొదట రూ.34500 రామకృష్ణతో డిపాజిట్ చేయించుకున్నాడు.ఆ తర్వాత రామకృష్ణకు నమ్మకం కలిగించేందుకు ఓ ఫేక్ ఏటీఎం కార్డును అతనికి పంపించారు.

news18-telugu
Updated: July 29, 2019, 7:40 PM IST
అత్యాశ ఎంత పనిచేసే.. ఒక్క మెయిల్‌ అతన్ని జీరో చేసింది...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మీరు యూకె లాటరీలో రూ.20కోట్లు గెలుకున్నారు.. లేక పలానా లక్కీ డ్రాలో కొన్ని కోట్ల రూపాయలకు మీ ఫోన్ నంబర్ ఎంపికైంది..ఇలాంటి మెసేజ్‌లు చూసి నమ్మేశారంటే ఇక అంతే సంగతి. గెలుచుకున్న సొమ్ము మీకు చేరాలంటే.. కొంత సొమ్ము చెల్లించాలంటూ పలు దఫాలుగా మీ వద్ద ఉన్నదంతా ఊడ్చేస్తారు. అసలు విషయం తెలిసేలోపు మీ ఖాతాల్లో డబ్బు ఖాళీ అయిపోతుంది. మోసోయామని గ్రహించే లోపు పూడ్చలేని నష్టం జరుగుతుంది.తాజాగా విశాఖపట్నంకు చెందిన బి.రామకృష్ణ అనే వ్యక్తికి కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది.

పోలీసుల కథనం ప్రకారం.. విశాఖ నగరానికి చెందిన రామకృష్ణ మెయిల్‌కు 2015లో ఓ మెయిల్ వచ్చింది.వరల్డ్‌ లాటరీ ఆర్గనైజేషన్‌ నుంచి వచ్చిన ఆ మెయిల్‌లో మీకు రూ.2500కోట్లు లాటరీ తగిలిందని ఉంది. అది నిజమేననుకుని.. రామకృష్ణ అందులోని నంబర్స్‌కు కాల్ చేశాడు.అలా ఫాస్టర్ అనే వ్యక్తి టచ్‌లోకి వచ్చాడు. తాను HSBC అధికారిని అని, యూకె నుంచి మాట్లాడుతున్నానని చెప్పాడు. యూకెలోని ఓ HSBC బ్యాంకులో ప్రైజ్ మనీ మొత్తాన్ని డిపాజిట్ చేశారని.. అందులో ఖాతా తెరిస్తే ఆ డబ్బు మీ సొంతమవుతుందని చెప్పాడు. ఖాతా తెరిచేందుకు మొదట రూ.34500 రామకృష్ణతో డిపాజిట్ చేయించుకున్నాడు.ఆ తర్వాత రామకృష్ణకు నమ్మకం కలిగించేందుకు ఓ ఫేక్ ఏటీఎం కార్డును అతనికి పంపించారు. అయితే అది పనిచేయకపోవడంతో ఫాస్టర్‌తో ఫోన్‌లో సంప్రదించాడు. దీంతో కెల్విన్ అనే వ్యక్తి మీ ఇంటికొచ్చి అన్నీ వివరిస్తారని చెప్పారు.

ఓరోజు రామకృష్ణ ఇంటికి వచ్చిన కెల్విన్.. బ్లాక్ కోటెడ్ కరెన్సీని ఒక లిక్విడ్‌లో ముంచి పౌండ్స్‌గా మార్చాడు. రామకృష్ణ అది నిజమైన కరెన్సీయే అని నమ్మేశాడు. దీంతో తెచ్చిన లిక్విడ్ అయిపోయిందని.. యూకె వెళ్లి దాన్ని కొరియర్ చేస్తానని చెప్పాడు. ఆ తర్వాత పలు దఫాలుగా అతని వద్ద నుంచి రూ.70లక్షలు జమ చేయించుకున్నారు. ఆ తర్వాత వారి వద్ద నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. విశాఖ సైబర్ పోలీసులు ఈ కేసుపై ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నారు.
Published by: Srinivas Mittapalli
First published: July 29, 2019, 7:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading