విశాఖలో దారుణం... ఐదేళ్ల చిన్నారితో అసభ్య ప్రవర్తన

బాలిక గట్టిగా అరవడంతో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు బయటకు వచ్చి చూసేసరికి గౌరీశంకర్‌ పారిపోయేందుకు ప్రయత్నించాడు.

news18-telugu
Updated: December 21, 2019, 9:22 AM IST
విశాఖలో దారుణం... ఐదేళ్ల చిన్నారితో అసభ్య ప్రవర్తన
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అన్నెంపున్నం తెలియని ఐదేళ్ల చిన్నారితో ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. అతడి నీఛపనిని వెంటనే గుర్తించిన గుర్తించిన స్థానికులు దేహశుద్ధి చేసి అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన శుక్రవారం విశాఖపట్నం గాజువాకలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీనగర్‌ ప్రాంతంలోని అమ్మమ్మ ఇంటి ముందు ఐదేళ్ల చిన్నారి ఆడుకుంటోంది. ఆ సమయంలో అక్కడికి వెళ్లిన టి.గౌరీశంకర్‌ అనే వ్యక్తి వృద్ధురాలితో మాట్లాడుతుండగా.. ఆ చిన్నారి మూత్ర విసర్జన కోసం ఇంటి బయటకు వెళ్లింది. ఇది గమనించిన గౌరిశంకర్ అక్కడ్నుంచి చిన్నారి వద్దకు వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు.

బాలిక గట్టిగా అరవడంతో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు బయటకు వచ్చి చూసేసరికి గౌరీశంకర్‌ పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో అతడ్ని స్థానికుల సహాయంతో పట్టుకొని దేహశుద్ధి చేశారు. ఇంటి గేటుకు కట్టేసి గాజువాక పోలీసులకు సమాచారం అందించారు. గాజువాక సీఐ సూరినాయుడు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. నిందితుడిపై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. కూలిపనులు చేసుకొని బతికే నిందితుడు ఒడిశా ప్రాంతానికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు.
First published: December 21, 2019, 9:22 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading