Home /News /crime /

VIZAG GAS LEAK LG POLYMERS COMPANY CLARIFIES ON SECOND LEAK AT FACTORY BS

Vizag Gas Leak | ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీ వివరణ ఇదీ..

విడుదలవుతున్న గ్యాస్ (file)

విడుదలవుతున్న గ్యాస్ (file)

విశాఖలో స్టైరిన్ గ్యాస్ లీకేజీపై ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీ వివరణ ఇచ్చింది. రెండో సారి గ్యాస్ లీకైందన్న వార్తపైనా స్పందించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.

    Vizag Gas Leak : విశాఖలో స్టైరిన్ గ్యాస్ లీకేజీపై ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీ వివరణ ఇచ్చింది. రెండో సారి గ్యాస్ లీకైందన్న వార్తపైనా స్పందించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలోకి వచ్చింది. రెండోసారి గ్యాస్ విడుదల అయ్యిందన్న వార్తలో నిజం లేదు. గ్యాస్ నియంత్రణకు అన్ని చర్యలు తీసుకున్నాం. స్టైరిన్‌తో నీళ్లు కలపడం, ఉష్ణోగ్రతను అదుపులో ఉంచడం లాంటి చర్యలు తీసుకున్నాం. అయినా.. స్థానిక ప్రజలను ఇళ్లు ఖాళీ చేయించాలని ప్రభుత్వాన్ని కోరాం. ఎప్పటికప్పుడు అధికారులతో సంప్రదిస్తున్నాం. గ్యాస్ లీకేజీ వల్ల చోటు చేసుకున్న నష్టాన్ని గమనిస్తున్నాం. స్థానిక ప్రజల, ఉద్యోగుల ఆరోగ్యం, భద్రతకు కట్టుబడి ఉన్నాం’ అని పేర్కొంది. కాగా.. గ్యాస్ లీకేజీ ఘటన నేపథ్యంలో విషవాయువులు వెలువడిన ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీపై కేసు నమోదైంది. నిన్న విశాఖలోని గోపాలపట్నం పోలీస్ స్టేషన్‌లో 278, 284, 285, 337, 338, 304 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విషవాయువుతో వాతావరణాన్ని కలుషితం చేయడం, నిర్లక్ష్యం, మానవ జీవనానికి హాని కలిగించడం, పరిస్థితిని అదుపు చేయకపోవడంతోపాటు హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు.

    ఇదిలా ఉండగా, స్టైరిన్‌ను పీటీబీసీ ద్వారా నియంత్రణలోకి తేవొచ్చన్న నిర్ణయంతో గుజరాత్‌కు చెందిన 9 మంది ప్రతినిధి బృందాన్ని విశాఖకు రప్పించారు. గుజరాత్‌లోని వ్యాపిలో లభ్యమవుతున్న పీటీబీసీతో వారు స్టైరిన్‌ను నియంత్రణలోకి తీసుకొస్తున్నారు. స్టైరైన్, బూటాడిన్, వినైల్ అసిటేట్ లాంటి ప్రమాదకర వాయువులను నిరోధించడంలో పీటీబీసీ ఉపయోగపడుతుందట.
    Published by:Shravan Kumar Bommakanti
    First published:

    Tags: AP News, Vizag, Vizag gas leak

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు