Extra Marital Affair: ప్రియుడి కోసం భార్య స్కెచ్ మామూలుగా లేదు.. NRI హత్య కేసులో నమ్మలేని నిజాలు

ఎన్ఆర్ఐ భర్త కేసులో నమ్మలేని నిజాలు

Extra Marital Affair: చక్కగా సాగిపోతున్న సంసారంలో వాట్సప్ గ్రూపు చిచ్చు పెట్టింది. వాట్సప్ లో మళ్లీ పరిచయమైన ప్రియుడి కోసం ఒక భార్య వేసిన స్కెచ్ చూసి పోలీసులే షాక్ తిన్నారు. పెద్ద పెద్ద సినిమా దర్శకులకు కూడా ఇలాంటి ఐడియా రాదేమో అనుకున్నారు. మరి అలాంటి ప్లాన్ ఎలా రివర్స్ అయ్యింది.

 • Share this:
  మంచి అదాయం.. గౌరవంతో బతుకుతున్న కుంటుంబం.. అందమైన ఇద్దరు పిల్లలు.. ఎంతో హ్యాపీగా సాగుతున్న జీవితం.. కలహాలు లేకుండా సాగుతున్న ఆ కుటుంబంలో వాట్సప్ కలకలం రేపింది. కొద్ది రోజుల క్రితం వరకు భార్య భర్తల మధ్య ఎలాంటి కలహాలు లేవు.. సంసారం చక్కగా సాగిపోయేది.. కానీ అనుకోని ఘటన వారి జీవితాలను మార్చేసింది. ఇటీవల స్కూల్ మేట్స్ అంతా కలుసుకునేందుకు ఒక వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేశారు. అదే వారి జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పింది. విశాఖపట్నంలోని ఎన్ఆర్ఐ హత్య కేసుకు ప్రధాన కారణం ఈ వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేయడమే.. హత్యకు వాట్సప్ గ్రూపుకు సంబంధం ఏంటి అనుకుంటున్నారా..? విశాఖపట్నంలోని పీఎం పాలెం దగ్గర నివాసం ఉండే సతీష్ గతవారం ఎన్జీవో కాలనీలో.. ఎప్పటిలాగే భార్య పిల్లలతో కలిసి రోడ్డుపై కలిసి వాకింగ్ చేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తి రాడ్ తో దాడి చేయడంతో హత్యకు గురయ్యాడు. వెంటనే భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో దుబాయ్‌లో స్నేహితుడు సుధాకర్ రెడ్డితో కలిసి సతీశ్ కొన్ని వ్యాపారాలు నిర్వహించాడు. లావాదేవీల్లో తేడా రావడంతో సతీష్ ఇండియాలోనే ఉండిపోయాడు. దీనిపై ఇద్దరి మధ్య ఫోన్ లో తరచూ వాగ్వాదాలు జరుగుతున్నాయి. ఈ దశలో సతీష్ హత్యకు గురికావడంతో అతని స్నేహితుడు సుధాకర్ రెడ్డి చేయించి ఉంటాడని రమ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సుధాకర్ నిందితుడు అనే కోణంలో విచారణ చేస్తుంటే అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చి.. షాక్ తిన్నారు. సుధాకర్ కు ఈ కేసుతో ఏం సంబంధం లేదని నిర్ధారించారు..

  పోలీసులు, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భార్య రమ్యే భర్త సతీష్ ను చంపిందని పోలీసులు నిర్ధారించారు. రమ్య స్కూల్ లో ఉన్పప్పుడే భాషా అనే వ్యక్తితో ప్రేమ వ్యవహారం నడిపింది. తరువాత ఇద్దరు ఒకరికి ఒకరు ఎదురు పడకపోవడంతో అతడ్ని మరిచిపోయి జీవితంలో ముందుకెళ్లింది. మళ్లీ వాళ్లిద్దరు కలుస్తారు అనుకులేదు. దీంతో ఆమె తన భర్తతో హ్యాపీగానే కాపురం చేసింది. కానీ ఇటీవల రీ యూనియన్ పేరుతో స్నేహితులంతా పరిచయమయ్యారు. వారి కోసం ఓ వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసింది. అందర్నీ అందులో యాడ్ చేశారు. దీంతో మళ్లీ గౌస్ నెంబర్ దొరకడంతో ఆమెలో పాత ప్రేమ చిగురించింది. ఇద్దరు తరచూ మాట్లాడుకోవడం కలవడం ప్రారంభించారు. అప్పటి వరకు భార్య పిల్లను హ్యాపీగా చూసుకున్న రమ్య.. ప్రియుడు మోజులో పడి కుంటాబాన్ని పెద్దగా పట్టించుకునేది కాదు నిర్లక్ష్యంగా ఉండడం చూసిన భార్త.. భార్యను మందలించాడు.

  సుధాకర్ పై విచారణలో భాగంగా రమ్యతో మాట్లాడిన సమయంలో ఆమె ప్రవర్తపై పోలీసులకు కాస్త అనుమానం కలిసింది. దీంతో ఆమె కాల్ డేటా.. ఇతర సోషల్ మీడియా డాటా పరశీలిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. స్కూల్ లో చదివే సమయంలో రమ్య.. భాషా అనే వ్యక్తిని ప్రేమించింది. ఇద్దరూ టెన్త్ వరకు ఒకే స్కూల్ లో చదివారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య కొంతకాలం రిలేషన్ నడిచింది. ఆ తర్వాత రమ్యకి సతీష్ తో, భాషాకి మరొకరితో పెళ్లైంది. ఇలా విడిపోయిన వీరిద్దర్ని మళ్లీ వాట్సప్ గ్రూపు ఒక్కటి చేసింది. ఇద్దరి మధ్య బంధం మళ్లీ బలపడింది. భాషను విడిచి ఉండడం సాధ్యం కాదనుకుంది రమ్య.. అదే విషయం బాషాకు చెప్పగా.. మరి మీ భర్త సంగతి ఏంటని నిలదీస్తే.. ఆయన్ను చంపేద్దామని అప్పుడు ఎవరి అడ్డు ఉండదు.. హ్యీపీగా బతుకుదాం అంటూ పెద్ద ప్లాన్ చెప్పి.. అతడ్ని ఒప్పించినట్టు తెలిసింది.

  ప్రియుడు భాషాతో కలిసి మర్డర్ స్కెచ్ వేసింది రమ్య. తన భర్త సతీష్‌ను ప్రియుడు భాషాతో చంపించింది. తెలివిగా ఆ నేరాన్ని వ్యాపార విభేదాలున్న సుధాకర్ రెడ్డి పై నెడితే.. తమకు ఏ సమస్య ఉండదని.. భార్త ఆస్తిని సొంతం చేసుకుని.. బాషాతో హ్యాపీగా గుట్టు చప్పుడు కాకుండా బతికేయొచ్చని ప్లాన్ వేసింది.. కానీ డామిట్ కథ అడ్డం తిరిగింది. పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది. ఈ కేసులో ఏ-1గా భాషా, ఏ-2గా రమ్య ఉన్నారని పోలీసులు తెలిపారు. హత్యకు ముందు రమ్య, భాషా రెక్కీ కూడా చేసినట్లు పోలీసులు చెప్పారు. సీసీ కెమెరాలు లేని చోట పక్కాగా హత్యకు ప్లాన్ చేశారు. కానీ ఆ ప్లాన్ ఇలా రివర్స్ అయ్యింది. సతీష్, రమ్య దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తండ్రి చనిపోయాడు, తల్లి జైల్లో ఉంది. దీంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు.
  Published by:Nagesh Paina
  First published: