హోమ్ /వార్తలు /క్రైమ్ /

Vizag gas leak : విశాఖ గ్యాస్ లీక్.. 7కు చేరిన మృతుల సంఖ్య..

Vizag gas leak : విశాఖ గ్యాస్ లీక్.. 7కు చేరిన మృతుల సంఖ్య..

జీవీఎంసీ కమిషనర్ సృజన

జీవీఎంసీ కమిషనర్ సృజన

Vizag gas leak : విశాఖ గ్యాస్ లీక్‌లో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. తెల్లవారుజామున పరిశ్రమను తెరవబోతుండగా.. స్టైరిన్ గ్యాస్ లీకై చుట్టుపక్కల ఉన్న వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు.

  విశాఖ గ్యాస్ లీక్‌లో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. తెల్లవారుజామున పరిశ్రమను తెరవబోతుండగా.. స్టైరిన్ గ్యాస్ లీకై చుట్టుపక్కల ఉన్న వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం దాదాపు 1500 ఇళ్లను ప్రభుత్వం ఖాళీ చేయించింది. అక్కడి ప్రజలందర్నీ సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ప్రస్తుతం 180 మంది కేజీహెచ్‌లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో 40 మందిని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ముగ్గురిని వెంటిలేటర్ మీద ఉంచినట్లు జీవీఎంసీ కమిషనర్ సృజన ‘న్యూస్18’తో తెలిపారు. అటు.. మరో గంటలో సీఎం జగన్ విశాఖకు చేరుకోనున్నట్లు ఆమె తెలిపారు.

  ఇదిలా ఉండగా, వైజాగ్ గ్యాస్ లీక్ ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. ఈ ఘటనపై మరికాసేపట్లో ఎన్‌డీఎమ్ఏ(నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ)తో సమావేశం కానున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై కేంద్ర హోంశాఖతో పాటు ఎన్‌డీఏమ్ఏ అధికారులను ఆరా తీసిన ప్రధాని నరేంద్రమోదీ... ప్రమాదం నుంచి ప్రతి ఒక్కరూ సురక్షితంగా బయటపడాలని ఆకాంక్షించారు. ఘటనపై ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు ఫోన్ చేసిన వివరాలు తెలుసుకున్న ప్రధాని నరేంద్రమోదీ... కేంద్రం పూర్తిగా సహకారం అందిస్తుందని తెలిపారు.

  Published by:Shravan Kumar Bommakanti
  First published:

  Tags: AP News, Crime, Visakhapatnam, Vizag gas leak

  ఉత్తమ కథలు