Home /News /crime /

Vizag Gas Leak | ఎల్‌జీ పాలిమర్స్‌‌ పరిశ్రమలో గ్యాస్ లీక్ కావడానికి కారణమిదే..

Vizag Gas Leak | ఎల్‌జీ పాలిమర్స్‌‌ పరిశ్రమలో గ్యాస్ లీక్ కావడానికి కారణమిదే..

విశాఖ గ్యాస్ లీక్

విశాఖ గ్యాస్ లీక్

విశాఖ గ్యాస్‌ లీక్‌ ప్రమాదానికి ఎల్‌జీ పాలిమర్స్‌ యాజమాన్య నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారణ అయింది. లాక్‌డౌన్‌ ఉన్నప్పటికీ పరిశ్రమలో ప్రతి రోజు మెయింటెనెన్స్‌ చేయాల్సి ఉంది.

    విశాఖ గ్యాస్‌ లీక్‌ ప్రమాదానికి ఎల్‌జీ పాలిమర్స్‌ యాజమాన్య నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారణ అయింది. లాక్‌డౌన్‌ ఉన్నప్పటికీ పరిశ్రమలో ప్రతి రోజు మెయింటెనెన్స్‌ చేయాల్సి ఉంది. మెయింటెనెన్స్ కోసం 45 మందికి ప్రభుత్వం ప్రత్యేక పాస్‌లు కూడా జారీ చేసింది. అయితే.. యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టుగా తెలుస్తోంది. పరిశ్రమ ట్యాంకుల్లో దాదాపు 2 వేల మెట్రిక్‌ టన్నుల స్టైరిన్‌ను నిల్వ చేశారు. దాన్ని కచ్చితంగా 20 డిగ్రీల లోపు ఉష్ణోగ్రత ఉంచాలి. కానీ ఫ్యాక్టరీ యాజమాన్యం అంతగా పట్టించుకోలేదు. మెయింటెనెన్స్ సరిగా చేయలేదు. దీంతో.. ఉష్ణోగ్రతలు పెరిగి స్టైరిన్‌ లీక్‌ అయి మంటలు చెలరేగాయి. దీంతో ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాలకు స్టైరెన్‌ గ్యాస్‌ వేగంగా వ్యాప్తి చెందింది. కొద్ది సేపటికే 3 కిలోమీటర్ల మేర వ్యాపించి ప్రజా జీవనాన్ని ప్రమాదంలోకి నెట్టింది.
    Published by:Shravan Kumar Bommakanti
    First published:

    Tags: AP News, Visakhapatnam, Vizag, Vizag gas leak

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు