Andhra Pradesh: తాళిబొట్టు తాకట్టుపెట్టి తాగొచ్చిన భర్త... అదేంటని నిలదీసిన భార్య... ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

Vizianagaram: పైసా సంపాదనలేని రమేష్.., మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో భార్యపై దాడి చేసి తాళిబొట్టు లాక్కెళ్లాడు.

 • Share this:
  తాగుడు.. మనిషిని ఎందకైనా దిగజాస్తుంది. నా అనుకున్నవాళ్లను అంతమొందించేవరకు తీసుకెళ్తుందా మహమ్మారి. తాగుడుకు బానిసైన ఓ భర్త.. డబ్బు కోసం భార్య తాళిబొట్టును తాకట్టుపెట్టాడు. పీకలదాకా దాకి ఇంటికొచ్చాడు.. అదేంటని నిలదీసిన భార్యను దారుణంగా హత్యచేశాడు. దానిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసి అడ్డంగా బుక్కయ్యాడు. ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం కనిమెరకవీధికి రమేష్, వెంకటలక్ష్మి భార్యాభర్తలు. మద్యానికి బానిసైన రమేష్ తరచూ భార్యతో గొడవపడుతుండేవాడు. నిత్యం డబ్బుల కోసం వెంకటలక్ష్మిని వేధిస్తుండేవాడు. తరచూ ఆమెను కొట్టేవాడు. ఈ క్రమంలో మార్చి 28వ భార్య మెడలో తాళిబొట్టు లాక్కెళ్లిన రమేష్.. దానిని తాకట్టుపెట్టి పూటుగా మద్యం తాగి ఇంటికొచ్చాడు. తన తాళిబొట్టు విషయంలో భర్తను.. వెంకట లక్ష్మి నిలదీసింది. తన తాళిబొట్టు తాకట్టు పెట్టిన విషయాన్ని తన తల్లికి చెబుతానని హెచ్చరించింది. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన రమేష్ వెంకటలక్ష్మి తలను మంచానికి మోది తీవ్రంగా గాయపరిచాడు.

  తన భార్య చనిపోతుందని భావించిన రమేష్.. కొనఊపిరితో ఉండగానే ఆత్మహత్య చేసుకున్నట్టుగా అందరినీ నమ్మించాలని భావించాడు. అనుకున్నదే తడువుగా.. ఆమె మెడకు తాడు కట్టి ఉరి వేసుకున్నట్టుగా చిత్రీకరించాడు. కాగా, తొలుత రమేష్ తన భార్య ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు, స్థానికులను ఫోన్ చేసి పిలిపించి నమ్మించే ప్రయత్నం చేశాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్లందరినీ ఉరి వేసుకొని చనిపోయిందిని నమ్మబలికాడు. ఐతే ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందడం, అంతా అనుమానంగా ఉండడం, భర్త తాగిన మైకంలో చంపేసి ఉండొచ్చని భావించిన పోలీసులు కేసును దర్యాప్తును ప్రారంభించారు.

  ఇది చదవండి: అమ్మాయిలతో వెకిలి వేషాలు... కిచక ప్రిన్సిపాల్ ఆటకట్టించిన స్టూడెంట్స్...


  సీన్ ఆఫ్ అఫెన్స్ లో ఉన్న ప్రతీ విషయాన్ని పోలీసులు పరిశీలించారు. ఇక భార్య వెంకటలక్ష్మి తలకు, ఇతర శరీర భాగాలపై గాయాలు ఉండడం, రమేష్ బట్టలకు రక్తపు మరకలు ఉండటాన్ని కూడా పోలీసులు గమనించారు. అప్పుడే పోలీసులకు అనుమానం కలిగింది. ఆత్మహత్య కాదు హత్యే నని నిర్ధారణకు వచ్చిన పోలీసులు చుట్టుపక్కల వారిని, బంధువులను ఎంక్వైరీ చేసారు. చివరకు రమేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తమదైన శైలిలో విచారించారు. ఉన్న ప్రతీ సాక్ష్యాన్ని చూపించి విచారణ చేసేసరికి .. చివరకు తానే హత్య చేసినట్లు రమేష్ అంగీకరించాడు. దీంతో పోలీసులు నిందితుడు రమేష్ ను అరెస్టు చేసి, పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు.

  తాగిన మైకంలో తానేం చేస్తున్నానో కూడా తెలివి లేకుండా చేసిన పనికి చివరకు కటకటాల వెనక్కి వెళ్లాడు నిందితుడు రమేష్. తాగిన మైకంలో కిరాతకంగా హత్యలు చేస్తున్న ఇలాంటి క్రూర మ్ళగాలను కఠినంగా శిక్షిస్తేనే మిగిలిన వారికి బుద్దొస్తుందని స్ధానికులు కోరుతున్నారు.
  Published by:Purna Chandra
  First published: