Home /News /crime /

Vizag Gas Leak | స్టైరిన్ గ్యాస్ ప్రభావం ఎంత..? ప్రమాదం ఎంత..?

Vizag Gas Leak | స్టైరిన్ గ్యాస్ ప్రభావం ఎంత..? ప్రమాదం ఎంత..?

స్టైరిన్

స్టైరిన్

విశాఖ గ్యాస్ లీక్ ప్రమాదంలో లీకైన వాయువు.. స్టైరిన్ (పీవీసీ గ్యాస్). దీని రసాయన ఫార్ములా C8H8.

    విశాఖ గ్యాస్ లీక్ ప్రమాదంలో లీకైన వాయువు.. స్టైరిన్ (పీవీసీ గ్యాస్). దీని రసాయన ఫార్ములా C8H8. ఈ సమ్మేళనం తొందరగా గాలిలో కలిసిపోయి తీపి వాసనను విడుదల చేస్తుంది. 2018 నాటికి 35 మిలియన్ టన్నుల స్టైరిన్‌ను ఉత్పత్తి చేశారు. కాఫీ బీన్స్, పీనట్స్, కోల్ థార్ వంటి వాటిలో ఇది ఉంటుంది. దీన్ని తొలిసారిగా 1839లో జర్మనీకి చెందిన ఎడ్వర్డ్ సైమన్ గుర్తించాడు. అమెరికన్ స్వీట్ గమ్ ట్రీ అనే చెట్టుకు దీన్ని ద్రవ రూపంలో గుర్తించాడు. దీన్ని గాలి, కాంతి, వేడికి ఉంచినపుడు మెల్లిమెల్లిగా గట్టిగా, రబ్బరులా రూపాంతరం చెందుతుంది. దీన్ని ఆయన స్టైరాల్ ఆక్సైడ్‌గా పిలిచాడు. 1845లో ఆగస్ట్ హోప్‌మన్ అనే శాస్త్రవేత్త దీనికి రసాయన ఫార్ములాను కనుగొన్నాడు. దీన్ని రబ్బరు సంబంధిత పరిశ్రమల్లో వాడతారు. విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ కూడా వాడుతోంది. అందువల్లే వాయువు రూపంలో ఇది బయటికి వచ్చి.. ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేసింది.

    ఆరోగ్యంపై ప్రభావం ఎంత అంటే..
    చర్మానికి తగిలినా, కంటికి తగిలినా కేన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ఆరోగ్యకర కణజాలాన్ని పాడు చేస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతుంది. కిడ్నీ, శ్వాస సంబంధిత వ్యాధులకు గురి చేస్తుంది. దీని ప్రభావానికి గురైతే వెంటనే సదరు వ్యక్తిని ఘటనా స్థలి నుంచి వేరే చోటుకు తీసుకెళ్లాలి. దుస్తులను విప్పేసి, శరీరం వేడిగా ఉండేలా చూడాలి. శ్వాస ఆడకపోతే వైద్య చికిత్సకు తరలించాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ నోటితో శ్వాస అందించకూడదు. చర్మానికి తగిలితే దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది. కంటికి తగిలితే దురద, కన్నీళ్లు కారతాయి. అందుకే, చర్మాన్ని సబ్బు, నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. కంటికి తగిలిన వెంటనే నీళ్లతో కళ్లను శుభ్రం చేసుకోవాలి. పది నిమిషాల పాటు క్రమంగా కడుగుతూ ఉండాలి. వాంతులు వస్తే కచ్చితంగా చేసుకోవాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపుకోవద్దు.
    Published by:Shravan Kumar Bommakanti
    First published:

    Tags: Ap cm ys jagan mohan reddy, AP News, Visakhapatnam, Vizag, Vizag gas leak

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు