నగ్న ఫోటోలతో బ్లాక్‌మెయిల్.. యువతులను అలా ట్రాప్ చేసి..

ఆ సమయంలో వారితో కాస్త సన్నిహితంగా మెలిగిన కుమార్.. వారిని నగ్నంగా ఫోటోలు తీశాడు. ఆపై వాటిని అడ్డుపెట్టుకుని బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. పోలీసులను ఆశ్రయిస్తే ఫోటోలను లీక్ చేస్తానని బెదిరించడంతో ఎవరూ ఆ సాహసం చేయలేదు.అయితే ఇటీవల ఓ బాలిక ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతని

news18-telugu
Updated: November 16, 2019, 3:15 PM IST
నగ్న ఫోటోలతో బ్లాక్‌మెయిల్.. యువతులను అలా ట్రాప్ చేసి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలను ఆకర్షించి వారిని ట్రాప్ చేస్తున్న ఓ వ్యక్తిని విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎంతోమంది అమ్మాయిలు అతని ట్రాప్‌లో పడి జీవితాన్ని నాశనం చేసుకున్నారు. అయితే పరువు పోతుందన్న భయంతో ఎవరూ అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఇటీవల ఓ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో ఎట్టకేలకు అతగాడి లీలలు బయటపడ్డాయి.

పోలీసుల కథనం ప్రకారం.. విశాఖ కంచరపాలెంకి చెందిన కుమార్ అనే వ్యక్తి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.అయితే ఈజీ మనీకి అలవాటుపడ్డ అతను అందుకోసం అడ్డదారులు తొక్కాడు. ఫేస్‌బుక్‌లో ఖాతా తెరిచి డాక్టర్‌గా ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాడు. ఆపై కొంతమంది అమ్మాయిలకు వల వేశాడు. డాక్టర్‌ అనుకుని నమ్మి వాళ్లలో కొందరు అతన్ని కలిశారు. ఆ సమయంలో వారితో కాస్త సన్నిహితంగా మెలిగిన కుమార్.. వారిని నగ్నంగా ఫోటోలు తీశాడు. ఆపై వాటిని అడ్డుపెట్టుకుని బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. పోలీసులను ఆశ్రయిస్తే ఫోటోలను లీక్ చేస్తానని బెదిరించడంతో ఎవరూ ఆ సాహసం చేయలేదు.అయితే ఇటీవల ఓ బాలిక ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతని బాగోతం బయటపడింది. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.

ఇది కూడా చూడండి :First published: November 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>