విశాఖ దివ్య మరణం వెనుక భయంకరమైన విషయాలు...

అర్జంటుగా దివ్య అంత్యక్రియలు నిర్వహించడానికి ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తామంటూ వసంత కంగారుపెట్టినట్టు తెలిసింది.

news18-telugu
Updated: June 6, 2020, 10:11 PM IST
విశాఖ దివ్య మరణం వెనుక భయంకరమైన విషయాలు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
విశాఖలో సంచలనం రేకత్తించిన దివ్య మరణం వెనుక భయంకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె శరీరంపై 33 గాయాలు ఉన్నట్టు వైద్యుల పోస్టుమార్టంలో తేలింది. ఆమెకు మూడు రోజుల పాటు కనీసం నీళ్లు కూడా ఇవ్వకుండా శరీరం మీద వాతలు పెట్టారు. ఆమె మర్మాంగం మీద కూడా గాయాలు ఉన్నట్టు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఓ రకంగా ఆమెకు బ్రతికుండగానే నరకం చూపించినట్టు భావిస్తున్నారు.

దివ్వ ఎవరు? విశాఖ ఎలా వచ్చింది?

తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామానికి చెందిన 20 సంవత్సరాల దివ్యకు ఎవరూ లేరు. ఆమెకు రాజమండ్రికి చెందిన మహేష్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఆమెను తీసుకుని కొన్ని రోజుల క్రితం విశాఖ తీసుకుని వెళ్లాడు. అక్కడ ఎన్ఏడీ కాలనీలో ఉండే ఓ మహిళ వద్ద ఉంచాడు. అక్కడ కొన్నాళ్లు ఉన్న దివ్య బయటకు వచ్చేసింది. దివ్యకు విశాఖలోనే అక్కయ్యపాలెంలో ఉండే వసంతతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో ఆమె వద్దకు వెళ్లింది. జూన్ 3న దివ్య శవమై తేలింది.

దివ్యను తీవ్రంగా హింసించిట్టు పోస్టుమార్టం రిపోర్టు చెబుతోంది. ఆమె కనుబొమ్మలను కూడా పీకేందుకు ప్రయత్నించినట్టు ఆనవాళ్లు ఉన్నాయి. శరీరం మీద వాతలు ఉన్నాయి. దివ్య చనిపోయిన రోజు రాత్రే.. నిజాన్ని కప్పిపెట్టడానికి వసంత, ఆమె సోదరి ప్రయత్నించినట్టు తెలిసింది. శ్మశానంలో అంతిమయాత్ర వాహనం నడిపే వ్యక్తి వద్దకు వచ్చి.. తమ ఇంట్లో పనిచేసే ఓ యువతి చనిపోయిందని, అంత్యక్రియలు నిర్వహించాలని చెప్పింది. వారు అలా కుదరదని చెప్పారు. పోలీసుల వద్దకు వెళ్లాలని సూచించారు. రాత్రి సమయంలో సుమారు 10 సార్లు తనకు ఫోన్ చేసినట్టు శ్మశానంలో అంత్యక్రియల ఏర్పాట్లు చేసే వ్యక్తి ఓ న్యూస్ చానల్‌తో మాట్లాడుతూ చెప్పాడు. ఎంత డబ్బు కావాలన్నా ఇస్తామన్నారని, రూ.10వేలు, రూ.15వేలు అయినా ఇస్తామని చెప్పారని అతడు తెలిపాడు. డబ్బుల కోసం కక్కుర్తి పడితే తర్వాత తాము పోలీసుల చుట్టూ తిరగాల్సి వస్తుందంటూ ఆమె ప్రతిపాదనకు నిరాకరించాడు.
First published: June 6, 2020, 10:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading