Home /News /crime /

VISKHAPATNAM CRIME NEWS ONE MAN WHO MARRIED NINE TIMES ARRESTED VISKAHAPATNAM NGS

Visakhapatnam: విశాఖలో మా‘నవ’మృగం లీలలు: తొమ్మిది మంది భార్యలది తొమ్మిది రకాల కథలు.. నిత్యం నరకయాతన: స్నేహితుడి భార్యనూ వదలని అరుణ్ కుమార్

వీడు మామూలోడు కాదు.. సినిమాకు వెళ్లి ఒక అమ్మాయిని.. స్నేహితుడి భార్యను, ఇద్దరు పిల్లల తల్లిని.. ఇలా తొమ్మిది మందిని నమ్మించి పెళ్లి చేసుకున్నాడు. తరువాత వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి తెచ్చాడు. మాట వినను అంటే కత్తులు, తుపాకీలతో బెదిరిస్తున్నాడు. విశాఖలో ఈ నిత్య పెళ్లికొడుకు లీలలు వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే

వీడు మామూలోడు కాదు.. సినిమాకు వెళ్లి ఒక అమ్మాయిని.. స్నేహితుడి భార్యను, ఇద్దరు పిల్లల తల్లిని.. ఇలా తొమ్మిది మందిని నమ్మించి పెళ్లి చేసుకున్నాడు. తరువాత వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి తెచ్చాడు. మాట వినను అంటే కత్తులు, తుపాకీలతో బెదిరిస్తున్నాడు. విశాఖలో ఈ నిత్య పెళ్లికొడుకు లీలలు వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే

వీడు మామూలోడు కాదు.. సినిమాకు వెళ్లి ఒక అమ్మాయిని.. స్నేహితుడి భార్యను, ఇద్దరు పిల్లల తల్లిని.. ఇలా తొమ్మిది మందిని నమ్మించి పెళ్లి చేసుకున్నాడు. తరువాత వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి తెచ్చాడు. మాట వినను అంటే కత్తులు, తుపాకీలతో బెదిరిస్తున్నాడు. విశాఖలో ఈ నిత్య పెళ్లికొడుకు లీలలు వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే

ఇంకా చదవండి ...
  ఒకటి రెండు కాదు.. తొమ్మిది పెళ్లిళ్లు వినడానికే ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. విశాఖలో ఉన్న మానవ మృగం లీలలు చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. అందమైన యువతులు, మహిళలకు వల వేయడం.. తరువాత వారికి అరచేతిలో స్వర్గం చూపిస్తానంటూ.. పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటానని నమ్మించడం.. పెళ్లికి ఒప్పుకోగానే రహస్యంగా వివాహం చేసుకోవడం.. కొన్ని రోజులకే మంచి జీవితం, డబ్బులు కోసం వ్యభిచారం చేయాలంటూ బెదిరింపులకు పాల్పడడం అనవాయితీగా చేసుకున్నాడు. ఇందులో స్నేహితుడి భార్యను కూడా వదల్లేదు. ఎవరైనా అతడి మాటకు ఎదురు చెబితే బెదిరింపులకు దిగుతాడు.. పోలీసులు తనను ఏం చేయలేరని చెబుతూ.. బలవంతంగా వారిని ఒప్పిస్తాడు. ఇలా అతడు చేసిన అరాచకాలు ఎన్నో ఒక్కొక్కొటి బయటకు వస్తున్నాయి.

  ఆ మానవ మృగం పేరు అరుణ్ కుమార్. అతడు విశాఖలో చేయని నేరం లేదేమో. గంజాయి స్మగ్లింగ్, సెటిల్ మెంట్లు, మహిళల అక్రమ రవాణా ఇలా అన్ని ఇల్లీగల్ పనులను టచ్ చేస్తాడు. ఇప్పటికే పలు కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చినా అతడు మారలేదు. పైగా అతడి అరాచకాల సంఖ్య మరింత పెరిగింది. పేద యువతులు, ఒంటరి మహిళను గుర్తించడం.. వారి అవసరాలకు అండగా ఉంటనని.. తనను పెళ్లిచేసుకుంటే స్వర్గం చూపిస్తానని నమ్మించడం.. వారు ఒప్పుకుంటే వెంటనే రహస్యంగా పెళ్లి చేసుకుని సమీప ప్రాంతంలో కాపురం పెట్టడం.. తరువాత వ్యభిచారం చేయమని ఒత్తిడి చేయడం అతడి నైజం అని తేలింది.

  ఒక వేళ తాను చెప్పినది ఎవరైనా వినకపోతే చంపడానికి కూడా వెనుకాడడని హెచ్చరిస్తుంటాడు. తన చేతిలో ఉన్న ఉన్న మారణాయుధాలు చూపించి బెదిరింపులకు దిగుతాడు. పోలీసులు సైతం తనను ఏమీ చేయరని.. వారికి నెలనెల కమీషన్లు ఇస్తున్నాను అంటూ బాధితురాలను బెదిరించే వాడట. మొదట తనతో సన్నిహితంగా ఉన్న వీడీయోలు, పోటోలు చూపించి ఒప్పించడం.. ఒప్పుకుంటే సరే.. లేదంటే బెదిరింపులకు దిగుతాడు.

  ఒకరు ఇద్దరు కాదు అతడి వలలో పడిన 9 మంది మహిళలు నరకయాతన అనుభవిస్తున్నారు. సినిమా హాల్లో పరిచయమైన అమ్మాయికి మాయమాటలు చెప్పి పెళ్లాడాడు. స్నేహితుడుని చంపి అతడి భార్యను లొంగదీసుకున్నాడు. ఇలా ఒక్కొక్కరిదీ ఒక్కో కథ. నర్పీపట్నానికి చెందిన 40 ఏళ్ల మహిళను చేరదీశాడు ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నాసరే.. గంజాయి వ్యాపారం చేయాలని.. భారీగా డబ్బులు సంపాదించవచ్చని.. తన భర్తను వదిలేసి వస్తే స్వర్గం చూపించడంతో పాటు.. వ్యాపార సామ్రాజ్యానికి రాణిని చేస్తానని నమ్మించాడు. తరువాత వ్యభిచారం చేయాలంటూ బెదిరించి ఆమెను మోసం చేశాడు.

  చింతపల్లి సమీపంలోని లోతుగెడ్డకు చెందిన 18 ఏళ్ల మువతి పరిచయం చేసుకున్నాడు. బాగా డబ్బు ఉన్నవాడిలా నటిస్తూ ఆమెను చేరదీసుకున్నాడు. రహస్య ప్రాంతంలో పెళ్లి చేసుకుని.. వేరే ప్రాంతంలో ఆమెను కాపురానికి పెట్టి.. అక్కడ నుంచి చిత్ర హింసలకు పాల్పడేవాడు. డబ్బు సంపాదించాలంటూ ఒత్తిడి తేవడంతో ఆ యువతి అరుణ్ ను దూరం పెట్టే ప్రయట్నం చేసింది. కానీ చంపేస్తానని చెప్పి ఆమెను బెదిరించాడు.

  విశాఖలోని కొబ్బరి తోట ప్రాంతానికి చెందిన 38 ఏళ్ల మహిళనున ఒప్పించి వ్యభిచారం చేయిస్తున్నాడని పోలీసులకు గతంలోనే ఫిర్యాదు అందింది. అయితే తన కుమారుడ్ని పెద్ద చదువులు చదివిస్తానని నమ్మించి మోసం చేశాడని.. కానీ తరువాత ప్రశ్నిస్తే వ్యభిచారం చేసి సంపాదించుకో అంటూ బెదిరించాడని.. ఈ విషయం బయటపడితే తన పరువు పోతుందని ఆమె ఎవరికీ చెప్పుకోలేకపోయినట్టు తెలుస్తోంది.

  ఒక రోజు సినిమాకు వెళ్లిన సమయంలో అక్కడ ఒంటరిగా ఉన్న యువతితో పరిచయం పెంచుకున్నాడు. ప్రేమిస్తున్నాను అని వెంటపడి నాలుగు రోజుల్లోనే పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఆమె వయసు 31 ఏళ్లు.. ఇద్దరు పిల్లలుకూడా ఉన్నారు. అయితే ఇప్పుడు వ్యభిచారం చేయాలని ఒత్తిడి తెస్తుండడంతో ఆమె మహిళా సంఘాల్ని ఆశ్రయించింది.

  గోకుల్ థియేటర్ సమీపంలోని ఉంటున్న తన స్నేహితుడు ఇటీవల బార్ లో జరిగిన గొడవలో మరణించాడు. అయితే ఆ తరువాత భర్త లేడని బాధపడొద్దు అంటూ అతడి భార్యతో పరిచయం పెంచుకున్నాడు. తన దగ్గరకు వస్తే స్వర్గం చూపిస్తాను అంటూ నమ్మించాడు. తీరా అతడిని నమ్మి వచ్చేస్తే అప్పటి నుంచి టార్చర్ చేయడం మొదలుపెట్టాడు. అతడే తన భర్తను చంపినట్టు ఒప్పుకున్నాడని.. ఇప్పుడు తాను చెప్పినట్టు వినకపోతే తననూ చంపేస్తానని బెధిరిస్తున్నట్టు బాధితురాలు చెబుతోంది. ప్రస్తుం ఆమె కూడా మహిళా సంఘాల్ని ఆశ్రయించింది

  ఇప్పటి వరకు బయటపడినవి ఇవే ఇంకా ఇతడి ఖాతాలో ఇంకెంతమంది బాధితులు ఉన్నారో? బయటకు చెప్పుకోలేక బాధపడుతున్నారో. అయినా అరుణ్ చేసిన మోసాలు అన్నీ ఇన్నీ కావు.. మహిళలతో సన్నిహితంగా ఉన్నప్పుడు వారికి తెలయకుండా వీడియోలు, ఫోటోలు తీస్తాడు. తరువాత అవి బయటపెడతాను అంటూ బెదిరిస్తాడు.కత్తులు, తుపాకీలతో ఫోటోలు తీయించుకోవడం, వాటిని అందిరికీ చూపించడం మామూలైపోయింది. గంజాయి, మహిళల అక్రమ రవాణా కేసుల్లో తనను ఎవరూ ఏం చేయలరేని.. పోలీసులతో పరిచయాలు ఉన్నాయని ప్రచారం చేసుకుంటున్నట్టు బాధిత మహిళలు చెబుతున్నారు. దీనిపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. అయితే ఈ నిత్య పెళ్లి కొడుకు వ్యవహారం వెలుగులోకి రావడంతో స్వయంగా డీజీపీ దీనిపై ఆరాతీసి.. వెంటనే అతడిపై చర్యలు తీసుకోవాలని.. పోలీసులకు ఉన్న సంబంధాలపైనా ఆరా తీయాలంటూ ఆదేశించినట్టు తెలుస్తోంది.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, Crime, Crime story, Visakha, Visakhapatnam, Vizag

  తదుపరి వార్తలు