హోమ్ /వార్తలు /క్రైమ్ /

Vizag gas leak | విశాఖకు సీఎం జగన్.. 5కు చేరిన మృతుల సంఖ్య..

Vizag gas leak | విశాఖకు సీఎం జగన్.. 5కు చేరిన మృతుల సంఖ్య..

ఏపీ సీఎం వైఎస్ జగన్ విశాఖపట్నానికి బయలుదేరనున్నారు. విష వాయువు వల్ల అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని సీఎం పరామర్శించనున్నారు.

    ఏపీ సీఎం వైఎస్ జగన్ విశాఖపట్నానికి బయలుదేరనున్నారు. విష వాయువు వల్ల అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని సీఎం పరామర్శించనున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న సీఎం.. తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ వినయ్ చంద్, మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు. రసాయన వాయువు విడుదలైన బాధిత ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. కాగా, గ్యాస్ లీక్ ఘటనలో మృతుల సంఖ్య 5కు చేరింది. అందులో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. కింగ్ జార్జ్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు మరణించారు.

    కాగా, లాక్ డౌన్‌లో ఉన్న కంపెనీని తెరిపించే క్రమంలో ఈ రోజు తెల్లవారు జామున 4గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. పరిశ్రమ నుంచి పీవీసీ గ్యాస్(స్టైరిన్) లీకైనట్లు తెలిపారు. గ్యాస్ లీకేజీతో పరిసరాల్లోని చెట్లు వాడిపోయాయి. ఊపిరాడక పలు మూగ జీవాలు మృత్యువాతపడ్డాయి.

    First published:

    Tags: AP News, Crime, Visakhapatnam, Vizag, Vizag gas leak

    ఉత్తమ కథలు