• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • VISAKHAPATNAM YOUNG MAN COMMITTED SUICIDE AFTER GIRL FRIEND REJECTED HIS PHONE CALLS IN ANDHRA PRADESH PRN

Andhra Pradesh: ఫోన్ కట్ చేసిన గర్ల్ ఫ్రెండ్.., యువకుడి షాకింగ్ నిర్ణయం

Andhra Pradesh: ఫోన్ కట్ చేసిన గర్ల్ ఫ్రెండ్.., యువకుడి షాకింగ్ నిర్ణయం

ప్రతీకాత్మక చిత్రం

Suicide: ఈ రోజుల్లో చిన్నచిన్న కారణాలకై యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులు తిట్టారనో.., ర్యాంకులు రావడం లేదనో.., బైక్ కొనివ్వలేదనో ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి.

  • Share this:
    ఈ రోజుల్లో చిన్నచిన్న కారణాలకై యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులు తిట్టారనో.., ర్యాంకులు రావడం లేదనో.., బైక్ కొనివ్వలేదనో సూసైడ్ చేసుకుంటున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ఐతే గర్ల్ ఫ్రెండ్ ఫోన్లో మాట్లాడలేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం ముందుగానే ఫ్రెండ్స్ కు చెప్పినా వారు కూడా పట్టించుకోకపోవడంతో నిండు ప్రాణం పోయింది. వివరాల్లోకి వెళ్తే విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలోని వెంకునాయుడుపేటకు చెందిన డ్రైవర్ తుమ్మల రమేష్ ఓ జీడి తోటలో అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు దర్యాప్తులో కొన్ని షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. కారణానికే అతడు సూసైడ్ చేసుకున్నట్లు వెల్లడైంది.

    నర్సీపట్నంలో డ్రైవర్ గా పనిచేస్తున్న రమేష్ కు గబ్బాడ గ్రామానికి చెందిన ఓ యువతితో పరిచయం ఉంది. ఇద్దరూ తరచూ కలుస్తూ ఉండేవారు. ఇద్దరూ నిత్యం ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండేవారు. ఐతే ఇటీవల ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవరావడంతో ఆమె ఫోన్ చేయడం మానేసింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో మనస్తాపం చెందాడు. తాను చనిపోతున్నానంటూ ఈనెల 21న స్నేహితులకు మెసేజ్ చేశాడు. రెండు మూడు రోజులుగా ఇదే రకమైన మెసేజ్ లు చేయడంతో వారు కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో నర్సీపట్నం సమీపంలోని ఓ జీడి తోటలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

    కేసు నమోదు చేసుకున్న ఎస్సై రమేష్.. కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి సెల్ ఫోన్ కాల్ డేటాతో పాటు వాట్సాప్ చాటింగ్ లను విశ్లేషిస్తున్నారు. రమేష్ కు యువతికి మధ్య ఏం జరిగిందనేదానిపై విచారణ చేపట్టారు. రమేష్ కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, స్నేహితులను విచారించి స్టేట్ మెంట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. యువతిని కూడా విచారించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. పోస్ట్ మార్టం అనంతరం రమేష్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. చిన్నచిన్న కారణాలకే యువత కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని.., ఆలోచించి కెరీర్ లో ముందుకు సాగాలని పోలీసులు సూచిస్తున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    అగ్ర కథనాలు