విశాఖ అమ్మాయిల మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. క్షేమంగా ఉన్నామని మెసేజ్

విశాఖపట్టణంలో అమ్మాయిల మిస్సింగ్ తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ద్వారకానగర్‌కు చెందిన ఎర్రన్నాయుడు, లక్ష్మీ దంపతుల కుమార్తెలు అనురాధ, తులసి, కోమలి సోమవారం ఇంటి నుంచి వెళ్లిపోయారు. రాత్రైనా తిరిగి ఇంటికి రాకపోవడంతో.. తీవ్ర ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు సోమవారం పోలీసులుకు ఫిర్యాదు చేశారు.

news18-telugu
Updated: February 18, 2020, 3:53 PM IST
విశాఖ అమ్మాయిల మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. క్షేమంగా ఉన్నామని మెసేజ్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
విశాఖపట్టణంలో తీవ్ర కలకలం రేపిన ముగ్గురు అమ్మాయిల మిస్సింగ్ కేసు కీలక మలుపుతిరిగింది. నిన్న ఇంటి నుంచి వెళ్లిపోయిన అక్కాచెల్లెళ్లు మంగళవారం తన తల్లికి సందేశం పంపారు. తాము చెన్నైలో ఉన్నామని ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పిన యువతుల కుటుంబ సభ్యులు.. వారిని క్షేమంగా తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. అక్కాచెల్లెళ్లు ఇల్లు వదిలివెళ్లడంపై సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు. ఇంట్లో చెప్పకుండా చెన్నైకి ఎందుకు వెళ్లారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

విశాఖపట్టణంలో అమ్మాయిల మిస్సింగ్ తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ద్వారకానగర్‌కు చెందిన ఎర్రన్నాయుడు, లక్ష్మీ దంపతుల కుమార్తెలు అనురాధ, తులసి, కోమలి సోమవారం ఇంటి నుంచి వెళ్లిపోయారు. రాత్రైనా తిరిగి ఇంటికి రాకపోవడంతో.. తీవ్ర ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు సోమవారం పోలీసులుకు ఫిర్యాదు చేశారు. వారి కోసం పోలీసులకు గాలిస్తున్న క్రమంలోనే తల్లికి మెసేజ్ వచ్చింది. మేం చనిపోతున్నామని.. మా కోసం వెతకొద్దని సందేశం పంపడంతో కుటుంబ సభ్యుల్లో మరింత ఆందోళన నెలకొంది. వారి ఆచూకీని కనిపెట్టేందుకు మూడు పోలీస్ బృందాలు గాలిస్తుండగా.. తల్లిదండ్రులకు మరో సందేశం వచ్చింది. తాము ముగ్గురు చెన్నైలో క్షేమంగా ఉన్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో అక్కాచెల్లెళ్లను విశాఖకు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు పోలీసులు. వారు విశాఖకు వచ్చిన తర్వాత ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలిసే అవకాశముంది.

First published: February 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు