ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళతో అసభ్య ప్రవర్తన... వైజాగ్ సీఐపై సస్పెషన్ వేటు...

అక్క ప్రేమించిన మేనబావ ఎంగేజ్‌మెంట్‌ను పోలీసుల సాయంతో ఆపించిన విశాఖ యువతి... యువతితో పరిచయం పెంచుకుని, అసభ్యంగా ప్రవర్తించిన సీఐ సన్యాసినాయుడు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 30, 2019, 7:04 PM IST
ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళతో అసభ్య ప్రవర్తన... వైజాగ్ సీఐపై సస్పెషన్ వేటు...
ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళతో అసభ్య ప్రవర్తన... వైజాగ్ సీఐపై సస్పెషన్ వేటు...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 30, 2019, 7:04 PM IST
అక్కను ప్రేమించిన యువకుడు మోసం చేస్తున్నాడనే ఆవేదనతో పోలీసులకు ఫిర్యాదు చేద్దామని వచ్చిన యువతికి, ఊహించని విధంగా రక్షకభట నిలయంలో వేధింపులు ఎదురయ్యాయి. కాపాడాల్సిన వృత్తిలో ఉన్న పోలీసే... అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధించడం మొదలెట్టాడు. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం నగరంలో వెలుగుచూసింది. విశాఖ నగరంలోని ఎంవీపీ కాలనీ సెక్టార్-9లో ఉంటున్న మీనాక్షి... పీహెచ్‌డీ చేస్తూ, తన అక్క కృష్ణకుమారితో కలిసి నివాసం ఉంటోంది. మీనాక్షి అక్క కృష్ణకుమారి, తన మేనబావ విజయ్ భాస్కర్ ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరి మధ్య కొన్నాళ్లుగా శారీరక సంబంధం కూడా కొనసాగింది. అయితే కృష్ణ కుమారిని పెళ్లి చేసుకుంటే, వరకట్నం రాదనే ఉద్దేశంతో విజయ్ భాస్కర్ వేరే అమ్మాయితో నిశ్చితార్థానికి సిద్ధమయ్యాడు. గత మార్చిలో వేరే అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ ఫిక్స్ చేసుకున్న విజయ్ భాస్కర్ ప్రయత్నాన్ని పోలీసుల సాయంతో అడ్డుకుంది మీనాక్షి... ఈ సమయంలో మీనాక్షితో పరిచయం పెంచుకోవాలని చూసిన సీఐ సన్యాసినాయుడు... ఆమె ఫోన్ నెంబర్, అడ్రెస్, విద్యార్హత... తదితర వివరాలన్నీ అడిగి తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఆమెకు తరుచూ ఫోన్ చేస్తూ, వాట్సాప్ మెసేజ్‌లు పంపుతూ అసభ్యంగా ప్రవర్తించడం మొదలెట్టాడు.

బీచ్‌కు ఎప్పుడు వస్తావని? ఒకే కులం కదా... మమ్మల్ని ప్రేమించొచ్చు కదా?... అంటూ ఫోన్‌లో వేధించడం మొదలెట్టాడు. సీఐ సన్యాసినాయుడు పోకిరి చేష్టలతో ఫోన్ ఎత్తాలంటేనే భయంతో వణికిపోయింది మీనాక్షి. సీఐ అసభ్య ప్రవర్తనను మౌనంగా భరిస్తూ వచ్చిన మీనాక్షి... ఇక తట్టుకోలేక మహిళా సంఘాల మద్ధతులో పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిరిగింది. వారి సలహాతో ఏసీసీకి సీఐ సన్యాసినాయుడిపై ఫిర్యాదు చేసింది. సాక్ష్యాలతో సహా సీఐ సన్యాసినాయుడిపై ఆరోపణలు రావడంతో అతన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు విశాఖ కమిషనర్. అయితే సీఐ సన్యాసినాయుడు మాత్రం తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవమనీ, మీనాక్షి కావాలనే తనపై అసత్య ఆరోపణలు చేస్తోందని తెలిపాడు.


First published: April 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...