హైదరాబాద్‌లో మావోయిస్టుల అలజడి..ముగ్గురు అక్కాచెల్లెళ్లు సహా నలుగురి అరెస్ట్

2017 నుంచి మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని సమాచారం. గత ఏడాది మావోయిస్టు అగ్రనేత రామకృష్ణతో కలిసి పనిచేశారని తెలుస్తోంది. వీరంతా విశాఖపట్నంతో పాటు మన్యంలో మావోయిస్టు ఉద్యమాన్ని వ్యాప్తి చేసేందుకు క్రియాశీలంగా పనిచేస్తున్నారని సమాచారం.

news18-telugu
Updated: December 25, 2018, 12:54 PM IST
హైదరాబాద్‌లో మావోయిస్టుల అలజడి..ముగ్గురు అక్కాచెల్లెళ్లు సహా నలుగురి అరెస్ట్
పట్టుబడిన మావోయిస్టులు
  • Share this:
హైదరాబాద్‌లో మావోయిస్టుల అరెస్ట్ అలజడి రేపింది. అర్బన్ నక్సలిజంపై దేశమంతా చర్చ జరుగుతున్న వేళ..నగరంలో మావోయిస్టుల కార్యకలాపాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. మంగళవారం మౌలాలీ ప్రాంతంలో నలుగురు మావోయిస్టులను వైజాగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ముగ్గురు మహిళలు..అందులోనూ అక్కాచెల్లెళ్లు కావడం విశేషం. మావోయిస్టు అగ్రనేతలతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో కొర్రా కామేశ్వరరావు, ఆత్మకూరు అనూష , అన్నపూర్ణ , భవానిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు.

2017 నుంచి వీరంతా మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని సమాచారం. గత ఏడాది మావోయిస్టు అగ్రనేత రామకృష్ణతో కలిసి పనిచేశారని తెలుస్తోంది. వీరంతా విశాఖపట్నంతో పాటు మన్యంలో మావోయిస్టు ఉద్యమాన్ని వ్యాప్తి చేసేందుకు క్రియాశీలంగా పనిచేస్తున్నారని సమాచారం. స్థానిక యువతను ఉద్యమం వైపు ప్రేరేపిస్తున్నట్లు వారిపై ఆరోపణలున్నాయి. ఒకేసారి నలుగురు మావోయిస్టులను హైదరాబాద్‌లో అరెస్ట్ చేయడం సంచలనం రేపుతోంది.

కాగా, నక్సలైట్స్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణలతో సోమవారం ఛత్తీస్‌గఢ్‌లో తెలంగాణవాసి అరెస్టయ్యాడు. హైదరాబాద్‌కు చెందిన నక్కా వెంకటేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. మావోయిస్టులకు పేలుడు పదార్థాలు సరఫరా చేస్తుండగా అతన్ని పట్టుకున్నట్లు సమాచారం.


ఇక బీమా-కోరెగావ్ అల్లర్ల కేసులో ఇప్పటికే విరసం నేత వరవరరావును పుణె పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు విచారణ సందర్భంగా ప్రధాని మోదీ హత్యకు పన్నిన పన్నాగం బయటపడింది. ఈ కేసులో వరవరరావు సహా దేశవ్యాప్తంగా పలువురిని అరెస్ట్ చేసిన విచారిస్తున్నారు. ఇలా హైదరాబాద్ కేంద్రంగా మావోయిస్టులు కేసులు బయటకొస్తుండడం సంచలనం రేపుతోంది.

మావోయిస్టులంటే అడవుల్లోనే ఉంటారన్నది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు నగరాల్లో అందరి మధ్యే ఉంటూ తమ పని తాము కానిస్తున్నారు. దేశంలో అర్బన్ నక్సలిజం చాప కింద నీరులా విస్తరిస్తోందని ఇటీవల ప్రధానంగా వినిపిస్తున్న మాట. బీమా-కోరెగావ్ కేసు విచారణ తర్వాత వరవరరావు సహా దేశవ్యాప్తంగా పలువురిని పూణె పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అర్బన్ మావోయిజంపై పోలీసులు ప్రత్యేక దృష్టిసారించారు.
Published by: Shiva Kumar Addula
First published: December 25, 2018, 12:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading