విశాఖ గ్యాస్ లీక్ ప్రమాదంలో మృతుల సంఖ్య 12కు చేరింది. కేజీహెచ్‌లో మరో 193 మంది బాధితులు మూడు వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో 45 మంది చిన్నారులు ఉన్నారు. అటు.. కెమికల్ ఎఫెక్ట్‌తో బాధితులు రాత్రంతా నిద్రలేక ఇబ్బంది పడ్డారు. కళ్ల మంట, చర్మంపై దద్దర్లు వచ్చి మంట పుట్టడంతో సమస్య ఎదుర్కొన్నారు. ఇదిలా ఉండగా, నిన్న రాత్రి మరోసారి గ్యాస్ లీకైందన్న పుకారు చెలరేగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఫ్యాక్టరీ చుట్టుపక్కల వాళ్లు, ఇతర ప్రాంతాల్లోని ప్రజలు నిద్ర లేని రాత్రిని గడిపారు. ముల్లె మూట సర్దుకొని రోడ్ల మీదకు వచ్చి జాగారం చేశారు. దీంతో ఆ ప్రాంగణమంతా జాతరను తలపించింది. వేల మంది కంచరపాలెం, ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు.
అయితే, స్టైరిన్ గ్యాస్ లీకేజీ విషయంలో వదంతులు నమ్మవద్దని విశాఖ పోలీసు కమిషనర్ ఆర్కేమీనా తెలిపారు. ఎల్జీ పాలిమర్స్ వద్ద పరిస్థితి పూర్తిగా అదుపులో ఉన్నదని, చుట్టుప్రక్కల ఉన్నటువంటి 5 గ్రామాలు ప్రజలు తప్పించి మిగతా ప్రాంతాలలో నివాసముంటున్న వారు ఎక్కడికీ వెళ్లనవసరం లేదు . ప్రజలందరూ ఆందోళన చెందకుండా నిశ్చింతగా ఉండవచ్చని తెలిపారు.
Published by:Shravan Kumar Bommakanti
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.