Araku Accident Update: నిర్లక్ష్యమే ప్రాణాలు తీసిందా..? మృత్యులోయ పై అజాగ్రత్త ఎందుకు?

మానవ తప్పిదమే అరకులోయ ప్రమాదానికి కారణం.. పూర్తిగా మలుపులు తిరిగిన ఘాట్ రోడ్డు ప్రమాదమని తెలిసినా అధికారులు పెద్దగా దానిపై ఫోకస్ చేయలేదు. అలాంటి రోడ్డులో కండిషన్ లేని బస్సును.. అనుభవం లేని డ్రైవర్ ను పంపించి ట్రావెల్ యాజమానులు నిర్లక్ష్యం వహించారు.. అందుకే విహార యాత్ర కాస్త విషాదంగా మారింది.

మానవ తప్పిదమే అరకులోయ ప్రమాదానికి కారణం.. పూర్తిగా మలుపులు తిరిగిన ఘాట్ రోడ్డు ప్రమాదమని తెలిసినా అధికారులు పెద్దగా దానిపై ఫోకస్ చేయలేదు. అలాంటి రోడ్డులో కండిషన్ లేని బస్సును.. అనుభవం లేని డ్రైవర్ ను పంపించి ట్రావెల్ యాజమానులు నిర్లక్ష్యం వహించారు.. అందుకే విహార యాత్ర కాస్త విషాదంగా మారింది.

 • Share this:
  ఉత్తరాంధ్ర ఊటీగా ప్రసిద్ధి చెందిన అరకు వ్యాలీ ఎందరికో ఇష్టమైన ప్రాంతం.  వింటర్ సీజన్ లో అరకు అందాలు చూడాలాని అంతా ఉవ్విళ్లూరుతారు. అందుకే ఇటీవల పర్యాటకుల సంఖ్య బాగా పెరిగింది. అరకు లోయ నుంచి కిందకు వస్తున్నప్పుడు మలుపులు తిరిగి ఉన్న ఆ రోడ్డు చూస్తేనే భయం వేస్తుంది. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ప్రాణాలతో చెలగాటమాడినట్టే.. అయితే ఇప్పటి వరకు చిన్న చిన్న ప్రమాదాలు తప్ప ఈ తరహా ప్రమాదం ఎప్పుడు జరగలేదు. దీంతో అధికారులు పెద్దగా పట్టించుకోలేదు.. శుక్రవారం రాత్రి ప్రమాదం తరువాత అధికారులు నిద్ర నుంచి లేవాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇది మృత్యులోయగా మారి ఎందరో ప్రాణాలను హరించే అవకాశం ఉంది. అరకులోయ ఘాట్‌రోడ్‌లో మొత్తం 8 ప్రమాదకర హెయిర్‌ పిన్‌ బెండ్‌లు ఉంటాయి. ఈ ప్రమాదకర మలుపుల దగ్గర వాహనాలు వెళ్లడం అంత సులువు కాదు. భారీ వాహనాలు ఈ మలుపుల్లో వంకర్లు తిరిగేందుకు అవస్థలు పడాలి.. ఏ మాత్రం అనుభవం లేకున్నా ప్రాణాలతో చెలగాటమాడాల్సిన పరిస్థితి వస్తుంది.

  నిర్లక్ష్యమే ప్రాణాలు తీసింది
  వంకర్లు తిరిగిన ఘాట్ రోడ్డుపై ప్రయాణమంటే ఎన్నిజాగ్రత్తలు తీసుకోవాలి..?  కానీ ప్రమాదానికి గురైన టూరిస్ట్ బస్సు యాజమాన్యం నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. ట్రావెల్స్ యజమానులతో పాటు డ్రైవర్ నిర్లక్ష్యం కూడా ఈ ప్రమాదానికి కారణమైంది. దినేష్ ట్రావెల్స్ కు చెందిన ఈ మిని బస్సు అస్సలు కండిషన్ లో లేనట్టు అధికారులు చెబుతున్నారు. దానికి తోడు ఘాట్ రోడ్డులో నడిపే అనుభవం లేకపోయినా డ్రైవర్ ను అరుకు పంపించారు ట్రావెల్ యజమానులు. అసలు ఎంతో అనుభవం ఉన్నా ఘాట్ రోడ్డులో బస్సు నడపడం చాలా కష్టం అలాంటింది అనుభవం లేని డ్రైవర్ ను ఎలా పంపించారన్నది సమాధానం లేని ప్రశ్న. దానికి తోడు బ్రేక్ లు ఫెయిలవ్వడంతో బస్సు అదుపుతప్పింది. ఇలా అడుగడుగునా ప్రమాదంలో నిర్లక్ష్యమే కనిపిస్తోంది. బస్సుల్లో ఉన్నవారంతా రాత్రికి అక్కడే బసచేసి తెల్లవారు జామును వెళ్దామని చెప్పినట్టు తెలుస్తోంది. కానీ డ్రైవర్ మాత్రం తనకు ఈ ప్రాంతం కొత్త అని.. త్వరగా వెళ్లిపోదామంటూ కంగారుగా బస్సు నడిపనట్టు క్షతగాత్రులు చెబుతున్నారు.

  ప్రమాద ఘటనలో మృతిచెందిన నలుగురుని కె.జి.హెచ్ మార్చురీకి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. ప్రస్తుతం 22 మంది క్షతగాత్రులకు కే.జి.హెచ్ లో చికిత్స అందిస్తున్నారు కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. డ్రైవర్ శ్రీశైలం తాను ప్రమాదం తరువాత  సృహకోల్పోయానని.. కాలు విరిగింది అంటున్నాడు. ఈనెల 10వ తేదీన షేక్ పేట నుంచి బయలుదేరామని.. ఆదివారం తిరిగి హైదరాబాద్ చేరుకోవాల్సి ఉందని ఈ లోపు ప్రమాదం జరిగిందంటున్నాడు.

  బ్రేక్ లు ఫెయిల్ అవ్వడమే ప్రమాదానికి కారణమంటున్నారు క్షతగాత్రులు కొందరు. ఒక్కసారిగా బ్రేకులు ఫెయిలవ్వడంతో వాహానాన్ని గేర్లో ఉంచి డ్రైవర్ వేగం తగ్గించాడని.. కానీ దిగువ ప్రాంతం కావడంతో పట్టు తప్పిప బస్సులోయలో పడిందని ప్రమదాన్ని గుర్తు చేసుకుని భయపడుతున్నారు. అసలు రాత్రికి అక్కడ బస చేసి.. తెల్లవారుజామున బయలుదేరుదామని చెప్పినా.. డ్రైవర్ వినలేదని.. తనకు ఈ ప్రాంతం కొత్త త్వరగా వెళ్లిపోదామని కంగారు పడడంతోనే ప్రమాదం జరిగిందంటున్నారు కొందరు.

  విషయం తెలిసిన వెంటనే మంత్రి అవంతి శ్రీనివాసరావు కలెక్టర్‌ వినయ్‌చంద్‌, ఎస్పీ కృష్ణారావులతో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. పర్యటకాభివృద్ధి సంస్థ ఆర్‌డీ రాంప్రసాద్‌, డీవీఎం ప్రసాద్‌రెడ్డి ప్రమాద ఘటనా స్థలానికి వెళ్లి ప్రమాదంపై ఆరా తీశారు.
  Published by:Nagesh Paina
  First published: