principle: మాట వినలేదని జీతాలు ఆపేశారు..! ప్రిన్సిపల్ వేధింపులపై మహిళా ఉద్యోగుల ఫిర్యాదు

నర్సీపట్నం పాలిటెక్నిక్ కాలేజ్

అధికారం ఉన్నది కింద వారిని వేధించడం కోసమే అనుకుంటున్నారు కొందరు.. ఓ ప్రభుత్వ కాలేజీ ప్రిన్సిపల్ కూడా మహిళా ఉద్యోగులు తన మాట వినడం లేదని జీతాలు ఆపేశారట.. దీంతో ఆ ఉద్యోగులు మహిళా కమిషన్ ను ఆశ్రయించారు. ఇంతకీ ఏం జరిగింది? వాస్తవం ఏంటి..?

  • Share this:
    ఆయనో ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్.. ఉన్నత పదవిలో ఉన్నా.. అంతా తన ఇష్టం అనుకున్నారు.. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు తాను చెప్పింది చేయాల్సిందే అని పంతం పట్టారు. అయినా ఇద్దరు మహిళా ఉద్యోగులు తను చెప్పినట్టు చేయడం లేదని వారికిపై కక్ష పెంచుకున్నారు. సాధింపులకు దిగారు. ఏం చేస్తారో చేసుకొండి అంటూ.. తమకు జీతాలు ఆపేశారని మహిళా ఉద్యోగులు ఆవేదన చెందారు. ఆ వేధింపులు పెరగడంతో పాలిటెక్నిక్ కళాశాలలో ప్రిన్సిపల్ వేధింపులకు గురిచేస్తున్నారంటూ మహిళా కమిషన్ కు పిర్యాదు చేశారు. వారి ఆరోపణల నేపథ్యంలో మహిళా కమిషన్ సిఫార్సు పై ప్రిన్సిపల్ జీవి రామచంద్రరావు , సిబ్బందిని ఆర్జెడి జె సత్యనారాయణ మూర్తి బృందం విచారించింది.

    నర్సీపట్నం పాలిటెక్నిక్ కళాశాలలో ప్రిన్సిపాల్ గా విధులు నిర్వహిస్తున్న జి రామచంద్రరావు తమ జీతాలు నిలిపివేశారని.. తమను వేధింపులకు గురిచేస్తున్నారంటూ జూనియర్ అసిస్టెంట్ లక్ష్మీ శివకుమారి, ఆఫీస్ సబ్ ఆర్డినెట్ ఎస్ రామలక్ష్మీలు మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు ఆధారంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆర్జేడీకి మహిళా కమిషనర్ సిఫార్సు చేసింది. మహిళా కమిషన్ సిఫార్సుతో ఎంక్వైరీ నిమిత్తం పాలిటెక్నిక్ కాలేజీలో ఆర్జెడి జె సత్యనారాయణ మూర్తి బృందం విచారణ చేపట్టింది.

    నర్సీపట్నం పాలిటెక్నిక్ కళాశాలలో జూనియర్ అసిస్టెంట్ లక్ష్మీ శివకుమారి, ఆఫీస్ సబ్ ఆర్డినెట్ ఎస్ రామలక్ష్మీలు తమకు జీతాల రాకుండా ఆపివేశారని, క్యాజువల్ లివ్ లు ఉన్నప్పటికీ తాము సెలవులు పెడితే వాటిని ఏఆర్న్ లివ్ లుగా మారుస్తున్నారని, వేధింపులకు గురిచేస్తున్నారని ఫిర్యాదు చేశారని.. వారి ఫిర్యాదులు ఆధారంగా విచారణ చేపట్టామన్నారు ఆర్జెడీ సత్యనారాయణ మూర్తి. ఈ విచారణ లో ప్రిన్సిపల్ పి.వి. శ్రీనివాసరావు, సీసీపీ జి రాజేశ్వరి, ఏడి ఎమ్ వి రంగారావు, ఆఫీస్ సుపర్డెంట్ పి కరుణాకర్ జోషి తదితరులు పాల్గొన్నారు. అయితే వారి ఆరోపణలను ప్రిన్సిపల్ ఖండిస్తున్నారు. తాను ఎలాంటి వేధింపులకు దిగలేదంటున్నారు. కావాలనే తనపై అక్రమంగా ఫిర్యాదు చేశారని ఆయన అంటున్నారు.
    Published by:Nagesh Paina
    First published: