Home /News /crime /

VISAKHAPATNAM 9 MARRIAGES CRIMINAL ARUN KUMAR ARRESTED BY POLICE NGS

Visakhapatnam: విశాఖ నిత్య పెళ్లికొడుకు కేసులో నమ్మలేని నిజాలు? తొమ్మిది కాదు? ఇంకే ఎక్కువమందే ఉంటారని అనుమానం

విశాఖలో నిత్య పెళ్లి కొడుకు అరెస్ట్

విశాఖలో నిత్య పెళ్లి కొడుకు అరెస్ట్

విశాఖలో నిత్య పెళ్లి కొడుకు గురించి వాస్తలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుండడంతో పోలీసులే షాక్ తింటున్నారు. విశాఖలో అతడు చేయని ఇల్లీగల్ దందా లేనట్టు గుర్తించారు. అయితే పోలీసుల పేర్లు వాడుకోవడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అరుణ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఇంకా చదవండి ...
    విశాఖలో మా‘నవ’మృగం లీలలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు తొమ్మిది మందిని పెళ్లి చేసుకున్నాడని అనుకున్నారు. కానీ అతడి కాల్ డేటా పరిశీలిస్తుంటే.. ఈ జాబితా ఇంకా పెరిగేలా కనిపిస్తోంది. అందమైన యువతులు, మహిళలకు వల వేయడం.. తరువాత వారికి అరచేతిలో స్వర్గం చూపిస్తానంటూ.. పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటానని నమ్మించడం. సినిమాలను విపరీతంగా చూసే అరుణ్ కుమార్.. అమ్మాయిలను వలలో వేసుకోడానికి ఆ సినిమాల్లో డైలాగ్ లు చెబుతూ.. బుట్టలో వేసుకునే వాడు. మొదట ప్రేమ అని చెప్పి.. కొన్ని రోజుల తరువాత వారికి నమ్మకం కలిగించడానికి రహస్యపు పెళ్లి చేసుకునేవాడు. అలా పెళ్లి తరువాత అతడికి మోజు తీరే వరకు బాగానే సంసారం నడిపేవాడు. చేతిలో డబ్బులు అయిపోయినా.. అలా పెళ్లి చేసుకున్న అమ్మాయిపై మోజు తీరిన.. అప్పటి వరకు లవర్ బాయ్ గా ఉన్న అతడిలో రాక్షసుడు నిద్ర లేస్తాడు. అంతే వ్యభిచారం చేయమని ఒత్తిడి చేస్తాడు.. కుదరదు అంటే చంపేస్తానని బెదిరిస్తాడు. అతడి వలలో చిక్కుకున్న బాధితులు అందరూ చెబుతున్న మాటలు ఇవి. చివరికి స్నేహితుడి భార్యను కూడా వదల్లేదు.

    అయితే ఇద్దరు మహిళలు ధైర్యం చేసి మహిళా సంఘాలను ఆశ్రయించడంతో ఈ నిత్య పెళ్లికొడుకు లీలలు వెలుగులోకి వచ్చాయి. విశాఖలో సంచలనం రేపిన ఈ నిత్య పెళ్లికొడుకు అరుణ్ కుమార్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమ, పెళ్లి పేరుతో మహిళలకు వల వేసి వారిని మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్న మోసగాడి లీలలు.. బుధవారం వెలుగులోకి వచ్చాయి. దీనిపై డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆదేశాలతో విశాఖ పోలీసులు అరుణ్‌కుమార్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. వివిధ కోణాల్లో ఆ మానవ మృగాన్ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

    ఇప్పటి వరకు అరుణ్‌కుమార్‌ పెళ్లి పేరుతో ఎంతమందిని మోసం చేశాడనే వివరాలు రాబడుతున్నారు. నిందితుడి నుంచి వచ్చిన సమాచారం మేరకు బాధితులను సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారు. అరుణ్‌ కుమార్‌ చేతిలో మోసపోయిన వారు నేరుగా తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు స్పష్టం చేశారు. ఇప్పటికే ఈకేసులో ఫిర్యాదు చేసిన ఇద్దరు బాధిత మహిళల నుంచి పోలీసులు సమాచారం సేకరించారు. ఇప్పటి వరకు అందరూ బయటకు రాకపోయినా.. అరుణ్‌ కుమార్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్న వారు చాలా మంది ఉన్నట్టు తెలుస్తోంది. నిందితుడి మొబైల్ ఆధారంగా లభ్యమైన వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. వ్యభిచారం, గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్టు ఇప్పటికే ఆధారాలు సేకరించారు. ఈ కేసులో ఫిర్యాదు చేసిన ఓ మహిళ భర్త అనుమానాస్పద మృతి కేసులోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే ఆ చనిపోయింది కూడా అరుణ్ కుమార్ ఫ్రెండే అని.. అతడ్ని అరుణ్ కుమారే చంపాడని బాధితురాలు ఆరోపిస్తోంది.

    మరోవైపు అరుణ్ కుమార్ ఇంటిలో మారణాయుధాలు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు.. ఈ కామాంధుడికి ఎవరెవరు సహకారం అందించారనే కోణంలోనూ విచారిస్తున్నారు. అలాగే ఇతగాడి లీలలపై కొద్ది రోజుల కిందటే ఫిర్యాదు అందినా నిర్లక్ష్యం వహించిన పోలీసుల పాత్రపైనా.. డీజీపీ ఆదేశాలతో దృష్టి పెట్టినట్టు సమాచారం.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Crime, Crime news, Crime story, Visakha, Visakhapatnam, Vizag

    తదుపరి వార్తలు