VISAKHAPATNAM CRIME NEWS ELDER BROTHER MURDER HIS OWN BROTHER FOR ONE GIRL VZM NGS
Viskhapatnam: విశాఖలో దారుణం. అమ్మాయి కోసం తమ్ముడ్ని హత్య చేసిన అన్న. అసలేం జరిగింది?
అమ్మాయి కోసం తమ్ముడ్ని హత్య చేసిన అన్న
సినిమాల్లో కనిపించే ఘటనలు నిజ జీవితంలో జరుగుతున్నాయి. విశాఖపట్నంలో అచ్చం సినిమా స్టైల్లో ఒక అమ్మాయిని పెళ్లాడేందుకు అన్న, తమ్ముడు కొట్టుకున్నారు. చివరికి ఆ అమ్మాయి తమ్ముడ్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకోవడంతో.. సొంత తమ్ముడ్ని హత్య చేశాడు అన్న.
ఒక అమ్మాయి కోసం కొట్టుకునే స్నేహితులు.. అమ్మాయి కోసం కొట్టుకునే అన్నదమ్ములు.. ఇలాంటి సీన్లు సినిమాల్లో చాలా చూశాం.. ఒక అమ్మాయిని ఇద్దరూ ప్రేమిస్తారు. ఒకరికి తెలియకుండా ఒకరు మనసు పారేసుకుంటారు. సినిమా క్లైమాక్స్ కు వచ్చేసరికి అసలు విషయం బయట పడుతుంది. దీంతో హీరోయిన్ ఒకిరికి.. హ్యాండిచ్చి.. తనకు నచ్చినవాడితో ఏడు అడుగులు నడిచేందుకు సిద్ధమవుతుంది. దీంతో మరో వ్యక్తి దేవదాసుగా మారడమో.. లేదా త్యాగానికి సిద్ధమవ్వడమో.. ఇంకా కాదంటే కసితో కుట్రలకు తెరలేపడమే లాంటి సీన్లపై వచ్చిన చాలా సినిమాలు మనం చూశాం. అయితే అలాంటి ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది.
విశాఖపట్నంలోని పూడిమడకలో దారుణం చోటు చేసుకుంది. ఒకే యువతిని ఇద్దురు అన్నదమ్ములు ఇష్టపడ్డారు. ఒకరుకి తెలియకుండా ఒకరు మనసులో ప్రేమ పాటలు పాడుకున్నారు. చివరి అమ్మాయిని ఇద్దరూ వివాహం చేసుకోవాలని అనుకోవడం అసలు విషయం బయటపడింది. దీంతో ఇద్దరూ ఆ అమ్మాయి కోసం తీవ్రంగా ఘర్షణ పడ్డారు. చివరి పంచాయతీ ఆ అమ్మాయి దగ్గరకు చేరింది. ఇద్దరి అన్నదమ్ముల వాదన విన్న ఆ అమ్మాయి. తమ్ముడంటనే తనకు ఇష్టమని.. అతడినే పెళ్లి చేసుకుంటాను అని తెగేసి చెప్పేసింది.
దీంతో అప్పటి వరకు తనతో పాటు పెరిగిన తోడబుట్టిన తమ్ముడిపై కసి పెంచుకున్నాడు అన్న. తాను ప్రేమించిన అమ్మాయిన వలలో వేసుకున్నాడని రగిలిపోయాడు. ఇంక ఆవేశాన్ని ఆపుకోలేక, మనసులో ప్రేమను చంపుకోలేక ఉన్మాధిలా మారాడు. మనిషి అన్న సగంతి మరిచిపోయాడు. రక్త సబంధాన్ని కాదని.. ప్రేమ విఫలమైందనే కోపంతో.. అందులోనే సొంత తమ్ముడే తనను మోసం చేశాడనే మనస్థాపంతో రాక్షసుడిగా మారిపోయాడు. ఆ ఆవేశంలో సొంత తమ్ముడినే హత్య చేశాడు. ఈ ఘటన విశాఖ జిల్లాలో కలకలం రేపింది.
స్థానికులు ఇఛ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అన్నను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటనలో అమ్మాయి పాత్ర ఏమైనా ఉందా? గతంలో వీరి మధ్య ఏమైనా గొడవలు జరిగాయా? ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు అందరికీ తెలిశా? ఉద్దేశ పూర్వకంగా హత్య చేశాడా? లేక క్షణికావేశంలో అన్న హత్య చేశాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఇద్దరు అన్నదమ్ములు ఒక అమ్మాయి కోసం కొట్టుకోవడం.. అన్న చేతిలో తమ్ముడు దారుణ హత్యకు గురవ్వడంతో ఆ ఇంటిలో పెను విషాదం నెలకొంది. ఇప్పుడు తమ్ముడ్ని హత్య చేసిన కేసులో అన్న అరెస్ట్ అయ్యాడు. దీంతో ఇద్దరు కొడుకులను కోల్పోయిన ఆ కుటుంబ కన్నీరు మున్నీరు అవుతోంది.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.