• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • VISAKHAPATNAM STEELPLANT EMPLOYEE MISSING MYSTERY TILL NOT FOUNDED NGS

Vizag steel Plant: విశాఖ ఉక్కు ఉద్యోగి ఆచూకీ ఎక్కడ? సూసైడ్ నోట్ రాసి పరారైన శ్రీనివాసరావు: ఈ కేసులో రోజుకో ట్విస్ట్

వైజాగ్ స్టీల్ ప్లాంట్, శ్రీనివాసరావు రాసిన సూసైడ్ లెటర్

విశాఖ ఉక్కు ఉద్యమం కోసం ఆత్మహత్య లేఖ రాసి మిస్సైన ఉక్కు ఉద్యోగి ఆచూకీ ఎక్కడ? నాలుగు రోజులైనా అతడి జాడ ఎందుకు దొరకడంలేదు? ఉద్యోగాల పేరుతో మోసం చేసినట్టు అతడిపై వరుస ఫిర్యాదులు అందుతున్నాయి? అయినా ఈ కేసు మిస్టరీ ఎందుకు వీడడం లేదు? శ్రీనివాస్ కు ఎవరైనా సహకరిస్తున్నారా? ఇంతకీ శ్రీనివాస్ ఇప్పుడు ఎక్కడ ఉన్నట్టు?

  • Share this:
    ఒకటి రెండు కాదు.. నాలుగు రోజులు అవుతోంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు మనస్తాపం చెందాను అని చెబుతూ సూసైడ్ లెటర్ రాసి అదృశ్యమైన ఉద్యోగి ఎక్కడ ఉన్నాడో ఆచూకీ దొరకడం లేదు. స్టీల్‌ప్లాంటు డబ్ల్యూఆర్‌ఎం జోన్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ జూనియర్‌ ఫోర్‌మెన్‌ ఎస్‌.శ్రీనివాసరావు ఆచూకీ లేకపోవడంతో అతడి కుటుంబ సభ్యులు, తోటి కార్మికులు ఆందోళన చెందుతున్నారు. నాలుగు రోజులు అవుతున్నా అతడి జాడ దొరకకపోవడంపై ఎన్నో అనుమానాలు పెరుగుతున్నాయి. పోలీసులు చెబుతున్నది నిజమేనా? లేక వారి అదుపులోనే శ్రీనివాసరావు ఉన్నాడా అనే ప్రచారం పెరుగుతోంది.

    స్టీల్‌ప్లాంటు, గాజువాక పోలీసులు బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టినా ఆయన ఉనికి ప్రశ్నార్థకంగా మారడం కలకలం రేపుతోంది. ఈ నెల 19వ తేదీన నైట్ డ్యూటీకి వెళ్లిన శ్రీనివాసరావు 20వ తేదీన ఇంటికి రావాల్సి ఉన్నా రాలేదు. ఉక్కు నిర్ణయంపై తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ డిపార్టుమెంటులో లేఖ రాసి.. ఫోన్ ను అక్కడే వదిలేసి అదృశ్యమయ్యాడు. ప్రియమైన కార్మిక సోదరుల్లారా మనమంతా కలిసికట్టుగా ఉంటేనే ఈ పోరాటంలో విజయం సాధించగలం. ఈ రోజు జరగబోయే ఉక్కు కార్మిక గర్జన ఒక మైలురాయిగా మొదలు కావాలి. 32 మంది ప్రాణ త్యాగాల ప్రతిఫలం ఈ ఉక్కు కర్మాగారం. ఎట్టిపరిస్థితుల్లో ప్రైవేటుపరం కానివ్వద్దు. నేను నా ప్రాణాన్ని ఈ ఉక్కు ఉద్యమం కొరకు త్యాగం చేస్తున్నాను. ఈ రోజు కొలమిలో అగ్నికి ఆహుతి కావడానికి 5:49 నిమషాలకు మూహుర్తం ఉంది కాబట్టి ఈ పోరాటం ప్రాణత్యాగం నా నుండి మొదలు కావాలి’ఇదీ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి శ్రీనివాసరావు రాసిన సూసైడ్ లేఖ సారాంశం. ఆదివారం రాత్రి పది గంటల సమయంలో విధులకు హాజరయ్యాడు. ఆత్మహత్య చేసుకోబోతున్నానంటూ ప్లాంట్ లాగ్ బుక్ లో రాశాడు. ఆ తర్వాత మాయమైపోయాడు. దీనిపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు స్టీల్‌ప్లాంటు పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. ఆరోజు విధులకు వెళ్లినట్లు సీసీ ఫుటేజీలు స్పష్టం చేస్తున్నా.. తిరిగి వెళ్లిపోయినప్పుడు అతని వివరాలు ఉక్కు మెయిన్‌ గేటు ఫుటేజీలో కనపడలేదు. మరి స్టీల్ ప్లాంట్ లోకి వచ్చిన ఉద్యోగి బయటకు వెళ్లకుండా ఎక్కడకు పోయినట్టు. ఒక వేళ ప్లాంట్ పరిశరాల్లోనే ఉంటే నాలుగురోజులైనా ఆచూకీ ఎందుకు దొరకడం లేదన్నది అంతుచిక్కడం లేదు.

    శ్రీనివాసరావు కనిపించడం లేదని ఒకవైపు కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతుంటే..మరోవైపు శ్రీనివాసరావు తమను ఉద్యోగాల పేరుతో మోసం చేశాడని ఫిర్యాదులు చేసిన వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు విడతల వారీగా 81.54 లక్షలు తీసుకున్నారంటూ గాజువాక పోలీసు స్టేషన్లో 13 మంది బాధితులు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు అతడిపై ఐపీసీ 420, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు గాజువాక సీఐ మల్లేశ్వరరావు తెలిపారు.

    అయితే ఈ కేసు ఆధారాల కోసమే శ్రీనివాసరావును రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నా పోలీసులు దీనిని ఖండిస్తున్నారు. ప్రస్తుతం అతడి ఆచూకీ తెలియలేదని.. తెలిస్తే బహరింగంగానే అతడి వివరాలు వెల్లడిస్తామన్నారు. ముఖ్యంగా అతడిపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. శ్రీనివాసరావు వెనుక ఎవరైనా ఉన్నారా..? ప్లాంట్ లో ఎవరైనా అతడికి సహకరిస్తున్నారా అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నామన్నారు.
    Published by:Nagesh Paina
    First published: