Home /News /crime /

VISKHAPATNAM CRIME NEWS TWO THEFTS IN CITY CITY SAME DATE AND SAME TIMES NGS

Andhra Pradesh: ఉక్కపోత భరించలేక గాలికోసం చూస్తే.. ఇళ్లు గుల్ల అయ్యింది..? అసలేం జరిగింది..?

గాలి కోసం వెళ్తే దోచుకెళ్లారు.

గాలి కోసం వెళ్తే దోచుకెళ్లారు.

ఇంట్లో ఉండే ఉక్క పోత భరించలేక కొన్ని కుటుంబాలు ఆరు బయటే పడుక్కోవల్సి వస్తోంది. అలాంటి వారినే టార్గెట్ చేస్తున్నారు దుండగులు.. రెండు రోజుల ముందు రెక్కీ నిర్వహించం.. తరువాత దోచుకోవడం ఆనవాయితీగా మార్చుకున్నారు..

    ఏపీని ఓ పక్క కరోనా భయపెడుతుంటే... మరోవైపు భానుడు మాడు పగిలేలా చేస్తున్నాడు. ప్రచండ వేడితో ప్రజలపై తన ప్రతాపం చూపిస్తున్నాడు. మధ్యాహ్నం సంగతి అటుంచుతే.. రాత్రి సైతం వేడి గాలులు సెగలు పుట్టేలా చేస్తున్నాయి. ఫ్యాన్ లు వేసుకున్న వేడి గాలే వస్తోంది. దీంతో కొన్ని చోట్ల భరించలేని ఉక్కపోతతో జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఆ వేడి గాలులను.. ఉక్క పోతను భరించలేక. కాసేపు హ్యాపీగా నిద్ర పోదామని ఆరుబయటకు వచ్చి పడుకుంటే ఊహించని ఘటన జరిగింది. గాలికోసం ఇంటి ఆవరణలో పడుకుంటే.. ఇల్లే గుల్లయింది. అలా నిద్ర పట్టిందో లేదో.. ఇలా ఇంట్లో బంగారాన్ని దోచుకెళ్లారు దుండగులు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఒకేరోజు.. రెండు ఇళ్లలో దొంగలు పడి.. విలువైన బంగారం దోచుకెళ్లారు. ఇంటికి తాళం వేయలేదు.. బీరువాకు తాళం వేయలేదు. కరోనా, కర్ఫ్యూ, ఈ సమయంలో దొంగలేం చేస్తారని ఆదమరిచారు. ఇల్లు గుల్ల చేసుకున్నారు.

    విశాఖలో నిన్న అర్ధరాత్రి జరిగిన దొంగతనాల తీరు పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం ఇలా ఉంది. అక్కయ్యపాలెంలోని నగరం నడిబొడ్డున జగన్నాధపురం కాలనీలో ఇంట్లో చోరీ జరిగింది. అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ సంఘటనలో 27 తులాల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. ఇంటి తలుపులు బార్లా తెరుచుకుని బీరువా తాళాలు కూడా అందుబాటులో ఉండే విధంగా ఉంచడంతో దొంగల పని చాలా సులువైంది. దర్జాగా ఇంటి ముందరి గేట్ నుంచే ఇంట్లోకి ప్రవేశించారు. అక్కడే బీరువాతాళాలు ఉండటంతో బీరువా తెరిచారు. 27 కిలోల బంగారు ఆభరణాలు, మూడు లక్షల నగదును ఎత్తుకుపోయారు. ఇదంతా లోకల్ గ్యాంగ్ పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు.

    బాధితుడు ఆయిల్ వ్యాపారం చేసుకునే కంచిపాటీ శ్రీనివాసరావు. కర్ఫ్యూ సమయంలో అందరూ ఇళ్లలోనే ఉంటున్నా.. ఈ తరహా ఘటన జరగడం విస్మయానికి గురిచేసింది. నిత్యం రాత్రి వేళల్లో తలుపులు బార్లా తెరుచుకుని పడుకున్న వారినే ఈ గ్యాంగ్ టార్గెట్ చేస్తోందని పోలీసులు అనుమానిస్తున్నారు. రెక్కీ చేసి మరి అర్ధరాత్రి ఈ చోరీకి పాల్పడినట్లు ప్రాధమికంగా నిర్థారణకు వచ్చారు పోలీసులు. వేలిముద్రల నిపుణులు దొంగలకు చెందిన ఆధారాల సేకరణ చేపట్టారు. విశాఖ ఈస్ట్ జోన్ క్రైమ్ సిఐ సింహాద్రి నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

    మహారాణి పేటలో కూడా ఈ తరహా చోరీయే జరిగింది. రాత్రి ఇంటి తలుపులు వేయకుండా బయట పడుకున్నారు. దీంతో దొంగలు ఈ ఇంట్లో 16 తులాలు బంగారు ఆభరణాలు దోచుకొన్నారు. బీరువా తాళాలు కూడా అందుబాటులో ఉండటం గమనార్హం. ఈ రెండిళ్లలో ఒకే తరహాలో చోరీ చేసింది ఒకే గ్యాంగ్ అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. పక్కాగా రెక్కి నిర్వహించి.. ఇళ్లలో పరిస్థితి బాగా గమనించే ఇవి చేసినట్టు అనుమానిస్తున్నారు. గ్యాంగ్ రెండు గ్రూపులుగా విడిపోయి చోరీకి పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. మహారాణి పేట సిఐ సోమ శేఖర్ దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Crime news, Visakhapatnam, Vizag

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు