హోమ్ /వార్తలు /క్రైమ్ /

Vizag gas leak | 9 మంది మృతి.. ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష..

Vizag gas leak | 9 మంది మృతి.. ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష..

9 మంది మృతి

9 మంది మృతి

vizag gas leak : విశాఖ గ్యాస్ లీక్ ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి చేరింది. ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి వెలువడిన స్టైరిన్ గ్యాస్ ప్రభావంతో వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు.

  vizag gas leak : విశాఖ గ్యాస్ లీక్ ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి చేరింది. ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి వెలువడిన స్టైరిన్ గ్యాస్ ప్రభావంతో వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. ఆర్ఆర్ వెంకటాపురంలో కాల్వలో పడి ఇద్దరు, బావిలో పడి ఒకరు, కేజీహెచ్ ఆస్పత్రిలో ముగ్గురు, ఆర్పీ వార్డులో ఇద్దరు, విజయ నగరం కొత్తవలస ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతిచెందారు. ఇదిలా ఉండగా, ప్రమాదంపై ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. హోం మంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో కలిసి ప్రధాని గ్యాస్ లీక్ ఘటనపై సమీక్షించారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, ఎన్డీఎంఏ అధికారులు కూడా సమీక్షలో పాల్గొన్నారు.

  ఇదిలా ఉండగా, సీఎం జగన్ కాసేపటి క్రితమే విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి విశాఖకు బయలుదేరి వెళ్లారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో సీఎస్ నీలం సాహ్ని, ఇతర అధికారులతో కలిసి ఆయన పయనమయ్యారు. విశాఖలో కేజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం పరామర్శించనున్నారు.

  Published by:Shravan Kumar Bommakanti
  First published:

  Tags: AP News, Crime, Visakhapatnam, Vizag gas leak

  ఉత్తమ కథలు