Home /News /crime /

VISAKHAPATNAM CRIME NEWS 24 YEARS MANIKANTA THEFT 12 LAPTOPS VZM NGS

Andhra Pradesh: మీరు ల్యాప్‌టాప్‌ వాడుతున్నారా..? కొత్త వారితో స్నేహం చేయకండి? ఏం జరిగిందో తెలుసా?

విశాఖలో మిస్సవుతున్న ల్యాప్ టాప్ లు

విశాఖలో మిస్సవుతున్న ల్యాప్ టాప్ లు

బ్యాచులర్ అయి ఉండి.. ల్యాప్ టాప్ వాడుతున్నారు అని తెలిస్తే చాలు.. స్నేహం చేస్తాడు.. మంచిగా మాట్లాడుతాడు.. ఎదో ఒక పని పెట్టుకుని తరచూ వస్తుంటాడు. అలా అని ఒకసారి నమ్మితే.. తరువాత పోలీసులను ఆశ్రయించాల్సి వస్తుంది. ఇంతకీ ఏం జరుగుతుందో తెలుసా?

ఇంకా చదవండి ...
  మీరు ల్యాప్‌టాప్‌ వాడుతున్నారా? అయితే మీతో స్నేహం చేసేందుకు కొందరు ముందుకు వస్తారు. సోషల్ మీడియాలో లేదా  బయట పరిచయం అయినా మీకు ల్యాప్‌టాప్‌ ఉందని తెలిస్తే కచ్చితంగా స్నేహం పేరుతో దగ్గర అవుతారు.. ఆ తరువాత అంతే ఊహించని షాక్ ఇస్తారు. అవును మీరు వింటున్నది నిజమే? ఇంతకీ ఏం జరిగింది అని ఆలోచిస్తున్నారా?

  విశాఖపట్నంలో చాలామంది ఇలానే తమ విలువైన ల్యాప్‌టాప్‌లు పోగుట్టుకున్నారు. అయితే ఈ విషయం ఓ దొంగ పోలీసులకు చిక్కడంతో బయటపడింది. విశాఖ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఎవరికీ అనుమానం రాకుండా తోటి వయస్సు ఉన్న యువకులను, వారి స్నేహితులను పరిచయం చేసుకుని వారి ఇళ్లలోని ల్యాప్‌టాప్‌లు, నగదు, ఎలక్ట్రానిక్‌ వస్తువులను దొంగిలిస్తున్న ఒక ఘరానా దొంగను అరెస్ట్ చేశామన్నారు. అతడి నుంచి సుమారు లక్ష రూపాయల విలువైన 12 ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నామన్నారు ఏసీపీ శ్రావణ్‌కుమార్‌, సీఐ కె.రామారావు, క్రైమ్ డీసీపీ సురేష్‌బాబులు చెప్పారు.

  విశాఖపట్నంలోని నక్కవానిపాలెం, వెంకోజీపాలెం, నక్కవానిపాలెం రామాలయం ప్రాంతాలకు చెందిన ముగ్గురు యువకులు.. ఇటీవల తమ ల్యాప్‌టాప్‌లు పోయాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. ఆయా ఇళ్ల పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించి, ఎక్కువగా రాకపోకలు సాగించే వారిపై దృష్టి పెట్టారు. అనుమానంతో ఎండాడ ప్రాంతానికి చెందిన చందక మణికంఠ అనే 24 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే నమ్మలేని వాస్తవాలు చెప్పాడు అతడు.

  విజయనగరం జిల్లా గురుగుబిల్లి గ్రామానికి చెందిన మణికంఠను చాలా తెలివైన దొంగంగా గుర్తించారు. విశాఖపట్నంలోని యువకులు ఎక్కువగా నివాసముంటున్న ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటాడు. తన వయస్సు ఉన్నవారు కనిపిస్తే చాలు.. వారితో మాటలు కలిపి పరిచయం పెంచుకుంటాడు. వారికి ల్యాప్‌టాప్‌ ఉందని తెలిస్తే మరింత సాన్నిహిత్యాన్ని పెంచుకుంటాడు. ల్యాప్‌టాప్‌ విషయంలో మంచి పట్టు ఉందని.. అతడ్ని తమ ఇంటికి లేక, హాస్టల్ కు తీసుకెళ్తే అంతే సంగతులు. ముఖ్యంగా బ్యాచ్ లర్లనే ఎక్కువగా టార్గెట్ చేస్తాడు. వారు ఇండే గదికి రాకపోకలను నిత్య గమనిస్తాడు. సాధారణంగా చదువు, ఉద్యోగం కోసం కొంతమంది కలిసి విశాఖలో జీవనం సాగిస్తుంటారు. వీరు రోజూ తమ విధులకు వెళ్లే సమయంలో గదిలో ఉండే మిగతా వారి కోసం తాళాలను ఇంటి పరిసరాల్లో జాగ్రత్త చేసి వెళ్తుంటారు. అలాంటి గదుల్లోకి ఎవరూ లేని సమయంలో మణికంఠ ప్రవేశించి ఎలక్ట్రానిక్‌ వస్తువులు, నగదు దొంగిలిస్తుంటాడు.

  అయితే కేవలం ఐదు ల్యాప్‌టాప్‌ లు పోయినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. కానీ మణికంఠను విచారించే సమయంలో 12 దొంగిలించినట్లు ఒప్పుకొన్నాడు. దీంతో నిందితుడిని అరెస్టు చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇతడు గతంలో హైదరాబాద్‌లో కూడా మోసం చేసినట్లు కేసు నమోదైందని పోలీసులు వెల్లడించారు. అలా దొంగిలించిన వాటిని వివిధ దుకాణాలకు తీసుకువెళ్లి, తన ఆధార్‌కార్డును చూపి వాటిని అమ్మేసి నగదు చేసుకునేవాడని పోలీసులు తెలిపారు.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Crime, Crime news, Visakha, Visakhapatnam, Vizag

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు